Share News

హైస్కూల్‌ ప్లస్‌లకు పీజీటీల సర్దుబాటు

ABN , Publish Date - Jul 04 , 2026 | 12:41 AM

ఉమ్మడి జిల్లాలోని హైస్కూల్‌ ప్లస్‌ (జడ్పీ జూనియర్‌ కళాశాల)ల్లో డిప్యుటేషన్లపై ఇంటర్మీడియట్‌ సబ్జెక్టులను బోధించేందుకు పీజీటీల నియామకాలకు శుక్రవారం స్థానిక డీఈవో కార్యాల యంలో వర్క్‌ అడ్జస్ట్‌మెంట్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించారు.

హైస్కూల్‌ ప్లస్‌లకు పీజీటీల సర్దుబాటు
పీజీటీల బదిలీ కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తున్న డీఈవో, తదితరులు

నేటి నుంచి మండలాల్లో సర్‌ప్లస్‌ టీచర్లకు వర్క్‌ అడ్జస్ట్‌మెంట్‌

ఏలూరు అర్బన్‌, జూలై 3 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి జిల్లాలోని హైస్కూల్‌ ప్లస్‌ (జడ్పీ జూనియర్‌ కళాశాల)ల్లో డిప్యుటేషన్లపై ఇంటర్మీడియట్‌ సబ్జెక్టులను బోధించేందుకు పీజీటీల నియామకాలకు శుక్రవారం స్థానిక డీఈవో కార్యాల యంలో వర్క్‌ అడ్జస్ట్‌మెంట్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించారు. పలు సబ్జెక్టుల్లో మొత్తం 45 మంది పీజీటీల కొరత ఉండగా, తగిన బోధనార్హతలుండి, ఆసక్తి కనబరిచిన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించగా ఉమ్మడి జిల్లాలో 208మంది ముందుకు వచ్చారు. వీరందరి సీనియార్టీని పరిగణనలోకి తీసుకుని జాబితాను తయారు చేశారు. జీలుగుమిల్లి హైస్కూల్‌ ప్లస్‌లో సర్‌ప్లస్‌గా వున్న ఐదుగురు పీజీటీల తోపాటు, కొరతవున్న హైస్కూల్‌ ప్లస్‌లలో ఆయా సబ్జెక్టుల్లో భర్తీ చేసేందుకు మరో 40మందిని కలిపి మొత్తం 45 మంది పీజీటీల నియామకాలకు కౌన్సెలింగ్‌ నిర్వహించి డిప్యుటేషన్లపై బదిలీ ఉత్తర్వులను జారీచేశారు. ఈ నియామకాలు పొందిన స్కూల్‌ అసిస్టెంట్లస్థానే లోటును ఆయా హైస్కూళ్లలో భర్తీ చేసేందుకు వర్క్‌ అడ్జస్ట్‌మెంట్‌ ప్రక్రియను శనివారం నుంచి ప్రారంభిస్తారు. దీనిలో భాగంగా ఏలూరు జిల్లాలో గుర్తించిన సర్‌ప్లస్‌ స్కూల్‌ అసిస్టెంట్లు, ఎస్జీటీలను నీడ్‌/డిఫిసిట్‌ వున్న పాఠశాలలకు సర్దుబాటు చేయడానికి అన్ని మండలాల్లో శనివారం నుంచి ఈనెల 9లోగా ఆన్‌లైన్‌ విధానంలో కౌన్సెలింగ్‌ నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. కౌన్సెలింగ్‌ నిర్వహణను డీఈవో వెంకటలక్ష్మమ్మ పర్యవేక్షించారు.

Updated Date - Jul 04 , 2026 | 12:41 AM