పారిజాతగిరి శ్రీవారి క్షేత్రంలో పవిత్రోత్సవాలు
ABN , Publish Date - Oct 07 , 2026 | 12:23 AM
స్థానిక గోకుల తిరుమల పారి జాతగిరి వేంకటేశ్వరస్వామి క్షేత్రంలో స్వామివారి పవిత్రోత్సవ కార్యక్ర మాలు వైభవంగా నిర్వహిస్తున్నట్టు ఆలయ కమిటీ చైర్మన్ అల్లూరి రామకృష్ణ, ఈవో మానికల రాంబాబు తెలిపారు.
జంగారెడ్డిగూడెం,అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి) :స్థానిక గోకుల తిరుమల పారి జాతగిరి వేంకటేశ్వరస్వామి క్షేత్రంలో స్వామివారి పవిత్రోత్సవ కార్యక్ర మాలు వైభవంగా నిర్వహిస్తున్నట్టు ఆలయ కమిటీ చైర్మన్ అల్లూరి రామకృష్ణ, ఈవో మానికల రాంబాబు తెలిపారు. ఈ సందర్భంగా రెండో రోజు మంగళ వారం ప్రత్యేక పూజలతోపాటు అగ్ని ప్రతిష్ఠ, యాగశాలో హోమ కార్యక్రమాలు పానంగిపల్లి సత్యపవన్‌కుమార్ నేతృత్వంలో ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరు రవికుమార్ ఆచార్యులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆలయ అభివృద్ధి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.