ఓటెత్తారు!
ABN , Publish Date - Nov 27 , 2026 | 01:29 AM
జిల్లాలో మొదటి విడత పంచాయతీ లతో పాటు మలి విడత పుర పోరులో భాగంగా చింతలపూడి నగర పంచాయతీ ఎన్నికల పోలింగ్ గురువారం ప్రశాం తంగా జరిగింది.
ప్రశాంతంగా తొలి విడత పల్లెపోరు.. 80.23 పోలింగ్ శాతం నమోదు
8164 సర్పంచ్, 1,567 వార్డు స్థానాలకు ఎన్నికలు
అన్నిచోట్ల ప్రశాంతం.. పటిష్ఠ పోలీసు బందోబస్తు
పోలింగ్ సరళిని పరిశీలించిన కలెక్టర్, జేసీ
తొలి విడత పల్లెపోరులో
కూటమిదే పైచేయి
మెజార్టీ సర్పంచ్, వార్డు సభ్యుల పదవులను దక్కించుకున్న కూటమి మద్దతుదారులు
(ఏలూరుసిటీ–ఆంధ్రజ్యోతి)
జిల్లాలో మొదటి విడత పంచాయతీ లతో పాటు మలి విడత పుర పోరులో భాగంగా చింతలపూడి నగర పంచాయతీ ఎన్నికల పోలింగ్ గురువారం ప్రశాం తంగా జరిగింది. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు. పటిష్ఠ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లాలోని 11 మండలాల్లోని 167 గ్రామ పంచాయతీల్లో 164 సర్పంచ్, 1,567 వార్డు స్థానాలకు పోలింగ్ కార్యక్రమం నిర్వ హించారు. జిల్లాలో నిర్వహించిన పోలింగ్లో 80.23 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించు కున్నారు. పోలింగ్ ప్రక్రియలో ఎక్కడా అవాంఛనీయన ఘటనలు జరగకుండా పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. జిల్లాలో తొలి విడత పల్లెపోరులో 13 సర్పంచ్లు, 324 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. పది పంచాయతీల సర్పంచ్, వార్డులతో పాటు పూర్తిస్థాయిలో ఏకగ్రీవం కావడంతో ఆ పది పంచాయతీలు ఏకగ్రీవమైనట్టు ప్రకటించారు. తొలి విడత జరిగిన 13 సర్పంచ్ పదవుల ఏకగ్రీవాల్లో పది సర్పంచ్ పదవులు కూటమి పార్టీల మద్దతు దారులకే దక్కాయి. రెండు సర్పంచ్ పదవులు వైసీపీ అనుకూలురుకు, ఒక సర్పంచ్ పదవి సీపీఐ ఎంఎల్ న్యూడెమాక్రసీ పార్టీ మద్దతు దారులకు దక్కాయి. కూటమి పార్టీలకు లభిం చిన 10 సర్పంచ్ పదవుల్లో 8 టీడీపీ, 2 జనసేన మద్దతు దారులు విజయం సాధించారు. జిల్లాలో తొలి విడత గురువారం నిర్వహిం చిన పల్లెపోరులో 80.23 శాతం పోలింగ్ జరి గింది. ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగింది.
ఫలితాల్లో కూటమిదే హవా
జిల్లాలో ప్రతి ఎన్నికలలోను కూటమిదే హవా కనిపిస్తోంది. గత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్ధులే మెజార్టీ స్థానాలలో విజయం సాధించారు. ఇప్పుడు తాజాగా గురువారం జరిగిన మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూటమిదే హవా కనిపించింది. మొదటి విడత జరిగిన పల్లెపోరులో గురువారం 1,677 సర్పంచ్ పదవులు, 1,567 వార్డు సభ్యుల పదవులకు ఎన్నికల పోలింగ్ నిర్వహించి అనం తరం మధ్యాహ్నం కౌంటింగ్ నిర్వహించారు. గురువారం పొద్దుపోయేవరకు 154 స్థానాల ఫలితాలు ప్రకటించగా ఇందులో టీడీపీ మద్దతు దారులు 71, జనసేన మద్దతుదారులు 12, వైసీపీ మద్దతుదారులు 59, ఇతరులు 12 స్థానా ల్లో విజయం సాధించారు. ఏకగ్రీవాలతో కలిపితే 164 సర్పంచ్ పదవుల్లో టీడీపీ మద్దతుదారులు 79, జనసేన మద్దతుదారులు 14, వైసీపీ మద్దతుదారులు 61, ఇతరులు 13 స్థానాల్లో విజ యం సాధించారు. మిగిలిన 10 సర్పంచ్ స్థానా ల ఫలితాలు వెల్లడికావాల్సి వుంది.