ఎరువు..బరువా ?
ABN , Publish Date - May 06 , 2026 | 12:32 AM
ఎరువుల ధరల పెంచేం దుకు కంపెనీలు సమాయత్తమ య్యాయి. కొత్త ధరలు ప్రకటించాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి రాయితీ విధానం ప్రకటించిన తర్వాత కంపెనీలు తుది నిర్ణయం తీసుకోనున్నట్టు వ్యాపార వర్గాలు చెపుతు న్నాయి.
కొత్త ఎమ్మార్పీలతో ముందుకొస్తున్న కంపెనీలు
యూరియా, డీఏపీ ధరలు యథాతథం
20–20 బస్తా రూ.1800
కేంద్రం రాయితీ ఇస్తే అన్నీ పాత ధరకే
ఉత్కంఠగా చూస్తున్న వ్యాపార వర్గాలు
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
ఎరువుల ధరల పెంచేం దుకు కంపెనీలు సమాయత్తమ య్యాయి. కొత్త ధరలు ప్రకటించాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి రాయితీ విధానం ప్రకటించిన తర్వాత కంపెనీలు తుది నిర్ణయం తీసుకోనున్నట్టు వ్యాపార వర్గాలు చెపుతు న్నాయి. అయితే అత్యధికంగా రైతులు వినియోగించే యూరియా, డీఏపీ ధరలు మాత్రం యథాతథంగా ఉంటాయి.ఈ విషయంపై కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. కంపెనీలు సైతం వీటి ధరలు పెంచలేదు. మిగిలిన వాటిపై కొత్త ధరలను ముందు గానే నిర్ధారించేశాయి. వ్యాపారులకు జాబితాను పంపాయి. కొత్త ధరల తోనే జిల్లాలోని గోదా ముల్లో కంపెనీలు నిల్వ చేసుకుంటున్నాయి. ముఖ్యంగా 20–20 ఎరువుపైనే జిల్లాలో చర్చ జరుగుతోంది. రబీలో రైతులు అత్యధికంగా ఇదే ఎరువును విని యోగిస్తారు. వాస్తవానికి డీఏపీని వాడితేనే నాణ్యమైన దిగుబడులు వస్తున్నాయి. చీడ పీడల బెడద తక్కువగా ఉంటోంది. దేశవ్యాప్తంగా డీఏపీ వినియోగం ఎక్కువ. జిల్లానే తీసుకుంటే ఖరీఫ్ సీజన్‌లో డీఏపీని విని యోగిస్తారు. రబీలో వరిచేను వేగంగా ఎద గాలని 20–20 ఎరువును చల్లుతుంటారు. అదే ఇప్పుడు ధర పెరిగే అవకాశం ఉంది. ఇప్పటిదాకా బస్తా రూ.1500 లకు లభ్యమయ్యేది. ఇప్పుడు రూ.1800లకు చేరింది. పొటాష్ ఎరువును కూడా కొద్దిగా పెంచే యోచనలో కంపెనీలున్నాయి.
సొసైటీల ముందుచూపు
జిల్లాలో పలు సొసైటీలు ముందుగానే ఖరీఫ్‌కు ఎరువులు నిల్వ చేసు కుంటున్నాయి. ప్రధానంగా ధర పెరుగుతుందన్న ఉద్దేశంతో 20–20 ఎరువులను నిల్వ చేసుకుంటున్నాయి. రబీ నిల్వలు కూడా మిగిలే ఉన్నాయి. కంపెనీలు కొత్త ధరలు పెంచినా సరే పాత ఎరువు కొంత మేర లభ్యమవుతుంది. అయితే కొత్త ధరలు అమలులోకి రావడంపై ఇంకా సందిగ్ధత నెలకొంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కోసం కంపెనీలు చూస్తు న్నాయి. రాయితీ కేవలం యూరియా, డీఏపీకి ఉంటే ఇతర ఎరువులు ధరలు పెరగనున్నాయి. ఇప్పటికే ఎమ్మార్పీలు నిర్ణయించేశాయి. కేంద్రం అన్ని రకాల ఎరువులకు రాయితీ ఇచ్చినట్టయితే ధరలు యథాతథంగా ఉంటాయి.ఇతర రాష్ర్టాల్లో ఎన్నికల కారణంగా కేంద్రం ఇప్పటిదాకా రాయితీపై స్పష్టత ఇవ్వలేదు. యూరియా, డీఏపీపై ధరలు పెంచబోమని మాత్రం స్పష్టమైన ప్రకటన జారీచేసింది. ఇతర ఎరువులపై ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం వల్ల కంపెనీలు ముందుగానే ఎమ్మార్పీలను పెంచి జిల్లాకు సరఫరా చేస్తున్నాయి. వాస్తవానికి పశ్చిమాసియాలో అమెరికా–ఇరాన్ యుద్ధం వల్లే ఎరువుల ధర పెరగడానికి కారణమవుతోంది. ముడిసరుకు ధరలు పెరి గాయి. రవాణా భారం అధికమైంది. కంపెనీలకు ఉత్పత్తి వ్యయం అధికమైంది. డీఏపీ, యూరియా విషయంలో మాత్రం కేంద్రం రాయితీ భరించేందుకు సిద్ధమైంది. పెరిగిన ధరలను కూడా కేంద్రమే భరించేలా నిర్ణయం తీసుకుంది. అయితే 20–20 వంటి ఎరువులపై స్పష్టత రావాల్సి ఉందని వ్యాపార వర్గాలు చెపుతున్నాయి. వారం రోజుల వ్యవధిలోనే కొత్త ధరల విషయం తేలిపోనుంది. ఇప్పటికే పెంచిన ధరల ప్రకారం అమ్మకాలు సాగిస్తారా లేదంటే పాత ధరలకే విక్రయిస్తారా అనేదానిపై వ్యాపార వర్గాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. కేంద్ర నిర్ణయంపైనే అంతా ఆధార పడనుంది. ఇతర ఎరువులు ధరలు పెరిగితే జిల్లాలోనూ డీఏపీ వినియోగం మరింత అధికం కానుంది.