అత్యధిక పెన్షన్లు ఇస్తున్నాం : మంత్రి కొలుసు
ABN , Publish Date - Jun 02 , 2026 | 12:40 AM
దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా అత్యధికంగా పెన్షన్లు అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు.
నూజివీడు, జూన్ 1(ఆంధ్రజ్యోతి):దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా అత్యధికంగా పెన్షన్లు అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. నూజివీడు మండలం పోసానిపల్లిలో సోమవారం పింఛన్ దారుల ఇళ్లకు వెళ్లి యోగాక్షేమాలను, గ్రామ సమస్యలు అడిగి తెలుసుకుని పింఛన్ల సొమ్మును అందజేశారు. మంత్రి మాట్లాడుతూ జిల్లాలో 2,55,816 మంది పింఛన్‌దారులకు రూ.113.29 కోట్లు పంపిణీ చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వానికి వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదేళ్లు పట్టిందన్నారు. ఏపీ అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్, నూజివీడు నియోజకవర్గం పరిశీలకులు మారెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎంపీడీవో సాంబశివరావు, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, గ్రామ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
నిరుపేదలకు ఆర్థిక భరోసా ..
ఏలూరు రూరల్:రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు ఆర్థిక భరోసా కల్పిం చడంలో అత్యంత ప్రాధ్యాన్యం ఇస్తోందని కలెక్టర్ వెట్రిసెల్వి అన్నారు. సోమవారం శనివారపుపేట –1లో ఇంటింటికీ వెళ్లి ఎన్టీఆర్ లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేశారు. ఆర్డీవో లక్ష్మీ ప్రసన్న, డీఆర్‌డీఏ పీడీ విజయలక్ష్మీ, తహసీల్దార్ గాయత్రిదేవి, తదితరులు పాల్గొన్నారు.