Share News

ఖరీఫ్‌కు ప్రణాళిక

ABN , Publish Date - Jun 06 , 2026 | 12:21 AM

జిల్లాలో రానున్న ఖరీఫ్‌కు పటిష్ఠ ప్రణాళిక అమలు చేయాలి.. విత్తనం నుంచి ధాన్యం కొనుగోలు వరకు అన్ని దశల్లో రైతులకు వివిధ శాఖలు సమ న్వయంతో పనిచేసి అండగా నిలవా’లని రాష్ట్ర పౌర సర ఫరాలశాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్‌ పిలుపునిచ్చారు.

ఖరీఫ్‌కు ప్రణాళిక
సమావేశంలో మాట్లాడుతున్న ఇన్‌చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్‌.. చిత్రంలో ఎమ్మెల్యేలు రోషన్‌ కుమార్‌, ధర్మరాజు, చంటి, ప్రభాకర్‌, ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ, కలెక్టర్‌ వెట్రిసెల్వి, జేసీ అభిషేక్‌ గౌడ

ఉద్యాన పంటలతో ఏటా 15 శాతం వృద్ధి

15లోగా ఓఅండ్‌ఎం పనులు

నెలాఖరులోగా రోడ్లపై గుంతలు పూడ్చివేత

తొలిసారిగా రాజ్యసభ సభ్యుడు పాకా సత్యనారాయణ హాజరు

ఏలూరు, జూన్‌ 5(ఆంధ్రజ్యోతి):‘జిల్లాలో రానున్న ఖరీఫ్‌కు పటిష్ఠ ప్రణాళిక అమలు చేయాలి.. విత్తనం నుంచి ధాన్యం కొనుగోలు వరకు అన్ని దశల్లో రైతులకు వివిధ శాఖలు సమ న్వయంతో పనిచేసి అండగా నిలవా’లని రాష్ట్ర పౌర సర ఫరాలశాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్‌ పిలుపునిచ్చారు. కలెక్టరేట్‌లో శుక్రవారం జిల్లా సమీక్ష కమిటీ సమావేశం ఆయన అధ్యక్షతన జరిగింది. ప్రధానంగా గత సమావేశంలో ప్రజా ప్రతినిధులు తెలిపిన అంశాలపై తీసు కున్న చర్యలు, ఖరీఫ్‌ సంసిద్ధత, వ్యవసాయ అనుబంధ రంగా లు, పీఎం సూర్యఘర్‌ యోజన, జలధార–జలహారతి, ఓఅండ్‌ ఎం పనుల ప్రగతి, రహదారుల అభివృద్ధి అంశాలపై చర్చ సాగింది. హౌసింగ్‌ శాఖ మంత్రి కొలుసు పార్థసారఽథి సమా వేశానికి హాజరుకాకపోవడం చర్చనీయాంశమైంది. రాజ్యసభ సభ్యుడు పాకా సత్యనారాయణ సమావేశానికి తొలిసారిగా హాజరు కావడం గమనార్హం. తొలుత కలెక్టర్‌ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో 168 ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు లక్ష్యం కాగా 167 యూనిట్లు ఏర్పాటు చేశామన్నారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ‘ఏలూరు నగరంలో మూడు లే–అవుట్‌ల్లో 6,093 ఇళ్లు మంజూరు చేశారు. ఇంకా ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టలేదు. వారికి కేటా యించిన ఇళ్లను రద్దు చేసి, అర్హులైన వారికి కేటాయిం చాలి. కార్పొరేషన్‌లో రెండోపూట పారిశుధ్య కార్మికులు విధులకు డుమ్మా కొడుతున్నారు. దీనిపై ఆకస్మిక తనిఖీలు చేయా’ల న్నారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ మాట్లా డుతూ ‘గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏఐబీ పథకం కింద నియోజకవర్గంలో చేపట్టిన పనులు ఇంకా పూర్తి కాలేదు. దీనిపై రెండేళ్ల నుంచి ప్రశ్నిస్తున్నా పంచాయతీరాజ్‌ శాఖ అధికారులకు చీమకుట్టినట్లైనా లేదు. ఉన్నతాధికారు లకు చెప్పామని దాటవేస్తున్నారు. ఇది పద్ధతి కాదు. రోడ్లపై రాళ్లు లేచి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోడ్లు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయడంపై అధికారులు దృష్టి పెట్టా’లన్నారు. చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్‌ కుమార్‌ మాటాడుతూ ‘మా నియోజకవర్గంలో ఆయిల్‌ ఫామ్‌, కోకో సాగు జరుగుతుంది. ఇక్కడ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పా టుకు అనుకూల పరిస్థితులున్నాయి. అఽధికారులు తక్షణం చర్యలు తీసుకోవాలి. చింతలపూడిలో రోడ్ల మరమ్మతులు పూర్తి చేయా’లన్నారు. సమావేశంలో జేసీ అభిషేక్‌ గౌడ, ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ, ప్రభుత్వ విప్‌ బొమ్మిడి నాయకర్‌, ఆర్టీసీ విజయవాడ జోనల్‌ చైర్మన్‌ రెడ్డి అప్పల నాయడు, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ జుత్తిగ నాగరాజు, డీసీఎంఎస్‌ చైర్మన్‌ చాగంటి మురళీకృష్ణ, వడ్డీ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ ఘంటసాల వెంకటలక్ష్మి, రాష్ట్ర మాల కార్పొరేషన్‌ డైరె క్టర్‌ దాసరి ఆంజనేయులు, డీఆర్వో దేవకీదేవీలు పాల్గొన్నారు.

కొల్లేరు ప్రజలకు న్యాయం చేయాలి

కొల్లేరు ఐదో కాంటూరు పరిధిలోని జిరాయితీ భూమి దారులకు న్యాయం చేయాలి. కొల్లేరు ఆపరేషన్‌ సమ యంలో తొలగించిన జిరాయితీ భూముల్లోని చెరువులు, అభయారణ్య పరిధిలో చేర్చారని, 5 కాంటూరు సరి హద్దులను మాన్యువల్‌గా సర్వే చేసి జిరాయితీదారులకు న్యాయం చేయాలి.

– పాకా సత్యనారాయణ, రాజ్యసభ సభ్యుడు

ముఖ్యమైన నిర్ణయాలు..

ఈనెల 15వ తేదీలోగా కాల్వలకు నీరు విడుదల చేయనున్న దృష్ట్యా జలవనరులశాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఓఅండ్‌ఎం పనులు ఆలోగా పూర్తి చేయాలని లేకపోతే కాంట్రాక్టర్ల బిల్లుల నిలుపుదలకు తీర్మానం.

రైతులకు భూసార పరీక్షా కార్డులు అందించి, దాని ప్రకారం ఎరువుల వినియోగం జరిగేలా చూడాలి.

రైతులకు నాన్‌ ప్రిపర్డ్‌ వరి రకాలు సాగు చేయకుండా చూడాలని వ్యవసాయాధికారులకు ఆదేశం.

జిల్లాలో ఉద్యాన పంటలు వృద్ధిరేటు 15 శాతం సాధించేందుకు ఆయిల్‌ఫామ్‌, కోకో పంటలకు ప్రోత్సాహం.

జలధార– జలహారతి 100 రోజుల ప్రణాళికలో భాగంగా నిర్దేశించిన పనులు ఈ నెలాఖరు నాటికి పూర్తి కావాలి.

జిల్లాలో పేదలకు మంజూరు చేసిన ఇళ్లలో 16 వేల మంది లబ్ధిదారులు ఇంకా నిర్మాణ పనులు ప్రారంభించనందున వారికి రద్దు చేసి, ఆగస్టు 15వ తేదీ నుంచి ప్రజల నుంచి కొత్తగా దరఖాస్తుల స్వీకరణ

రోడ్లపై గుంతలు లేకుండా ఈ నెలాఖరు నాటికి మరమ్మతులు ఆర్‌అండ్‌బీ అధికారులు పూర్తి చేయాలి.

Updated Date - Jun 06 , 2026 | 12:22 AM