Share News

పామాయిల్‌ అ‘ధర’హో..

ABN , Publish Date - May 06 , 2026 | 12:37 AM

పామా యిల్‌ ధర రూ.23,656 పెరిగింది. పామా యిల్‌ చరిత్రలోనే ఇది అత్యధికం.

పామాయిల్‌   అ‘ధర’హో..

పెదవేగి, మే 5(ఆంధ్రజ్యోతి): పామా యిల్‌ ధర రూ.23,656 పెరిగింది. పామా యిల్‌ చరిత్రలోనే ఇది అత్యధికం. ఫిబ్రవరి నెలలో రూ.21,546లుగా ఉన్న ధర మార్చిలో రూ.1390 పెరిగి రూ.22,936 అయ్యింది. తిరిగి ఏప్రిల్‌ నెలకు సంబంధించి మేనెలలో ప్రకటించిన కొత్త ధర టన్నుకు రూ.720 పెరిగి, రూ.23,656 అయ్యింది. గడచిన 6నెలల్లో పామాయిల్‌ ధర పెరుగుతూ ఏప్రిల్‌ నెలకు సంబంధించిన గరిష్టధర రూ.23,656లుగా ప్రకటించారు. పామాయిల్‌ గెలల ధరను అంతర్జాతీయ ధరల సూచికను అనుసరించి, ప్రతినెల తొలివారంలో ప్రకటిస్తారు. ఆమేరకు గడచిన నెలకు సంబంధించిన ధరను మరుసటి నెలలో చెల్లిస్తారు. ఏప్రిల్‌కు సంబంధిం చిన ధర ఈ నెలలో ప్రకటించారు. పామాయిల్‌ గెలల ధర ఆశాజనకంగా లేకపోవడం, సాగులో నష్టాలను చవి చూసిన కొంతమంది రైతులు గిట్టుబాటు తోటలను తొలగించేశారు. అయితే 2022లో పామాయిల్‌ గెలల ధర ఒక్కసారిగా 22 వేల మార్క్‌ను దాటింది. అప్పటి నుంచి ఆయిల్‌ పామ్‌ సాగుకు రైతులు మొగ్గు చూపుతూ వచ్చారు. పభుత్వం కూడా ఉద్యానశాఖద్వారా ఆయిల్‌పామ్‌ సాగుకు ప్రోత్సాహకాలు, రాయితీలు అందిస్తుండడం సాగు విస్తీర్ణం పెరుగుదలకు దోహదపడిందని డివిజనల్‌ అధికారి జగదీశ్వర్‌ రెడ్డి తెలిపారు.

Updated Date - May 06 , 2026 | 12:37 AM