వైభవంగా జలదుర్గ గోకర్ణేశ్వరస్వామి తెప్పోత్సవం
ABN , Publish Date - Mar 03 , 2026 | 12:12 AM
కొల్లేటికోట పెద్దింటమ్మ జాతరలో భాగంగా జలదుర్గ అమ్మ వారు, గోకర్ణేశ్వరస్వామి తెప్పోత్సవం సోమవారం రాత్రి వైభవంగా జరిగింది.
కైకలూరు, మార్చి 2(ఆంధ్రజ్యోతి):కొల్లేటికోట పెద్దింటమ్మ జాతరలో భాగంగా జలదుర్గ అమ్మ వారు, గోకర్ణేశ్వరస్వామి తెప్పోత్సవం సోమవారం రాత్రి వైభవంగా జరిగింది. ఆలయ కోనేరులో పుష్పాలు, విద్యుత్ దీపాలతో అలంకరించిన హంస వాహనంపై అమ్మ వారిని, స్వామిని ఉంచి వేలాది మంది భక్తుల కోలాహాలం మధ్య తెప్పోత్సవాన్ని నిర్వహించారు. ఉదయం అమ్మవారికి పంచా మృతాలతో అభిషేకాలు, పూజలను నిర్వహించారు. అమ్మ వారికి వస్త్రాలంకరణ, పుష్పాలంకరణ, భక్తులకు ఉచిత ప్రసాదాన్ని భుజబలపట్నానికి చెందిన కంతేటి సాయి శ్యామల దంపతులు, కంతేటి గాయత్రి కుమారుడు దేవకీనందన్ చేశారు. మధ్యాహ్నం హనుమాన్ జంక్షన్‌కు చెందిన పంపన త్రిముర్తులు శిష్యబృందంచే కోలాట ప్రదర్శన నిర్వహించారు. ఆలయ చైర్మన్ జల్లూరి వెంకన్నబాబు, ధర్మకర్తలు, ఈవో శ్రీనివాస్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.