Share News

కొల్లేరుపై సమగ్ర నివేదిక

ABN , Publish Date - Jul 16 , 2026 | 12:41 AM

కొల్లేరుపై సుప్రీం సాధి కారిత కమిటీకి సమగ్ర వివరాలను అందించాలని, దీనిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని రెవెన్యూ, అటవీశాఖల అధికారులు 10 రోజుల్లో పూర్తి నివేదికలను సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్‌ కన్సర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్టు(పీసీసీఎఫ్‌) డాక్టర్‌ పీవీ చలపతిరావు,వైల్డ్‌లైఫ్‌ చీఫ్‌ కన్సర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్టు(సీసీఎఫ్‌) డాక్టర్‌ కె.నాగేశ్వరరావు ఆదేశించారు.

కొల్లేరుపై సమగ్ర నివేదిక
మంగళగిరిలో పీసీపీఎఫ్‌ కార్యాలయంలో కొల్లేరు సమీక్షలో సీసీఎఫ్‌ నాగేశ్వరావు, పాల్గొన్న ఇతర అధికారులు

పది రోజుల్లో మ్యాప్‌లు, లబ్ధిదారుల వివరాలు

రెవెన్యూ, అటవీశాఖాధికారులకు పీసీసీఎఫ్‌ ఆదేశం

ఏలూరు,జూలై 15(ఆంధ్రజ్యోతి): కొల్లేరుపై సుప్రీం సాధి కారిత కమిటీకి సమగ్ర వివరాలను అందించాలని, దీనిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని రెవెన్యూ, అటవీశాఖల అధికారులు 10 రోజుల్లో పూర్తి నివేదికలను సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్‌ కన్సర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్టు(పీసీసీఎఫ్‌) డాక్టర్‌ పీవీ చలపతిరావు,వైల్డ్‌లైఫ్‌ చీఫ్‌ కన్సర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్టు(సీసీఎఫ్‌) డాక్టర్‌ కె.నాగేశ్వరరావు ఆదేశించారు. పీసీసీఎఫ్‌ కార్యాలయం లో కొల్లేరు సంబంధిత జిల్లాల అటవీ, రెవెన్యూ,సర్వేశాఖల అఽధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. పీసీసీఎఫ్‌ వర్చువల్‌గా సమావేశంలో మాట్లాడగా, నాగేశ్వరరావు పలు అంశాలను విశదీకరించారు. గతనెల 29న సుప్రీం సాధికారి త కమిటీ వద్ద విచారణ వాయిదా పడిన నేపథ్యంలో సమగ్ర నివేదికలను వేగవంతంగా తయారు చేయాలని వారు ఆదేశిం చారు. కొల్లేరు కాంటూరు కుదింపుతో మినహాయింపు పొందే పట్టా, జిరాయితీ, ఇతర భూముల వివరాలను రైతుల వారీగా సమగ్ర నివేదికను సిద్ధం చేయాలని, దీనికి సంబంధించి మ్యాప్‌లు, నిబంధనలకు విరుద్ధంగా కొల్లేరులో జరుగుతున్న అక్రమ విద్యుత్‌ సర్వీసులు, ఆక్రమణలు, వివిధ అంశాలపై బాధ్యులపై తీసుకున్న చర్యలపై నివేదిక సిద్ధంగా ఉండాల న్నారు. సీసీఎఫ్‌లు డాక్టర్‌ టి.జ్యోతి, దివాన్‌ మై బీన్‌లు మాట్లాడారు. పశ్చిమ జేసీ కల్పశ్రీ, ఏలూరు ఆర్డీవో లక్ష్మీ ప్రస న్న, సర్వేశాఖ డిప్యూటీ డైరక్టర్‌ ఎండీ అన్సారీ, వైల్డ్‌లైఫ్‌ డీఎఫ్‌ వో డాక్టర్‌ త్రిమూర్తులరెడ్డి, తహసీల్దార్లు పాల్గొన్నారు.

Updated Date - Jul 16 , 2026 | 12:41 AM