ఇంటిపన్ను బకాయిలు మినహాయించుకుని.. పింఛన్ సొమ్ము అందజేత..?
ABN , Publish Date - Mar 02 , 2026 | 12:52 AM
రాష ్ట్రప్రభుత్వం వృద్ధులు, దివ్యాంగులు, ధీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్న వారికి అందించే పింఛన్ల నుంచి ఇంటి పన్ను వసూలు చేస్తు న్నట్టు మండలంలోని ఆసన్నగూడెం గ్రామ స్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆసన్నగూడెం గ్రామస్థుల ఆవేదన.. వాస్తవం కాదని ఎంపీడీవో వివరణలింగపాలెం, మార్చి 1(ఆంధ్రజ్యోతి): రాష ్ట్రప్రభుత్వం వృద్ధులు, దివ్యాంగులు, ధీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్న వారికి అందించే పింఛన్ల నుంచి ఇంటి పన్ను వసూలు చేస్తు న్నట్టు మండలంలోని ఆసన్నగూడెం గ్రామ స్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామ పంచా యతీ కార్యదర్శి ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ల నుంచి ఇంటి పన్ను బకాయిలను బల వంతంగా వసూలు చేసి రెండు వేల రూపా యలు తగ్గించుకుని మిగతా రూ.2 వేలు ఇస్తు న్నాడంటూ స్థానిక కాలనీ వాసులు ఆరోపిస్తు న్నారు. పెన్షన్‌లు ఎందుకు తగ్గించి ఇస్తున్నా రని కొందరు నిలయదీయగా గ్రామంలో ఇంటిపన్ను వసూలు టార్గెట్ తగ్గిందని గ్రామ స్తులు పన్నులు సరిగా కట్టడం లేదంటూ తాను పెన్షన్ డబ్బుల్లో తగ్గించి ఇస్తున్నట్టు సమాధానమిచ్చినట్టు గ్రామస్థులు చెబుతున్నా రు. ఈ విషయమే ఎంపీడీవో కె.వాణిని ఫోన్ లో వివరణ కోరగా పెన్షన్ల నుంచి ఇంటిపన్ను బకాయిలను బలవంతంగా వసూలు చేస్తున్నా రన్న విషయం వాస్తవం కాదని తాను గ్రామం లో విచారణ చేయగా పెన్షన్ల పంపిణీ తరు వాత మాత్రమే పంచాయతీ కార్యదర్శి గ్రామం లో ఇంటిపన్ను వసూలు చేస్తున్నట్టు తన దృష్టికి వచ్చిందన్నారు. పెన్షన్ల నుంచి పన్ను వసూలు చేయకూడదని అలా చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు.