Share News

రబీ రెడీ..!

ABN , Publish Date - Mar 20 , 2026 | 12:43 AM

ఏప్రిల్‌ మూడో తేదీ నుంచి రబీ ధాన్యం కొనుగోలుకు కార్యాచరణ సిద్ధమైంది.

రబీ రెడీ..!

వచ్చే నెల 3 నుంచి ధాన్యం కొనుగోళ్లు

ఉత్పత్తి అంచనా 9.58 లక్షల టన్నులు..

కొనుగోలు లక్ష్యం 7.50 లక్షల టన్నులు

283 రైతు సేవా కేంద్రాల్లో ఆన్‌లైన్‌ నమోదు..

48 గంటల్లోనే సొమ్ములు జమ

(భీమవరం–ఆంధ్రజ్యోతి):

ఏప్రిల్‌ మూడో తేదీ నుంచి రబీ ధాన్యం కొనుగోలుకు కార్యాచరణ సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఒకే విధానాన్ని అమ లు చేయడంలో భాగంగా ఒకటో తేదీ నుంచి ఆన్‌లైన్‌ ప్రక్రియ ప్రారంభించనుంది. ఈలోగా కొనుగోలు చేస్తే ఖరీఫ్‌ కిందకు రానున్నాయి. ఫలితంగా జిల్లాలో మూడో తేదీ నుంచి కొనుగో లు చేయాలని ముహూర్తం నిర్ణయించారు. రబీలో ధాన్యం ఉత్పత్తులు గణనీయంగా పెరగ నున్నాయి. వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం 9.58 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుం దని భావిస్తున్నారు. ఇందులో 7.50 లక్షల టన్ను లు కొనుగోలుకు పౌరసరఫరాల కార్పొరేషన్‌ సంకల్పించి, ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఈ మేరకు జిల్లాలోని 283 రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయనుంది.

పది శాతం నూకతోనే బియ్యం సేకరణ

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 15 శాతం నూకతో బియ్యం సేకరిస్తోంది. కొనుగోలు చేసిన ధాన్యాన్ని కస్టమ్‌ మిల్లింగ్‌ కోసం మిల్లర్లకు అప్ప గిస్తోంది. గతంలో 25 శాతం నూకతో మిల్లర్లు ప్రభుత్వానికి బియ్యం అప్పగించేవారు. కేంద్రం అదే విధానాన్ని అమలు చేసేది. రేషన్‌ లబ్ధిదా రులకు నాణ్యమైన బియ్యాన్ని అందించాలన్న ఉద్దేశంతో నూక శాతం తగ్గించారు. గత ఖరీఫ్‌ నుంచి కేంద్ర ప్రభుత్వం 10 శాతం నూకకే పరి మితం చేసింది. జిల్లాలో మిల్లర్లు ఈ విధానంలో నూకతోనే బియ్యాన్ని అప్పగించారు. గతంలో క్వింటాలుకు 67 కిలోల బియ్యం ఇచ్చేవారు. పది శాతం నూకతో ఇచ్చినప్పుడు 56 కిలోలు ఇస్తే సరిపోతోంది. నూకను ప్రత్యేకంగా కేంద్రమే కొనుగోలు చేస్తోంది. వచ్చే ఖరీఫ్‌ నుంచి కేంద్రం మాదిరిగానే రాష్ట్ర ప్రభుత్వం పది శాతం నూక తోనే బియ్యం తీసుకోవాలని నిర్ణయించింది. ప్రస్తుత రబీ నుంచి పది శాతం నూక విధానా న్ని అమలు చేయాలని ప్రభుత్వానికి మిల్లర్లు నివేదిక ఇచ్చారు. ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు.

రబీలోనూ 48 గంటల వ్యవధిలోనే రైతుల ఖాతాలో సొమ్ములు జమ చేయనున్నారు. కూట మి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొనుగోలు విధానంలో వెసులుబాటు ఇచ్చింది. మిల్లులను ఎంపిక చేసుకునే అవకాశాన్ని రైతు లకు కల్పించింది. ముందుగానే మిల్లు నిర్ధారణ అవుతోంది. దీంతో ధాన్యం అప్పగించడం సునా యాసమవుతోంది. తాడేపల్లిగూడెం మండలంలో రైతులు తూర్పు గోదావరి వర్తకులకు విక్రయిం చేవారు. ప్రస్తుతం రైతులు ప్రైవేటు అమ్మకాలు తగ్గించి ప్రభుత్వానికే విక్రయిస్తున్నారు.

Updated Date - Mar 20 , 2026 | 12:43 AM