Share News

కొత్త పింఛన్లకు ఎదురుచూపులు

ABN , Publish Date - Aug 10 , 2026 | 12:20 AM

ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల కోసం లబ్ధిదారులు ఎదు రుచూస్తున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధి కారంలోకి వచ్చాక కొత్తగా లబ్ధిదారులను ఎంపిక చేసి పింఛన్లు ఇచ్చిన దాఖలాలు లేవు.

కొత్త పింఛన్లకు ఎదురుచూపులు

ప్రభుత్వం నుంచి విడుదల కాని మార్గదర్శకాలు

జిల్లాలో 17,479 దరఖాస్తుల పెండింగ్‌

(ఏలూరుసిటీ–ఆంధ్రజ్యోతి):

ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల కోసం లబ్ధిదారులు ఎదు రుచూస్తున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధి కారంలోకి వచ్చాక కొత్తగా లబ్ధిదారులను ఎంపిక చేసి పింఛన్లు ఇచ్చిన దాఖలాలు లేవు. కేవలం ఒక కుటుం బంలో పింఛన్‌ పొందుతున్న భర్త చనిపోతే అతని భార్యకు వితంతు పింఛన్‌ను మంజూరు చేశారే తప్ప కొత్తగా అర్హులైన వారికి పింఛన్లు ఇవ్వక పోవడంతో రెండేళ్లుగా లబ్ధిదారులు ఎదురుచూపులు చూస్తు న్నారు. గత ప్రభుత్వ హయాంలో అన్ని అర్హతలున్నా రాజకీయ కారణాల వల్ల పింఛన్లు పొందలేక పోయిన లబ్ధిదారులు తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే మంజూ రవుతాయని ఆశించారు. అయితే ఇప్పటికీ కొత్త పింఛన్ల గురించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మార్గదర్శ కాలు విడుదల కాకపోవడంతో వేలాది మంది ఎదురు చూస్తున్నారు. అధికారులు మాత్రం 2024 మార్చి నెల నుంచి పింఛన్ల కోసం వచ్చిన దర ఖాస్తులను పరిగణనలోకి తీసు కున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు విడుదల కాగానే దరఖాస్తులను ఆన్‌లైన్‌ చేసి పింఛన్లు మంజూరు చేసే అవకాశాలున్నాయి. టీడీపీ ప్రజా ప్రతినిఽధులు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలోను లబ్ధిదారులు పింఛన్లు తమకు ఎప్పుడు వస్తాయని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు కూటమి ప్రభుత్వం రాగానే పింఛన్‌ మొత్తాలను గణనీయంగా పెంచడంతో అధిక సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. జిల్లాకు సంబంధించి 2024 మార్చి నుంచి ఇప్పటివరకు జిల్లాలో 17,479 పింఛన్‌ దరఖాస్తులు వచ్చాయని సంబంధిత శాఖాధికారులు నివేదికలు చెబుతున్నాయి. జిల్లాలో ఓఏపీ (వృద్ధాప్య) పింఛన్‌ కోసం 8,739 మంది, వితంతు పింఛన్ల కోసం 4,370 మంది, విభిన్న ప్రతిభావంతుల పింఛన్ల కోసం 2,622మంది, ఇతర పింఛన్ల కోసం వివిధ వర్గాలకు చెందిన లబ్ధిదారులు 1,748 మంది దరఖాస్తు చేసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండటంతో త్వరలో కొత్త పింఛన్లు మంజూరు చేస్తారనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈనెలలోనే మార్గదర్శకాలు విడుదలయ్యే అవకాశాలున్నాయని చెబుతున్నారు.

Updated Date - Aug 10 , 2026 | 12:20 AM