Share News

గాంధీ స్మారక కేంద్రంగా పెదనిండ్రకొలను గాంధీ భవనం

ABN , Publish Date - Oct 02 , 2026 | 12:42 AM

మహాత్ముడి ఆశయాలను సామాన్య ప్రజానీ కానికి తెలపాలనే లక్ష్యంతో మాజీ విద్యాశాఖ మంత్రి, సర్వోదయ మండలి నాయకుడు చింతలపాటి వరప్రసాదమూర్తిరాజు గాంధీభవనం నిర్మించారు.

గాంధీ స్మారక కేంద్రంగా పెదనిండ్రకొలను గాంధీ భవనం
పెదనిండ్రకొలను గాంధీభవనం

నిడమర్రు: మహాత్ముడి ఆశయాలను సామాన్య ప్రజానీ కానికి తెలపాలనే లక్ష్యంతో మాజీ విద్యాశాఖ మంత్రి, సర్వోదయ మండలి నాయకుడు చింతలపాటి వరప్రసాదమూర్తిరాజు గాంధీభవనం నిర్మించారు. 1967లో నిర్మాణం ప్రారంభించగా రెండే ళ్లపాటు సుదీర్ఘంగా సాగిన ఈ మహత్తర నిర్మాణం చూపరులను విశేషంగా ఆకట్టు కుంది. గాంధీజీ తెలిపిన సత్యం, అహింసా, స్వదేశీ విధానాలను ప్రజలకు, విద్యావంతులకు భవిష్యత్తు తరాలకు తెలియజేయాలనే లక్ష్యంతో సుమారు 12 ఎకరాల పొలం పెదనిండ్రకొలనులో సేకరించి ఈ గాంధీభవనాన్ని మూర్తిరాజు నిర్మించారు. భారత పార్లమెంటు భవన నిర్మాణంతో పోలినవిధంగా నిర్మించిన ఈ భవనం ప్రత్యేకత ఏమిటంటే భవనం మధ్యలో ఎటువంటి పిల్లర్స్‌ లేకుండా ఉండడం. సుమారు వంద అడుగులు మేర ఎటువంటి సపోర్టు లేకుండా ఏక స్లాబ్‌ ఉండడం ఆశ్చర్యం కల్గిస్తోంది. పైన డోమ్‌ ఆకారం నిర్మించడం వల్లే ఈ విధంగా నిర్మాణం జరిగిందని నిపుణులు చెబుతున్నారు. ఈ భవనం చుట్టూ వరండా.. పైన అద్భుతమైన గ్రంథాలయం ఏర్పాటు చేశారు. దీనిలో అప్పట్లోనే మూర్తిరాజు సుమారు నాలుగు వేల గ్రంథాలను, జీవిత చరి త్రలను, స్వాతంత్య్ర పోరాట పుస్తకాలను సేకరించి భద్రపరచి గ్రంథాలయంగా ఏర్పాటు చేశారు. భవనం లోపల గోడలపై స్వాత్రంత్య పోరాట దృఽశ్యాలను 3డి రూపంలో బొమ్మలను ఏర్పాటు చేశారు. నులి వడికే యంత్రంతో, స్వదేశీ ఉద్యమం పోరాట దృశ్యాలు తీర్చిది ద్దారు. ఈ గాంధీ భవనాన్ని సర్వోదయ మండలి ఆధ్వర్యంలో అభివృద్ధి చేయుటకు ప్రయత్నిస్తు న్నామని సర్వోదయమం డలి రాష్ట్ర కార్యదర్శి ఇందుకూరి ప్రసాదరాజు తెలిపారు.

గాంధీ భవనాన్ని పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేయాలి

ఏలూరు అర్బన్‌ : పెదనిండ్రకొలనులో నిర్మించిన మహాత్మాగాంధీ భవనాన్ని రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేయాలని ఉమ్మడి జిల్లా సర్వోదయ మండలి ప్రధాన కార్యదర్శి ఇందుకూరి ప్రసాదరాజు ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు.

Updated Date - Oct 02 , 2026 | 12:42 AM