Share News

పరిషత్‌ పోలింగ్‌ ప్రశాంతం

ABN , Publish Date - Nov 06 , 2026 | 12:54 AM

జిల్లాలో పరిషత్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. జిల్లాలో నాలుగు మండలాల్లో పోలింగ్‌ ప్రక్రియ ఒక రోజు వాయిదా పడగా మిగిలిన 23 మండలాల్లో ఒక జడ్పీటీసీ ఏకగ్రీవం కావడంతో మిగిలిన 22 జడ్పీటీసీలు, 401 ఎంపీటీసీ లకు పోలింగ్‌ గురువారం జరిగింది.

పరిషత్‌ పోలింగ్‌ ప్రశాంతం
ఆగిరిపల్లిలో ఓటేసేందుకు క్యూలో ఓటర్లు

జిల్లాలో సరాసరి 75.52 శాతం నమోదు

22 జడ్పీటీసీలు, 401 ఎంపీటీసీలకు పోలింగ్‌ పూర్తి

ఓటర్లు 11,62,523.. పోలైన ఓట్లు 8,77,915

ఎన్నికల ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్‌, ఎస్పీ, మంత్రి కొలుసు

వాయిదా పడిన నాలుగు మండలాల్లో నేడు నిర్వహణ

ఏలూరుసిటీ/ఏలూరు/ఏలూరు క్రైం, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలో పరిషత్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. జిల్లాలో నాలుగు మండలాల్లో పోలింగ్‌ ప్రక్రియ ఒక రోజు వాయిదా పడగా మిగిలిన 23 మండలాల్లో ఒక జడ్పీటీసీ ఏకగ్రీవం కావడంతో మిగిలిన 22 జడ్పీటీసీలు, 401 ఎంపీటీసీ లకు పోలింగ్‌ గురువారం జరిగింది.

జిల్లాలోని 1,395 పోలింగ్‌ కేంద్రాల్లో పోలింగ్‌ను నిర్వహించారు. ఉదయం ఏడు గంటలకే పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభమైం ది. ఆయా పోలింగ్‌ కేంద్రాల్లో మొత్తం 11,62, 523 మంది ఓటర్లు ఉండగా 8,77,915 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో పురుష ఓటర్లు 4,36,723 మంది, మహిళా ఓటర్లు 4,41,187 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సరాసరి 75.52 శాతం పోలింగ్‌ జరిగింది. జిల్లాలోని 4 మండలాల్లో 5 గంటలకు కూడా చాలామంది పోలింగ్‌ కేంద్రాల్లో ఓటు వేసేందుకు వేచి ఉండ డంతో పోలింగ్‌ ప్రక్రియ కొంత ఆలస్యమైంది.

ప్రశాంత వాతావరణంలో పోలింగ్‌ : కలెక్టర్‌

జిల్లాలోని 23 మండలాల్లో జడ్పీటీసీ, ఎంపీ టీసీ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించామని కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి చెప్పారు. సర్‌ సీఆర్‌ఆర్‌ పాలిటెక్నిక్‌ కళాశాల, ఇంజనీరింగ్‌ కళాశాలల్లో గురువారం రాత్రి జిల్లా ఎస్పీ కె.ప్రతాప్‌శివ కిశోర్‌తో కలిసి కౌంటింగ్‌ కేంద్రంలో ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం విలేకరులతో కలెక్టర్‌ మాట్లాడుతూ ‘జిల్లాలోని 23 మండలాల్లో జడ్పీ టీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగ ుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించాం. మురసు తుఫాన్‌ వర్షాలకు రోడ్లు ధ్వంసం కావ డంతో కారణంగా వేలేరుపాడు, బుట్టాయి గూడెం, జీలుగుమిల్లి, పోలవరం మండలాల్లోని 4 జడ్పీటీసీ, 42 ఎంపీటీసీ స్థానాలకు 140 పోలింగ్‌ స్టేషన్ల పరిధిలో శుక్రవారం పోలింగ్‌ నిర్వహిస్తున్నాం. ఈ నెల 7న ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశాం. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల అనంతరం పంచాయతీ ఎన్నికలకు సన్నద్దం కావాల’న్నారు. పోలింగ్‌ విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌ నిర్వ హణకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశా మని, జిల్లాలో ఏ చిన్న అవాంఛనీయమైన ఘటన జరగకుండా ఎన్నికలను ప్రశాంత వాతా వరణంలో నిర్వహించామన్నారు. జేసీ అభిషేక గౌడ, అసిస్టెంట్‌ కలెక్టర్‌ శ్రావణ్‌కుమార్‌రెడ్డి , ఆర్డీవో లక్ష్మీప్రసన్న, డీఎస్పీ శ్రావణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

స్ర్టాంగ్‌ రూముల వద్ద మూడంచెల భద్రత

జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ అనంతరం బ్యాలెట్‌ బాక్సు లను భద్రపరిచేందుకు ఎన్నికల సిబ్బంది స్థానిక సీఆర్‌ఆర్‌ పాలిటెక్నిక్‌ ఇంజనీరింగ్‌ కళాశాలల్లోని స్ర్టాంగ్‌ రూమ్‌లకు తరలించారు. బ్యాలెట్‌ బాక్సుల భద్రతకు కలెక్టర్‌ వెట్రిసెల్వి, ఎస్పీ కేపీఎస్‌ కిశోర్‌, జేసీ అభిషేక్‌ గౌడ పటిష్ఠ చర్యలు చేపట్టారు. స్ర్టాంగ్‌ రూములను గురువారం రాత్రి పరిశీలించారు. భద్రత ఏర్పాట్లను, కౌంటింగ్‌ కేంద్రంలో టేబుళ్ల ఏర్పాట్లను పరిశీలించారు. స్ర్టాంగ్‌ రూముల వద్ద మూడంచెల భద్రత ఏర్పాట్లపై కలెక్టర్‌, ఎస్పీలు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. స్ర్టాంగ్‌ రూము పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు.

నాలుగు మండలాల్లో నేడు పోలింగ్‌

ఏలూరుసిటీ/బుట్టాయగూడెం/పోలవరం/నవంబరు 5(ఆంధ్రజ్యోతి): మురసు తుఫాన్‌ కారణంగా కురిసిన భారీ వర్షాల వల్ల వచ్చిన వరదలతో పోలింగ్‌ ప్రక్రియను నిర్వహించ డానికి వీలులేక పోవడంతో పోలవరం, జీలుగుమిల్లి, బుట్టాయిగూడెం, వేలేరుపాడు మండలాల్లో గురువారం జరగాల్సిన జడ్పీటీసీ, ఎంపీటీసీల పోలింగ్‌ను శుక్రవారానికి వాయిదా వేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఆయా మండలాల్లో పోలింగ్‌ ప్రక్రియను నిర్వ హించడానికి జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. పోలవరం, జీలుగుమిల్లి, బుట్టాయిగూడెం, వేలేరుపాడు మండలాల్లో 4 జడ్పీటీసీలకు, 42 ఎంపీటీసీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. గురువారం పోలింగ్‌ మెటీరియల్‌ను పోలీస్‌ బందోబస్తు మధ్య పోలింగ్‌ కేంద్రాలకు తరలించారు. నాలుగు మండలాల్లో 140 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా 1,30,996 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. బుట్టాయగూడెం మండలంలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వ హించడానికి సర్వం సిద్ధం చేసినట్టు ఎన్నికల అధికారులు సుబ్బా రాయన్‌, జ్యోతి తెలిపారు. మండలంలో 49 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా 127 బ్యాలెట్‌ బాక్సు లను సిద్ధం చేసినట్టు తెలిపారు. మూడు పంచాయతీలను అత్యంత సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి చర్యలు తీసుకున్నామన్నారు. మండలంలో 42,962 మంది ఓటర్లు ఉండగా పురుషులు 20,133 మంది, మహిళలు 22,825 మంది ఉన్నారు. 15 ఎంపీటీసీ స్థానాలకు 44 మంది, జడ్పీటీసీ స్థానానికి నలుగురు అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పోలవరం మండలంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి రవికుమార్‌ తెలిపారు.

Updated Date - Nov 06 , 2026 | 12:54 AM