సంగ్రామం
ABN , Publish Date - Nov 15 , 2026 | 12:02 AM
పల్లెపోరుకు నగారా మోగింది. గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి విడతకు సంబం ధించి ఆదివారం జిల్లాలో రిటర్నింగ్ అధికారి నోటిఫికేషన్ జారీ చేయను న్నారు. నామినేషన్లను స్వీకరిస్తారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేశారు.
నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
11 మండల్లాలోని 177 సర్పంచ్, 1,896 వార్డు పదవులకు తొలివిడత ఎన్నికలు
17 వరకు నామినేషన్ల స్వీకరణ.. 26న పోలింగ్..ఫలితాలు
(ఏలూరుసిటీ–అంధ్రజ్యోతి)
పల్లెపోరుకు నగారా మోగింది. గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి విడతకు సంబం ధించి ఆదివారం జిల్లాలో రిటర్నింగ్ అధికారి నోటిఫికేషన్ జారీ చేయను న్నారు. నామినేషన్లను స్వీకరిస్తారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేశారు.
జిల్లాలోని జంగారెడ్డిగూడెం, కామవరపుకోట, బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి, కొయ్యలగూడెం, కుక్కునూరు, పోలవరం, టి.నరసాపురం, వేలేరు పాడు, చింతలపూడి, లింగపాలెం మండలాల్లోని 177 పంచాయతీ సర్పంచ్‌లు, 1,896 వార్డు సభ్యులకు ఈనెల 26న పోలింగ్ జరగనుంది. 17 వరకు నామినేషన్ల స్వీకరణ, 18న నామి నేషన్ల పరిశీలన, 19న అభ్యంతరాల స్వీకరణ, 20న అభ్యంతరాల పరిష్కారం, 21న నామి నేషన్ల ఉపసంహరణ, అభ్యర్థుల తుది జాబితా ప్రకటన, 26న ఉదయం 7గంటల నుంచి మఽ ద్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్, మధ్యా హ్నం 2గంటల నుంచి కౌంటింగ్ కార్యక్రమం నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు.
ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు
పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఆదివారం నుంచి నామినేషన్లు పర్వం ప్రారంభం అవుతుండటంతో అధికారులు నామినేషన్ల స్వీకరణ కోసం ఏర్పాట్లు చేశారు. సర్పంచ్, వార్డు మెంబర్ల పదవులకు నామినేషన్ల స్వీకరణకు 177 పంచాయతీలకు సంబంధించి 86 నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. స్టేజ్–1 అధికారులు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు నామినే షన్లు స్వీకరిస్తారు. సెలవుదినాల్లోను నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. నామినేషన్ వేయడానికి అభ్యర్థి, ప్రతిపాదకుడితో పాటు గరిష్ఠంగా ముగ్గురిని నామినేషన్ కేంద్రంలోకి అనుమతి స్తారు. నామినేషన్ కేంద్రానికి 100 మీటర్లు పరిధిలో సర్పంచ్ అభ్యర్థికి సంబంధించి ఒక్క వాహనానికి మాత్రమే అను మతిస్తారు. అభ్యర్థి లేదా ప్రతి పాదకుడు స్వయంగా నామి నేషన్ పత్రాలను సమర్పిం చాలి. పోస్టు ద్వారా / ఇతరుల ద్వారా వచ్చిన నామినేషన్లు స్వీకరించ రు. ఒకే పంచాయతీలో ఒకటి కంటే ఎక్కువ వార్డు లకు నామినేషన్ వేస్తే ఉప సంహరణ గడువులోగా ఒక దానిని మాత్రమే ఉంచుకుని మిగి లిన వాటిని ఉపసంహరించుకోవాలి. సర్పం చ్, వార్డు సభ్యుడు రెండు పదవులకు ఎన్నికైతే ఫలితాల ప్రకటన రోజు నుంచి 15 రోజుల్లో ఒకే పదవిని ఎంచుకోవాలి.
పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్య ర్థులు సర్పంచ్ పదవికి సాధారణ అభ్యర్థి అయితే రూ.మూడు వేలు, ఎస్సీ/ఎస్టీ/బీసీ అభ్యర్థులు రూ.1500, వార్డు సభ్యుడి పదవికి సాధారణ అభ్యర్థి రూ.1000, ఎస్సీ/ఎస్టీ/బీసీ అభ్యర్థులు రూ.500 డిపాజిట్‌గా చెల్లించాలి.
ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చు లపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ పరిమితులు విధించింది. 10వేల కంటే జనాభా తక్కువ ఉన్న పంచా యతీల్లో వార్డు సభ్యుడు గరిష్ఠం గా రూ.60 వేలు, సర్పంచ్ అభ్యర్థి రూ.రెండు లక్షల 50 వేలు, 10 వేలకు పైగా జనాభా ఉన్న పంచాయతీల్లో వార్డు సభ్యుడు గరిష్ఠంగా రూ.లక్ష, సర్పంచ్ అభ్యర్థి రూ.నాలుగు లక్షల వరకు ఖర్చు చేసుకోవచ్చు.
సర్పంచ్‌గా పోటీ చేసే అభ్యర్థుల వయస్సు 21 సంవత్సరాలు నిండి ఉండాలి. ఆ గ్రామ పంచాయతీలో ఓటరు లిస్టులో పేరు ఉండా లి. ప్రభుత్వ ఉద్యోగి కాకూడదు. ప్రతిపాది తుడు కూడా అదే పంచాయతీలో ఓటరుగా నమోదై ఉండాలి. ఒకటి నుంచి నాలుగు సెట్లు వరకు నామినేషన్లు వేయవచ్చు. ఒక సెట్‌లో పొరపాటు వచ్చినా ఇంకో నామినేషన్ ఉంటుంది. నామినేషన్ ఫారాన్ని ఆర్వో వద్ద తీసుకోవాలి, ఓటరు కార్డు జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, వయస్సు ధ్రువీకరణ పత్రం (10వ తరగతి మార్క్స్ మెమో/ బర్త్ సర్టిఫికేట్), కుల ధ్రువీకరణ పత్రం ( రిజర్వుడు సీటు అయితే), నోడ్యూస్ సర్టిఫికేట్ (పంచాయతీ కార్యదర్శి నుంచి), అఫిడవిట్/ ప్రమాణ పత్రం (నేర చరిత్ర, ఆస్థులు, అప్పులు, చదువు, పిల్లల వివరాలు), డిపాజిట్ రసీదు ఉండాలి. సర్పంచ్‌గా పోటీ చేసేటప్పుడు ఈ పత్రాలన్నీ రెడీగా ఉంచుకోవాలి. ఈ పత్రాల్లో ఒక్కటి మిస్ అయినా నామినేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశాలున్నాయి.
ఓటరు చిటికెన వేలికి సిరా
గ్రామ పంచాయతీ ఎన్ని కల్లో ఓటర్ల ఎడమ చేతి చిటికెను వేలికి చెరగని సిరా గుర్తు వేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించింది, ఇటీవల ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఓటర్ల ఎడమచేతి చూపుడు వేలికి, రీపోలింగ్ జరిగిన కొన్ని ప్రాంతాల్లో మధ్య వేలికి ఇంకు గుర్తు వేశారు. అదే ఓటర్లు పంచాయతీ ఎన్నికల్లోను ఓటు హక్కు వినియోగించుకో నున్న నేపఽథ్యంలో ఎలాంటి గందరగోళానికీ తావు లేకుండా చిటికెన వేలికి గుర్తు వేయా లని నిర్ణయించింది. ఈ మేరకు కలెక్టర్లు, పంచాయతీ అధికారులకు ఎన్‌ఈసీ ఆదేశాలు జారీ చేసింది.