Share News

ధాన్యం పండుగ!

ABN , Publish Date - Apr 12 , 2026 | 12:04 AM

జిల్లాలో రబీ వరి ధాన్యం కొనుగోళ్లు ఇటీవల ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది దిగుబడులు ఆశాజనకంగానే ఉండడంతో ధాన్యం సేకరణలో లక్ష్యాన్ని కాస్తంత ఎక్కువగానే నిర్దేశించారు.

 ధాన్యం పండుగ!

ఆరు మండలాల్లో కొనుగోళ్లు ప్రారంభం

280 మెట్రిక్‌ టన్నుల సేకరణ

ఆరుగురు రైతుల ఖాతాలకు చెల్లింపులు

మూడు లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణే లక్ష్యం

ఏలూరు సిటీ, ఏప్రిల్‌ 11(ఆంధ్రజ్యోతి):జిల్లాలో రబీ వరి ధాన్యం కొనుగోళ్లు ఇటీవల ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది దిగుబడులు ఆశాజనకంగానే ఉండడంతో ధాన్యం సేకరణలో లక్ష్యాన్ని కాస్తంత ఎక్కువగానే నిర్దేశించారు. కొనుగోలు చేసిన ధాన్యానికి 48 గంటల్లో రైతుల బ్యాంకు ఖాతాలకు చెల్లింపులు చేస్తున్నారు. జిల్లాలోని 123 రైతు సేవాకేంద్రాల ద్వారా రబీ ధాన్యం కొనుగోళ్లను ప్రారంభిం చారు. ఆర్‌ఎస్‌కేలకు అను సంధానంగా 95 సహకార సంఘాలు, 19 డీసీఎంఎస్‌లు, 9 ఎఫ్‌టీవోల కొనుగోళ్లు జరుగుతున్నాయి. ప్రస్తుతానికి నిడమర్రు, ఉంగుటూరు, దెందులూరు, భీమడోలు, ఆగిరిపల్లి, ముది నేపల్లి మండలాల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమ య్యాయి. ఇప్పటి వరకు జిల్లాలో 13 మంది రైతుల నుంచి రూ.67 లక్షల విలువైన 280 మెట్రిక్‌టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. వీరిలో ఆరు గురు రైతులకు రూ.16 లక్షలను వారి బ్యాంకు ఖాతాల్లో జమ అయింది.

మూడు లక్షల మెట్రిక్‌ టన్నులు లక్ష్యం

జిల్లాలో వ్యవసాయ శాఖ అంచనాల మేరకు ఈ ఏడాది రబీలో 3.69 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉత్ప త్తి అవుతుందని అంచనా వేయగా మూడు లక్షల మెట్రిక్‌ టన్నుల వరకు ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. జిల్లాలో ఎక్కడా గోనె సంచుల కొరత ఏర్పడకుండా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. రవాణా విషయంలో రైతులు ఇబ్బంది పడకుండా ఏర్పా ట్లు చేస్తున్నారు. ధాన్యం సేకరణపై ఎప్పటికప్పుడు అధికారులతో జేసీ అభిషేక్‌గౌడ సమీక్షిస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లను పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌ శివ రామమూర్తి పర్యవేక్షిస్తున్నారు.

పీఆర్‌ 126 రకం ధాన్యాన్ని కొనుగోలు చేయాలి

భీమడోలు, ఏప్రిల్‌ 11(ఆంధ్రజ్యోతి):పీఆర్‌ 126 రకం ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని, నాణ్యమైన గోనె సంచులు అందించాలని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్‌, జిల్లా కమిటీ సభ్యులు వెంకట్రావు ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు ను కోరారు. భీమడోలు మండలం గుండుగొలను సొసైటీ వద్ద ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివా రం ప్రారంభించడానికి వచ్చిన ఎమ్మెల్యేను కలిసి రైతు సంఘం నాయకులు ధాన్యం కొనుగోలు సమస్యలను ఎమ్మెల్యేకి వివరించారు. శ్రీనివాస్‌ మాట్లాడుతూ లాభదా యకంగా ఉంటుందని రైతులు, కౌలు రైతులు పీఆర్‌ 126 రకం వరి పంటను సాగు చేశారని, వివిధ కారణాలతో ఈ రకం ధాన్యాన్ని కొనుగోలు చేయమని చెబుతున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుత రబీ సీజన్‌లో పీఆర్‌ 126 రకం ధాన్యాన్ని కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ధాన్యం అమ్మిన సొమ్ములతోపాటు రవాణా కిరాయిలు, హమాలీ ఛార్జీలు సకాలంలో చెల్లించేలా చర్యలు చేపట్టాలన్నారు.

Updated Date - Apr 12 , 2026 | 12:05 AM