ఉత్సాహంగా పట్టిసీమ రేవులో యోగాంధ్ర
ABN , Publish Date - Jun 20 , 2026 | 12:33 AM
ఏలూరు జిల్లాలో ప్రముఖ శైవక్షేత్రం పట్టిసీమ ఫెర్రీ రేవులో ప్రభుత్వం నిర్వహించిన యోగాంధ్ర–2026 కార్యక్రమం శుక్రవారం విజయవంతంగా నిర్వహించారు.
పోలవరం, జూన్ 19 (ఆంధ్రజ్యోతి): ఏలూరు జిల్లాలో ప్రముఖ శైవక్షేత్రం పట్టిసీమ ఫెర్రీ రేవులో ప్రభుత్వం నిర్వహించిన యోగాంధ్ర–2026 కార్యక్రమం శుక్రవారం విజయవంతంగా నిర్వహించారు. శుక్రవారం వాతావరణం చల్లబడ డంతో భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి ఆలయం సమీపంలో గోదావరి నది మధ్యలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎనిమిది మంది యోగా మాస్టర్ ట్రైనర్లతో 700 మంది అభ్యాసకులతో ఉత్సాహంగా కొనసాగింది. తొలుత జేసీ అభిషేక్ గౌడ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. ప్రధాని, సీఎం పిలుపు మేరకు జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం జిల్లా అంతటా జరుపుకుంటున్నామన్నారు. ఏపీ ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు, ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, శాప్ డైరెక్టర్ కొవ్వాసు జగదీశ్వరి మాట్లాడారు. ఆర్డీవో ఎంవీ రమణ, జి.వెంకటనాయుడు, ఎస్.పట్టాభిరామన్న, డాక్టర్ పి.కృష్ణవేణి, ఏవీ సుబ్బరాయన్, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.