Share News

88.30 శాతం పింఛన్లు పంపిణీ

ABN , Publish Date - Oct 31 , 2026 | 12:34 AM

నవంబరు నెల సామాజిక పింఛన్ల పంపిణీ లో భాగంగా జిల్లాలో తొలిరోజు శుక్రవారం 2,22,865 మంది లబ్ధిదారులకు (88.30 శాతం) పంపిణీ చేశారు.

88.30 శాతం పింఛన్లు పంపిణీ
ఏలూరులో లబ్ధిదారులకు పింఛన్‌ పంపిణీ చేస్తున్న కలెక్టర్‌ వెట్రిసెల్వి

ఏలూరుసిటీ, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): నవంబరు నెల సామాజిక పింఛన్ల పంపిణీ లో భాగంగా జిల్లాలో తొలిరోజు శుక్రవారం 2,22,865 మంది లబ్ధిదారులకు (88.30 శాతం) పంపిణీ చేశారు. జిల్లాలో మొత్తం 2,52,397 మందికి అందజేయాల్సి ఉండగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అనుసరించి మధ్యాహ్నం 11.59 గంటల వరకే పంపిణీ చేశారు. తొలిరోజు తీసుకోనివారికి రెండో తేదీ నుంచి నాల్గొవ తేదీ వరకు పంపిణీ చేస్తారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం రూ.111.04 కోట్లు పంపిణీ చేయాల్సి ఉండగా తొలిరోజు రూ.97.10 కోట్లు పంపిణీ చేసినట్టు కలెక్టర్‌ వెట్రిసెల్వి పేర్కొన్నారు. ఏలూరు నగ రంలోని ఫిరంగుల దిబ్బ ప్రాంతంలో లబ్ధి దారులకు పింఛన్లను ఆమె స్వయంగా అం దించారు. కమిషనర్‌ భానుప్రతాప్‌, డీఆర్‌డీఏ పీడీ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 31 , 2026 | 12:34 AM