Share News

నేటితో మైకులు బంద్‌

ABN , Publish Date - Nov 24 , 2026 | 12:23 AM

జిల్లాలో నిర్వహిస్తున్న మలి విడత పురపోరు ప్రచారానికి నేటితో తెరప డనుంది. గడువు సమీపిస్తుండటం తో ప్రధాన పార్టీలన్నీ ర్యాలీలతో ప్రచారాన్ని హోరెత్తించాయి.

నేటితో మైకులు బంద్‌
ప్రచారంలో భాగంగా చిన్నారిని ఎత్తుకున్న భీమవరం చైర్‌పర్సన్‌ అభ్యర్థి డాక్టర్‌ మల్లీశ్వరి

ఓటుకు రూ.500 నుంచి వెయ్యి వరకు పంపిణీకి సన్నాహాలు

భీమవరం, తాడేపల్లిగూడెంలో వార్డుకు రూ.15 లక్షల వ్యయం

తణుకు, పాలకొల్లులోనూ పంపకాలకు సిద్ధం

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

జిల్లాలో నిర్వహిస్తున్న మలి విడత పురపోరు ప్రచారానికి నేటితో తెరప డనుంది. గడువు సమీపిస్తుండటం తో ప్రధాన పార్టీలన్నీ ర్యాలీలతో ప్రచారాన్ని హోరెత్తించాయి. వార్డు ల్లో వీధివీధినా తిరుగుతూ ఓటర్లను గుర్తించి, ఎక్కడ ఉన్నాసరే ఓటు వేయాలని అభ్యర్థులు కోరుతు న్నారు. ప్రచారం ముగిసిన తక్షణమే తాయిలాల పంపకానికి సిద్ధమవు తున్నారు. నాలుగు మున్సిపాలిటీ ల్లోనూ ఓటుకు కనిష్ఠంగా రూ.500 నుంచి గరిష్ఠంగా రూ.వెయ్యి వరకు ఇచ్చేలా చైర్‌పర్సన్‌, వార్డు కౌన్సిలర్‌ అభ్యర్థులు సొమ్ములను సిద్ధం చేసు కున్నారు. కౌన్సిలర్లు కొంత భరి స్తుంటే, దానికి అదనంగా చైర్‌పర్సన్‌ అభ్యర్థులు నిధులు సమకూర్చేం దుకు ముందుకొస్తున్నారు.

భీమవరంలో అత్యధిక వ్యయం

జిల్లాలో అత్యధికంగా భీమవరం మున్సిపా లిటీలోనే ఎన్నికల వ్యయం ఉండనుంది. ఇక్క డ కౌన్సిలర్‌ అభ్యర్థిగా నిలబడాలంటే రూ.15 నుంచి రూ.20 లక్షలు ఖర్చవుతుందని నియో జకవర్గ నేతలు ముందుగానే లెక్కలు కట్టి అభ్యర్థులకు స్పష్టమైన వర్తమానం పంపారు. ఆ మేరకు భరించగలవారే ప్రస్తుతం బరిలో ఉన్నారు. మరోవైపు చైర్‌పర్సన్‌ అభ్యర్థులు కోట్ల రూపాయలు వెచ్చించేందుకు వెనుకాడ టం లేదు. గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో కూట మి, వైసీపీ అభ్యర్థులు పోటాపోటీగా ఓటుకు రెండు వేల రూపాయల చొప్పున మంచినీళ్ల లా ఖర్చు చేయడంతో ప్రస్తుత మున్సిపల్‌ ఎన్నికల్లోనూ అంచనాలు పెరిగాయి. అయితే వైసీపీ నుంచి అంతగా సొమ్ములు వెచ్చించేం దుకు అభ్యర్థులు ముందుకు రావడం లేదు. పోటీ చేయడమే గగనమైన నేపథ్యంలో తా యిలాలను తగ్గించుకోవాలని ఆ పార్టీ చూ స్తోంది. వైసీపీ అభ్యర్థులు వెచ్చించే మొత్తాన్ని బట్టే ముందుకు వెళ్లాలని కూటమి అభ్యర్థులు నిర్ణయించుకున్నారు.

గూడెంలో వార్డుకు రూ.15 లక్షలు

తాడేపల్లిగూడెంలోనూ ఒక్కో వార్డులో 15 లక్షల రూపాయల చొప్పున వెచ్చించేలా అభ్య ర్థులు సన్నాహాలు చేసుకుంటున్నారు. కౌన్సిలర్‌ అభ్యర్థులు మూడు నుంచి ఐదు లక్షల వరకు ఏర్పాటు చేసుకుంటుండగా, మిగిలిన మొత్తాన్ని చైర్‌పర్సన్‌ అభ్యర్థి భరించేలా సంప్రదింపులు పూర్తయ్యాయి. చివరి రోజుకు వచ్చే సరికి వైసీపీ ప్రచార వేగాన్ని పెంచినా, గెలుపుపై ధీమా లేకపోవడంతో తాయిలాల విషయంలో ఆ పార్టీ నాయకత్వం తర్జనభర్జన లు పడుతోంది. ఎదుటి పక్షానికి దీటుగా కాక పోయినా కొంతమేరైనా ఇవ్వకపోతే పూర్తిగా చేతులెత్తేసినట్లవుతుందని మల్లగుల్లాలు పడుతున్నారు. కూటమిలో మాత్రం సానుకూ ల పవనాలు, జోష్‌ కనిపిస్తుండటంతో అభ్య ర్థులు ఖర్చుకు వెనుకాడటం లేదు.

తణుకు, పాలకొల్లులోనూ అదే జోరు

తణుకు, పాలకొల్లు మున్సిపాలిటీల్లోనూ అభ్యర్థులు తాయిలాల పంపిణీకి సిద్ధమవుతు న్నారు. కూటమిలో నియోజకవర్గ నేతలే అం తా తామై వ్యవహరిస్తుండగా, కౌన్సిలర్‌ అభ్య ర్థులు తమ వంతుగా ముందుకొస్తున్నారు. పాలకొల్లులో స్వతంత్ర అభ్యర్థులు అధికంగా ఉన్నప్పటికీ, తాయిలాల పంపిణీలో వారి ప్రభావం అంతగా ఉండదని ప్రధాన పార్టీలు అంచనా వేస్తున్నాయి. ఎన్నికల వ్యయం కంటే ఓటరు తీర్పు ఒకవైపే ఉంటోందని, ప్రస్తుతం కూటమికి సానుకూలత ఉండటంతో వైసీపీ అభ్యర్థులు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ప్రత్యర్థుల వ్యయాన్ని బట్టి తాయిలాలు ఎంత ఇవ్వాలనేది తేల్చుకోవాలని కూటమి అభ్యర్థు లు భావిస్తున్నారు. మొత్తంమీద మలి విడత పురపోరు చివరి దశకు చేరడంతో అధికారు లు ఎన్నికల ఏర్పాట్లలో తలమునకలు అవు తుంటే, అభ్యర్థులు తాయిలాల పంపకంపై మల్లగుల్లాలు పడుతున్నారు.

పల్లెల్లో ప్రచార జోరు

జిల్లాలో తొలివిడత పంచాయతీ ఎన్నికల ప్రచారానికి నేటితో మంగళవారం సాయం త్రం ఐదు గంటలతో తెరపడనుంది. ఇప్ప టికే ఉరుకులు.. పరుగులతో పల్లె ప్రచారం లో అభ్యర్థులు ఒత్తిడికి గురవతున్నారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ఈ నెల 21వ తేదీ సాయంత్రంతో ముగిసింది. ఎన్నికల అధికారులు అభ్యర్థులకు గుర్తుల ను తెలపడంతో ఆగమేఘాలతో స్టిక్కర్లు, ఫ్లకార్డులను తయారు చేయించుకుని ప్రచా రం ముమ్మరం చేశారు. ఇంటింటికీ వెళ్లి తమ గుర్తులను చూపించి ఓట్లను అభ్యర్థి స్తున్నారు. వార్డు అభ్యర్థులు తమ పరిధిలో 200 నుంచి 700లోపు వున్న ఓటర్లను కలిసి వచ్చారు. స్థానిక నాయకులు, వార్డుల్లో కుల పెద్దలతో అటు కూటమి పార్టీలు, ఇటు వైసీపీ నాయకులు ఓట్ల వేటలో పూర్తిస్థాయి లో నిమగ్నమయ్యారు. సర్పంచ్‌కు గులాబి కరపత్రంతో వార్డు సభ్యులు వైట్‌ కరపత్రం తో గుర్తులను ముద్రించుకుని ప్రచారం సా గిస్తున్నారు. తొలి విడత ఆచంట, మొగల్తూ రు, నరసాపురం, పెనుగొండ, పెనుమంట్ర మండలాల్లోని 90 పంచాయతీలకు ఏడు ఏకగ్రీవమయ్యాయి. మరో మూడు పంచా యతీల్లో సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నిక య్యారు. వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తారు. తొలి విడతలో 83 పంచాయతీలకు ఈ నెల 26న ఎన్నికలు నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

నేటితో ఉపసంహరణ గడువు

రెండో విడతలో గణపవరం, తాడేపల్లిగూ డెం, పెంటపాడు తణుకు, అత్తిలి, ఇరగవ రం మండలాల్లోని 121 పంచాయతీలకు ఎ న్నికలు నిర్వహిస్తున్నారు. మంగళవారంతో ఉపసంహరణ గడువు ముగియనుంది. పోటీలో ఉండే అభ్యర్థుల జాబితాను ప్రకటి స్తారు. ఈ నెల 29న ఎన్నికలు నిర్వహిం చేందుకు కసరత్తు చేస్తున్నారు.

మూడో విడత పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల గడువు సోమవారంతో ముగిసింది. భీమవరం, ఉండి, పాలకొల్లు నియోజకవర్గ మండలాల పరిధిలోని పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మొత్తం 182 పంచాయతీల్లో సర్పంచ్‌ స్థానాలకు 1,149 నామినేషన్‌లు దాఖలయ్యాయి. 1,914 వార్డు స్థానాలకు 5,153 నామి నేషన్‌లు వేశారు. వీటిని మంగళవారం పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసం హరణకు గురువారం వరకు గడువు ఉంది. ఆ రోజు బరిలో ఉండే అభ్యర్థు ల జాబితాను ప్రకటిస్తారు. ఎన్నికలు డిసెంబరు 2న నిర్వహించనున్నారు.

Updated Date - Nov 24 , 2026 | 12:23 AM