ఇక పల్లెపోరు!
ABN , Publish Date - Nov 13 , 2026 | 12:09 AM
గ్రామ పంచాయతీల ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. మూడు విడతలుగా ఈ ఎన్నికలు జరగ నున్నాయి. తొలి విడతకు సంబంధించి నేడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.
నేడు తొలి విడత పంచాయతీ ఎన్నికలకు ఎస్‌ఈసీ నోటిఫికేషన్ జారీ
మూడు విడతలుగా పంచాయతీ ఎన్నికలు
తొలి విడతలో 177 పంచాయతీ సర్పంచ్‌లు, 1896 వార్డు సభ్యులకు ఎన్నికలు నిర్వహణ
ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్
(ఏలూరుసిటీ–అంధ్రజ్యోతి)
గ్రామ పంచాయతీల ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. మూడు విడతలుగా ఈ ఎన్నికలు జరగ నున్నాయి. తొలి విడతకు సంబంధించి నేడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. జిల్లాలో రిటర్నింగ్ అధికారి 15న నోటిఫికేషన్ జారీ చేస్తారు. అదే రోజు నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. జిల్లాలో 544 పంచాయతీలు ఉండగా తొలి విడతలో 11 మండలాల్లోని 177 పంచాయతీల సర్పంచ్‌లు, 1,896 వార్డు సభ్యులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం 4,57,329 మంది తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఇందులో పురుష ఓటర్లు 2,23,224 మంది కాగా, మహిళా ఓటర్లు 2,34,085 మంది, ఇతర ఓటర్లు 20 మంది ఉన్నారు. 1,953 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. కాగా జిల్లాలో పంచాయతీ ఎన్నికల నిర్వ హణకు పటిష్ఠ చర్యలు తీసుకున్నా మని కలెక్టర్ వెట్రిసెల్వి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠాకు తెలి పారు. రాష్ట్రంలో 23 పట్టణ స్థానిక సం స్థలు, గ్రామ పంచాయతీలకు సంబంఽధించి రెండవ సాధారణ ఎన్నికల సన్నద్దతపై కమిషనర్ గురువారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం నుంచి పంచాయతీరాజ్, పురపరిపాలన కమిషనర్లు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఎన్నికల పరిశీల కులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన అనిల్‌చంద్ర పునేఠా మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను అనుసరించి రాష్ట్రంలో 23 పట్టణ స్థానిక సంస్థలు, గ్రామ పంచా యతీలకు ఎన్నికల ప్రక్రియను నిర్వహించాలన్నారు. ఇటీవల ఎన్నికలు నిర్వహించిన నగరపాలక సంస్థలలో మేయర్, డిప్యూటీ మేయర్ , పురపాలక సంఘాలలో చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్, జడ్పీ చైర్‌పర్సన్, ఎంపీపీ ల ఎంపికలను నిర్దేశిం చిన తేదీల్లో నిర్వహించా లన్నారు. జేసీ అభిషేక గౌడ, నూజివీడు సబ్ కలెక్టర్ విన్నూత్న, డీపీవో మల్లికార్జునరావు, ఆర్డీవోలు లక్ష్మీ ప్రసన్న, తహసీల్దార్లు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.
తొలి విడత పంచాయతీ ఎన్నికల షెడ్యూల్
నామినేషన్‌లు స్వీకరణ నవంబరు 15
నామినేషన్‌ల తుది గడువు నవంబరు 17
నామినేషన్‌ల పరిశీలన నవంబరు 18
తిరస్కరించిన నామినేషన్ల అప్పీళ్లు నవంబరు 19
అప్పీళ్ల పరిష్కారం నవంబరు 20
నామినేషన్‌ల ఉపసంహరణ గడువు నవంబరు 21
అభ్యర్థుల జాబితా ప్రచురణ నవంబరు 21
పోలింగ్ తేదీ నవంబరు 26
లెక్కింపు, ఫలితాలు విడుదల నవంబరు 26
రీపోలింగ్(అవసరమైన చోట) నవంబరు 27