Share News

నేటి నుంచే రబీ ధాన్యం కొనుగోళ్లు

ABN , Publish Date - Apr 06 , 2026 | 12:13 AM

జిల్లాలో రబీ సీజన్‌ (2025–26) లో పండించిన ధాన్యాన్ని సోమవారం నుంచి కొనుగోలు చేసేందుకు ఏర్పా ట్లు పూర్తయ్యాయి. జిల్లాలో 123 రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోలుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.

నేటి నుంచే రబీ ధాన్యం కొనుగోళ్లు

మూడు లక్షల మెట్రిక్‌ టన్నులు లక్ష్యం.. 123 ఆర్‌ఎస్‌కేల్లో ఏర్పాట్లు

ఏలూరుసిటీ, ఏప్రిల్‌ 5(ఆంధ్రజ్యో తి): జిల్లాలో రబీ సీజన్‌ (2025–26) లో పండించిన ధాన్యాన్ని సోమవారం నుంచి కొనుగోలు చేసేందుకు ఏర్పా ట్లు పూర్తయ్యాయి. జిల్లాలో 123 రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోలుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. దీనికి అను బంధంగా 95 సహకార సంఘాలు, 19 డీసీఎంఎస్‌లు, 9 ఎఫ్‌టీవోల ద్వారా ధాన్యాన్ని సేకరించాలని నిర్ణయించా రు. రైతు సేవాకేంద్రాల వద్ద ధాన్యం కొనుగోలుకు సంబంధించిన పరికరాల ను సిద్ధం చేసుకున్నారు. తేమ కొలిచే యంత్రాలు, గోనె సంచులు, సాంకే తిక పరికరాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో ఈ సారి రబీ సీజన్‌లో 3.69 లక్షల మెట్రిక్‌ టన్నుల వరకు ధాన్యం దిగుబడులు వస్తాయని అంచనా వేశా రు. దీనికి తగ్గట్టుగా 3 లక్షల మెట్రిక్‌ టన్నుల వరకు కొనుగోలు చేయాలని లక్ష్యాన్ని నిర్ధేశించుకున్నారు. తేమ శాతం 17 శాతం లోపుగా ఉన్న ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. గ్రేడ్‌–ఏ రకం ధాన్యాన్ని క్వింటాల్‌కు రూ.2,389, సాధారణ రకం ధాన్యాన్ని క్వింటాల్‌కు రూ. 2,369కు కొనుగోలు చేస్తారు. రబీ ధాన్యం కొనుగోళ్లకు 60 లక్షలు గోనె సంచులు అవసరంకాగా జిల్లాలో ప్రస్తుతం 6లక్షల గోనె సంచు లు ఆర్‌ఎస్‌కేలు, సహకార సంఘాల వద్ద సిద్ధంగా ఉన్నాయి. రైస్‌ మిల్లులు వద్ద కూడా గోనె సంచులను సిద్ధంగా ఉంచారు. రవాణాకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని కస్టమ్‌ మిల్లింగ్‌ చేసేందుకు 112 రైస్‌ మిల్లులను గుర్తించారు. ధాన్యం కొనుగోలు చేసిన 8 గంటల నుంచి 24 గంటల లోపు ధాన్యం సొమ్ములు రైతు బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు.

Updated Date - Apr 06 , 2026 | 12:13 AM