పవన్ కోలుకోవాలని ‘సుందరగిరి’పై పూజలు
ABN , Publish Date - Jul 12 , 2026 | 12:25 AM
ఐ.ఎస్.జగన్నాథపురం గ్రామ సుందరగిరిపై కొలువుదీరిన లక్ష్మీనారసింహుని ఆలయంలో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఆరోగ్యంకోసం గోపాలపురం నియోజక వర్గ జనసేన నేత దిరిశిన ఫాతిమారాణి నేతృత్వంలో నేతలు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.
ద్వారకాతిరుమల, జూలై 11 (ఆంధ్రజ్యోతి): ఐ.ఎస్.జగన్నాథపురం గ్రామ సుందరగిరిపై కొలువుదీరిన లక్ష్మీనారసింహుని ఆలయంలో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఆరోగ్యంకోసం గోపాలపురం నియోజక వర్గ జనసేన నేత దిరిశిన ఫాతిమారాణి నేతృత్వంలో నేతలు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ముంబైలో శనివారం కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న నేపథ్యంలో ఆయనకు ఇష్ట దైవమైన నారసింహుని ఆలయంలో త్వరగా కోలుకుని, ప్రజాక్షేత్రానికి రావాలని కోరుతూ అభిషేకాలు జరిపారు. ఈ సందర్భంగా తొలుత ఫాతిమారాణి, పార్టీ మండల అఽధ్యక్షుడు దాకారపు నరసింహమూర్తి, నియోజకవర్గ నాయకులతో కలిసి ఎత్తైన మెట్లదారి వెంబడి పాదయాత్రగా ఆలయానికి చేరుకున్నారు. గర్భాలయంలో నారసిం హుని మూలవిరాట్‌ను దర్శించి పవన్‌కల్యాణ్ గోత్రనామాలతో పూజలు చేయించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఈ ఆలయం అభివృద్ధి కోసం పవన్‌కల్యాణ్ ఇప్పటికే రూ. 6 కోట్లు కేటాయించారని, గత 16ఏళ్లుగా ప్రతీ ఏటా ఈ ఆలయానికి వచ్చి పూజలు చేస్తారన్నారు. ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం చేకూరాలని ఆ స్వామిని కోరుకున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలోని జనసైనికులు పవన్ కల్యాణ్ ఆరోగ్యంకోసం చర్చిలు, మసీదులు, ఆలయాల్లో ప్రార్థనలు, పూజలు చేస్తున్నట్టు తెలిపారు.
పవన్ త్వరగా కోలుకోవాలి : రెడ్డి అప్పలనాయుడు
ఏలూరు రూరల్, జూలై 11(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు జరిగిన భుజం శస్త్ర చికిత్స విజయవంతం కావడం ఆనందదాయకమని, ఆయన త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని తిరిగి ప్రజాసేవలోకి రావాలని ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు ఆకాంక్షించారు. ప్రజా జీవితంలోకి తిరిగి రావలని మంచి ఆయురారోగ్యాలతో ప్రజలకు సేవలందించాలని భగవంతుడిని ప్రార్థించారు.