పచ్చళ్లు పట్టాలా.. వద్దా!
ABN , Publish Date - Apr 05 , 2026 | 12:22 AM
ఇరాన్– ఇజ్రాయెల్, అమెరికా యుద్ధ ప్రభావంతో వంటనూనెల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఒకే సారి ధరలు పెరగటంతో సామాన్య, మధ్య తరగతి కుటుంబాల వారు ఆర్థిక ఇబ్బందులు ఎదు ర్కోవాల్సి వస్తోంది.
పచ్చళ్లు పట్టాలా.. వద్దా!
పెరిగిన ఆయిల్స్ ధరలతో జనం లబోదిబో
ఏలూరుసిటీ/తాడేపల్లిగూడెం రూరల్, ఏ ప్రిల్ 4(ఆంధ్రజ్యోతి):ఇరాన్– ఇజ్రాయెల్, అమెరికా యుద్ధ ప్రభావంతో వంటనూనెల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఒకే సారి ధరలు పెరగటంతో సామాన్య, మధ్య తరగతి కుటుంబాల వారు ఆర్థిక ఇబ్బందులు ఎదు ర్కోవాల్సి వస్తోంది. వంటనూనెలు దిగు మతులు నిలిచిపోవటంతో ధరలు పెరుగు తున్నాయని చెబుతున్నారు. సాధారణంగా వేసవి కాలంలో మార్చి నెలాఖరు నుంచి మే నెలాఖరు వరకు పచ్చళ్ళ సీజన్ ఉంటుంది. ఆవకాయ పచ్చడితో పాటు వివిధ రకాల పచ్చళ్ళను ఈ సీజన్‌లోనే తయారు చేసుకుం టారు. ఈ సమయంలో సాధారణంగా వంట నూనెల ధరలు పెరుగుతూ ఉంటాయి. కాని పచ్చళ్ళకు వినియోగించే నూనెలతో పాటు సాధారణంగా ఇంట్లో వాడకానికి వినియోగి ంచే వంట నూనెల ధరలు కూడా లీటర్ ప్యాకెట్‌కు 20 రూపాయలు వరకు పెంచే శారు. బ్రాండెడ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ లీటర్ గతంలో 60 రూపాయలు ఉండగా ఇప్పుడు 180 రూపాయలకు పెరిగింది. పామాయిల్ లీటర్‌కు గతంలో 110 రూపాయలు ఉండగా ఇప్పుడు ఏకంగా 130 నుంచి 140 రూపాయ లు వరకు అమ్మకాలు చేస్తున్నారు. వేరుశనగ నూనె (కర్నూల్‌బ్రాండ్) లీటర్‌కు గతంలో 175 రూపాయలు ఉండగా ఇప్పుడు 200 రూపాయలకు ధర చేరింది. ఇక పచ్చళ్లకు వినియోగించే వేరుశనగ నూనె గతంలో కిలో 240 నుంచి 260 రూపాయలు ఉండగా ఇప్పుడు 300 రూపాయలు వరకు ధర పలుకుతోంది. నువ్వుల నూనె కిలో గతంలో 340 రూపాయలు ఉండగా ఇప్పుడు మార్కె ట్‌లో 350 నుంచి 360 రూపాయల వరకు ధర పలుకుతోంది.
పెరిగిన నౌకా రవాణా చార్జీలు
మన ప్రాంతంలో ఎక్కువగా వినియో గించే సన్‌ఫ్లవర్‌లో ఎక్కువ భాగం రష్యా, ఉక్రెయిన్ దేశాల నుంచే రావాలి. గల్ఫ్ యు ద్ధంతో ఈ దేశాల నుంచి వంట నూనెలతో వచ్చే నౌకల ప్రయాణాలకు ఆటంకం ఏర్ప డింది. దీంతో నౌకా కంపెనీలు రవాణా చార్జీలు పెంచేశాయి. ఈ ప్రభావం రిటైల్ మార్కెట్‌పై కనిపిస్తోంది.