బొలిశెట్టి దాతృత్వం
ABN , Publish Date - May 02 , 2026 | 12:41 AM
పెన్షన్లు మంజూరు కాక ఇబ్బందులు పడుతున్న నియోజకవర్గంలో 40 మంది వికలాంగులకు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తన సొంత నిధులు రూ.1.20 లక్షలు అందజేసి దాతృత్వం ప్రదర్శించారు.
40 మంది వికలాంగులకు మూడు వేలు
చొప్పున రూ.1.20 లక్షల పింఛన్లు పంపిణీ
తాడేపల్లిగూడెం, మే 1(ఆంధ్రజ్యోతి):పెన్షన్లు మంజూరు కాక ఇబ్బందులు పడుతున్న నియోజకవర్గంలో 40 మంది వికలాంగులకు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తన సొంత నిధులు రూ.1.20 లక్షలు అందజేసి దాతృత్వం ప్రదర్శించారు. శుక్రవారం తాడేపల్లిగూడెం తన క్యాంపు కార్యాలయంలో ఒక్కొక్కరికి మూడు వేలు చొప్పున కలెక్టర్ నాగరాణి, తన కుటుంబ సభ్యుల చేతుల మీదుగా బాధితులకు అందజేశారు. ఆ డబ్బులు తీసుకునే సమయంలో వారి కళ్లలో వచ్చి న ఆనందం చూసి తాను పరవశించిననట్లు ఎమ్మెల్యే తెలిపారు.
రెడ్‌క్రాస్ సొసైటీకి తాడేపల్లిగూడెం మున్సిపల్ ఉద్యోగులు, సిబ్బం ది రూ.1,08,300 విరాళాన్ని కలెక్టర్ నాగరాణికి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ దంపతుల చేతుల మీదుగా మున్సిపల్ కమిషనర్ ఏసుబాబు అందజేశారు. మునిసిపల్ సిబ్బందిని సేవాభావాన్ని వారు అభినందించారు.
పట్టణం రెండో వార్డులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను వృద్ధులకు కలెక్టర్, ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ పింఛన్లతో పేదల ముఖా ల్లో ఆనందం వెల్లివిరుస్తోందని వారు చెప్పారు. పెన్షనలో కొంత భాగాన్ని దాచుకోవాలని వృద్ధులకు సూచించారు. కూటమి నాయ కులు, కార్యకర్తలు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.