పంచాయతీ జోష్
ABN , Publish Date - Mar 16 , 2026 | 12:55 AM
పంచాయతీలకు గ్రేడింగ్ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీ నిధులు మళ్లించకుండా సొంతంగా వినియోగించుకునే వెసులుబాటు కల్పించింది.
పంచాయతీలకు గ్రేడింగ్
రూర్బన్ పంచాయతీలో
అసిస్టెంట్ ఎంపీడీవో స్థాయి అధికారులు
పంచాయతీలకు గ్రేడింగ్ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీ నిధులు మళ్లించకుండా సొంతంగా వినియోగించుకునే వెసులుబాటు కల్పించింది. ఆర్థిక సంఘం నిధులు సైతం పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకుంది. పల్లె పండుగలో భాగంగా అభివృద్ధి పనులు చేపడుతోంది. తాజాగా జనాభా, ఆదాయం ప్రాతిపదికగా గ్రేడింగ్‌లు ఇచ్చింది. రూ.కోటి ఆదాయం లేదా 10వేలు జనాభా ఉన్న పంచాయతీలను రూర్బన్ పంచాయతీలుగా వర్గోన్నతి కల్పించారు.
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
గ్రామ పంచాయతీలను ఆదాయం, జనాభా ప్రాతిపదికన ప్రభుత్వం గ్రేడ్‌లుగా వర్గీకరించారు. రూర్బన్, గ్రేడ్స్‌గా వర్గోన్నతి చేసి రూర్బన్ పంచాయతీకి మండల స్థాయి అధికారిని నియ మిస్తారు. కార్యదర్శులకు ఈవోపీఆర్‌డీ (ఏఎంపీడీవో)లుగా పదో న్నతి కల్పించారు. వారిని రూర్బన్ పంచాయతీల్లో నియమించను న్నారు. జిల్లాలో 20 పంచాయతీలను రూర్బన్ పంచాయతీలుగా గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మినీ మండల పరిషత్‌లుగా అభివృద్ధి చేయనున్నారు.
మారిన గ్రేడ్‌లు
జిల్లాలో మారిన గ్రేడ్‌ల ఆధారంగా పంచాయతీలకు కార్యదర్శుల నియామకానికి ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేయనుంది. తాజా మార్పులతో గ్రేడ్–1 పంచాయతీలు జనాభా ప్రాతిపదికన గ్రేడ్–2లో చేరిపోయాయి. గ్రేడ్–2 పంచాయతీలు గ్రేడ్–1కు వర్గోన్నతి పొందాయి. ప్రస్తుతం గ్రేడ్–2గా మారిన పం చాయతీల్లో గ్రేడ్–1 స్థాయి కార్యదర్శులున్నారు. గ్రేడ్–1గా మారిన పంచాయతీల్లో గ్రేడ్–2 కార్యదర్శులు కొనసాగుతున్నారు. ఆ మేరకు కార్యదర్శులకు స్థాన చలనం ఉంటుంది.
ప్రజాప్రతినిధుల చుట్టూ కార్యదర్శులు
రూర్బన్ పంచాయతీల్లో నియామకానికి కార్యదర్శుల్లో పోటీ నెలకొంది. ఇటీవల పదోన్నతుల్లో ఈవోపీఆర్‌డీలుగా కార్యదర్శులకు అవకాశం లభించింది. గ్రేడ్–1 కార్యదర్శులుగా అనేకమంది పదోన్న తి పొందారు. జిల్లాలో గుర్తింపు పొందిన 20 రూర్బన్ పంచాయ తీలకు స్థానికంగానే పదోన్నతి పొందిన ఈవోపీఆర్‌డీలున్నారు. వారంతా ఇదే జిల్లాలో ఉండేలా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. తమకు అనుకూలమైన రూర్బన్ పంచాయతీల్లో పోస్టింగ్ కోసం ప్రజాప్రతినిధులను కలుస్తున్నారు. సుపరిచిత రూర్బన్ పంచాయ తీల్లో పాలన సజావుగా చేయవచ్చనే ఉద్దేశంతో కార్యదర్శులు పావులు కదుపుతున్నారు. గ్రేడ్–1 కార్యదర్శులుగా పదోన్నతి పొం దిన వారు కూడా తమకు అనుకూలమైన పంచాయతీలకు వెళ్లాల నే ఉద్దేశంతో నేతల ఆశీస్సుల కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రస్తుతం పలు పంచాయతీల్లో పార్టీ శ్రేణుల కుమ్ములాటలతో కార్యదర్శులు నలిగిపోతున్నారు. ప్రభుత్వం పదోన్నతులు కల్పించ డమే కాకుండా, పంచాయతీలను మార్పు చేయడంతో ప్రస్తుతం ఇబ్బందులు పడుతున్న కార్యదర్శులంతా స్థాన చలనం కోసం ఎదురుచూస్తున్నారు.
రూర్బన్‌తో ప్రయోజనాలెన్నో..
జిల్లాలో ఎంపికైన 20 రూర్బన్ పంచాయతీల్లో సౌకర్యాలు మెరుగపడనున్నాయి. పంచాయతీలో ప్లానింగ్ విభాగం ఉంటుంది. భవన నిర్మాణాలకు అనుమతి ఇస్తుంది. పారిశుధ్యం, ఇంజనీరింగ్ విభాగాలను ఏర్పాటుచేసి సిబ్బందిని పెంచనున్నారు. నగర పం చాయతీల తరహాలోనే రూర్బన్ పంచాయతీల్లో పాలన ఉంటుంది. ప్రస్తుతం నిర్మాణాల కోసం ఏలూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథా రిటీకి వెళ్లాల్సి వస్తోంది. ఇకపై రూర్బన్ పంచాయతీల్లోనే అనుమ తులు మంజూరు చేయనున్నారు. జిల్లావ్యాప్తంగా 409 పంచాయ తీలను గ్రేడ్‌లుగా విభజించారు. రూర్బన్ పంచాయతీలుగా ఆచంట, అత్తిలి, కె.అన్నవరం, చినఅమిరం, రాయలం, గణపవరం, రేలంగి, పెద అమిరం, మొగల్తూరు, శృంగవృక్షం, విస్సాకోడేరు, పాలకొల్లు రూరల్, పెంటపాడు, పెనుగొండ, సిద్ధాంతం, పెద తాడేపల్లి, దువ్వ, వేల్పూరు, ఉండి, వీరవాసరం పంచాయతీలు గుర్తింపు పొందాయి. 140 పంచాయతీలు గ్రేడ్–1కు ఎంపిక య్యాయి. మరో 100 పంచాయతీలు గ్రేడ్–2, 149 పంచాయతీలను గ్రేడ్–3గా గుర్తింపుని చ్చారు. జనాభా, ఆదాయాల ప్రాతిపదికగా వీటిని విభజిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.