Share News

దివ్యాంగుల సంక్షేమానికి తోడ్పాటు

ABN , Publish Date - Oct 14 , 2026 | 12:33 AM

దివ్యాంగులు భగవత్‌ స్వరూపులని, వారి సంక్షేమం, ఆత్మగౌరవం, స్వావలం భనకు తోడ్పాటునందించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి డాక్టర్‌ నిమ్మల రామానాయుడు అన్నారు

దివ్యాంగుల సంక్షేమానికి తోడ్పాటు
దివ్యాంగులకు అందజేసే పరికరాలను పరిశీలిస్తున్న మంత్రులు శ్రీనివాసవర్మ, డాక్టర్‌ రామానాయుడు

మంత్రి నిమ్మల, కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ

రూ.1.10 కోట్లతో 365 మందికి ఉపకరణాల పంపిణీ

పాలకొల్లు అర్బన్‌, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): దివ్యాంగులు భగవత్‌ స్వరూపులని, వారి సంక్షేమం, ఆత్మగౌరవం, స్వావలం భనకు తోడ్పాటునందించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి డాక్టర్‌ నిమ్మల రామానాయుడు అన్నారు. నియోజకవర్గంలోని దివ్యాంగులకు పాలకొల్లు ఏఎంసీ ఆవ రణలో మంగళవారం ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి నిమ్మల పాల్గొని మాట్లాడారు. ఎస్‌ఏఐఎల్‌ సీఎస్‌ఆర్‌ నిధులు రూ.1.10 కోట్ల విలువైన 540 ఉపకరణాలను 365 మందికి కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌, కలెక్టర్‌ సి.నాగరాణి, కూటమి నాయకులతో కలిసి అందజేశారు. మంత్రి నిమ్మల మాట్లాడుతూ దివ్యాంగుల పట్ల తమకు ఎంతో గౌరవం, అభిమానం ఉంద న్నారు. కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ మాట్లాడుతూ నవరత్న సంస్థ స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎల్‌ఏ ఐఎల్‌) సీఎస్‌ఆర్‌ (కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్స్‌బిలిటీ)నిధులు రూ.1.10 కోట్లతో అందించిన బ్యాటరీతో నడిచే ట్రైసైకిళ్లు, వీల్‌ చైర్లు, వినికిడి యంత్రాలు అందజేశామన్నారు. ఏఎంసీ చైర్మన్‌ కోడి విజయభాస్కర్‌, పెచ్చెట్టి బాబు, గండేటి వెంకటేశ్వరరావు, ఉన్నమట్ల కపర్ధి, రావూరి సుధ పాల్గొన్నారు.

Updated Date - Oct 14 , 2026 | 12:33 AM