పోరాటానికి సన్నద్ధం
ABN , Publish Date - Mar 07 , 2026 | 12:33 AM
ఓల్డ్ పెన్షన్ స్కీము (ఓపీఎస్)కు చెం దిన పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులు, ఉపా ధ్యాయులు జిల్లా మార్పిడితో గత నాలుగేళ్లుగా ఎదుర్కొంటున్న ప్రావిడెంట్‌ఫండ్ ఖాతాల సమస్యను పరిష్కరించుకునేందుకు రంగంలోకి దిగారు.
జడ్పీ పీఎఫ్ బాధిత ఉద్యోగుల కమిటీ ఏర్పాటు
కో ఆర్డినేటర్‌గా రమేష్ నియామకం
సీఎం, డిప్యూటీ సీఎంలకు పోస్టులో వినతిపత్రాలు
ముదినేపల్లి/మండవల్లి,మార్చి 6 (ఆంధ్ర జ్యోతి): ఓల్డ్ పెన్షన్ స్కీము (ఓపీఎస్)కు చెం దిన పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులు, ఉపా ధ్యాయులు జిల్లా మార్పిడితో గత నాలుగేళ్లుగా ఎదుర్కొంటున్న ప్రావిడెంట్‌ఫండ్ ఖాతాల సమస్యను పరిష్కరించుకునేందుకు రంగంలోకి దిగారు. జీతాల నుంచి మినహాయిస్తున్న పీఎఫ్ చందాల మొత్తాన్ని కృష్ణాజిల్లా పరిషత్‌లో ఉన్న తమ వ్యక్తి గత అకౌంట్ల జమ చేయకపోవడం పై పోరాడేందుకు నాలుగు మండలాల ఉద్యోగు లు, ఉపాధ్యాయులు శుక్రవారం జడ్పీ పీఎఫ్ బాధిత ఉద్యోగుల కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీకి కైకలూరు నియోజకవర్గ కోఆర్డినేటర్ గా ముదినేపల్లి హైస్కూలు లెక్కల ఉపాధ్యా యుడు గొట్టిపాటిరమేష్ నియమితులయ్యారు. తమ జీతాల నుంచి మినహాయించిన పీఎఫ్ చందాల మొత్తాన్ని కృష్ణాజిల్లా పరిషత్‌లోని తమ ఖాతాల్లో జమ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, కైక లూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌కు, అధికా రులకు కమిటీ తరపున 363మంది సంతకాలతో శుక్రవారం వినతిపత్రాలను రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపారు. వినతిపత్రాల కాపీలను కమిటీ కో ఆర్డినేటర్ రమేష్‌తో పాటు ఏపీటీఎఫ్, యూటీఎఫ్ నాయ కులు బేతాళ రాజేంద్ర ప్రసాద్, ఐ.దుర్గా ప్రసాద్ తదితరులు ప్రదర్శించారు. కైకలూరు సబ్ ట్రెజరీలో తమ జీతాల నుంచి మినహా యిస్తున్న పీఎఫ్ చందాల మొత్తం ఏమవుతు న్నదో అర్థం కావడం లేదని, ఏలూరు జిల్లాలో కలిసిన నాటి నుంచి ఇప్పటి వరకు పీఎఫ్ ఖాతాల్లో అసలు, వడ్డీ జమ కావాల్సి ఉందని యూనియన్ నాయకులు తెలిపారు. త్వరలో కృష్ణా, ఏలూరు జిల్లా ట్రెజరీ అధికారులు, జిల్లా పరిషత్ అధికారులను కలిసేందుకు కమిటీ కార్యాచరణ రూపొందిస్తున్నదని తెలిపారు. కాగా మండవల్లి మండల కమిటీ కన్వీనర్ సీహెచ్ పిచ్చోడు మాస్టారు మాట్లాడుతూ జిల్లాల పునర్వివస్థీకరణలో భాగంగా కైకలూరు, మండవల్లి, ముదినేపల్లి, కలిదిండి మండలాలు ఏలూరుజిల్లాలో విలీనం అయిన తరువాత ఈ సమస్య ఏర్పడిందని తెలిపారు. ఈ విషయాన్ని పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఇప్పటి వరకు సరైన స్పందన లభించలేదన్నారు. సమస్యకు తక్షణ పరిష్కారం లభించకపోతే ప్రత్యేక ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.