Share News

అవ్వా తాతలకు ప్రభుత్వం అండ

ABN , Publish Date - Mar 01 , 2026 | 12:28 AM

ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లతో అవ్వ తాతలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు.

అవ్వా తాతలకు ప్రభుత్వం అండ
వృద్ధుడికి పింఛన్‌ అందజేస్తున్న మంత్రి పార్థసారథి

ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ చేసిన మంత్రి పార్థసారథి

నూజివీడు, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లతో అవ్వ తాతలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. సుంకొల్లు, ముక్కోల్లుపాడులో శనివారం ఆయన పింఛన్లు పంపిణీ చేశారు. జిల్లాలో 2,57,658 మంది లబ్ధిదారులకు రూ. 113.04 కోట్లు ఒకరోజు ముందే ప్రభుత్వం అందించిందన్నారు. పింఛన్‌ సొమ్ము భవిష్యత్‌ అవసరాలు, మందులకు వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. గ్రామంలో ప్రతీ ఒక్కరిని పలకరిస్తూ యోగక్షేమాలు తెలుసుకుంటూ మంత్రి సారథి ముందుకు సాగారు. తహసీల్దార్‌ బద్రు, ఎంపీడీవో చెన్ను రాఘవేంద్రనాథ్‌, ఎంపీపీ ఆరేపల్లి శిరీష, యనమదల శ్రీనివాస్‌, మెట్టగూడెం సర్పంచ్‌ కొనకాల నరసింహరావు పాల్గొన్నారు.

జిల్లాలో 92.05 శాతం పింఛన్లు పంపిణీ

ఏలూరు సిటీ, పిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): జిల్లాలో 92.05 శాతం పింఛన్లు పంపిణీ చేశారు. కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి ఏలూరులో ఇటింటికీ వెళ్లి పింఛన్‌దార్ల కుటుంబ యోగ క్షేమాలను తెలుసుకుని పింఛను సొమ్ము అందజేశారు. మార్చి 1 ఆదివారం సెలవు దినం కావడంతో ఒకరోజు ముందుగానే పింఛన్లు పంపిణీ చేశామన్నారు. జిల్లాలో 2,37,174 మందికి పంపిణీ చేసినట్లు డీఆర్‌డీఏ పీడీ టీవీ.విజయలక్ష్మి తెలిపారు. సోమవారం నాటికి నూరుశాతం పింఛన్లు పంపిణీ పూర్తి చేస్తామని ఆమె తెలిపారు. కలెక్టర్‌ వెంట డిప్యూటి కలెక్టర్‌ ఎల్‌.దేవకీదేవి, డీఆర్‌డీఏ పీడీ టీవీ. విజయలక్ష్మి, నగర కార్పొరేషన్‌ కమిషనర్‌ ఎ.భానుప్రతాప్‌, తహసీల్దార్‌ కె.గాయత్రీదేవి, కార్పొరేటర్‌ పి.శామ్యూల్‌, ప్రజా ప్రతినిధులు ఉన్నారు.

Updated Date - Mar 01 , 2026 | 12:28 AM