Share News

ఖాతాల్లోకి సొమ్ములు

ABN , Publish Date - Nov 30 , 2026 | 12:34 AM

తుఫాన్‌తో సార్వాలో భారీనష్టాన్ని చవిచూసిన రైతన్నలకు ధాన్యం సొమ్ముల జమలో ఊరట లభించింది.

ఖాతాల్లోకి సొమ్ములు

ధాన్యం కొనుగోలులో స్పీడు

24 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి సొమ్ములు

జిల్లాలో 34,500 మెట్రిక్‌టన్నులు కొనుగోలు..

రూ.64 కోట్లు జమ

భీమవరం రూరల్‌, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): తుఫాన్‌తో సార్వాలో భారీనష్టాన్ని చవిచూసిన రైతన్నలకు ధాన్యం సొమ్ముల జమలో ఊరట లభించింది. అమ్మిన 24 గంటల్లో ప్రభుత్వం రైతుల ఖాతాల్లో సొమ్ములు జమ చేసింది. ఇప్పటికే తుఫాన్‌ దాటికి సార్వా దిగుబడి భారీగా పడిపోయింది. ఎక్కడా 10 బస్తాలు మించి పంట పండలేదు. దీంతో పెట్టుబడితో పాటు కొంత మాత్రమే ఆదాయం వస్తుంది. రైతులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ధాన్యం అమ్మకాల్లో ప్రత్యేక దృష్టి పెట్టింది. దీంతో పదిరోజులుగా పంట మాసూళ్లు జరుగుతుంటే ఎప్పటికప్పుడు ధాన్యాన్ని కొనుగోలు చేసేలా అధికారులకు సూచించింది. ఇప్పటి వరకు 34,500 మెట్రిక్‌ టన్నులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా కొన్నారు.దాని నిమిత్తం రూ.81 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉండగా రూ.64 కోట్లు రైతులకు అందించింది. ఇప్పటికే నష్టపోయిన రైతు మాసూళ్లు చేసేందుకు వరికోత యంత్రా లకు ధాన్యం ఎండబెట్టి పట్టుబడి చేసిన కూలీలకు సొమ్ములు చెల్లిం చేందుకు ఇబ్బందులు పడుతున్న సమయంలో ధాన్యం అమ్మిన వెంటనే సొమ్ములు రావడం రైతులకు కొంత ఊరటగా మారింది.

మెట్ట ప్రాంతమైన తాడేపల్లిగూడెం, గణపవరం ఏరియాల్లో చాలా వరకు మాసూళ్లు జరిగాయి. ఇప్పుడు ముమ్మరంగా మొదల య్యాయి. మరో 10 రోజుల్లో డెల్టా ప్రాంతంలో కూడా మాసూళ్లు జరగనున్నాయి. ఇలాంటి సమయంలో ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే సొమ్ములు రైతుల ఖాతాల్లో వేయడం వలన రైతులు వచ్చేపంటకు పెట్టుబడిగా పెట్టడానికి కూడా ఉపయోగ కరంగా ఉంటుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తుఫాన్‌దెబ్బకు ఈనెల మొదటి వారంలో లక్ష మెట్రిక్‌ టన్నులు మాత్రమే దిగుబడి వస్తుందని అధికారులు లెక్కలు వేశారు. వర్షంనీరు తగ్గాక 3 లక్షల మెట్రిక్‌ టన్నులు రావచ్చని లెక్కకట్టారు. ప్రస్తుతం పంట మాసూళ్లు, దిగుబడిని బట్టి 2 లక్షల టన్నుల కన్నా తక్కువ దిగుబడే వచ్చేలా కనిపిస్తున్నది.

ఈ సమయంలో ఊరటే

సార్వాలో ప్రకృతి వైపరీత్యాల ప్రభావం ఎక్కువ.ఈసారి తుఫాన్‌ల దెబ్బకు చేలు నీట మునిగాయి. నీరు తగ్గాక మాసూళ్లు చేయాలి. ప్రస్తుత పరిస్థితులను బట్టి మాసూళ్లు అయిన తరువాత ధాన్యం స్పీడ్‌గా కొనటంతో పాటు సొమ్ములు కూడా 24 గంటల్లో వేస్తున్నారు. దీనివల్ల రైతుకు మంచి చేయూతనిచ్చి నట్టవుతుంది. మాసూళ్లు చేసిన వారికి డబ్బులు చెల్లించుకోవడానికి వీలవుతుంది.

శ్రీరామచంద్రమూర్తి, పెదగరువు

రైతులకు అనుకూలంగా ఉంది

కూటమి ప్రభుత్వం వచ్చాక ధాన్యం కొను గోలులో ఇబ్బందులు తగ్గాయి. కొనుగోలు చేసి 24 గంటల లోపులో డబ్బులు వేస్తున్నారు. మా చేలో ఇంకా నీరు తగ్గాల్సి ఉంది. తగ్గిన వెంటనే మాసూళ్లు చేసి అమ్మకాలు చేసు కుంటాం. ప్రస్తుత కొనుగోలు విధానం రైతులకు అనుకూలంగా ఉంది.

సత్యనారాయణమూర్తి, గునుపూడి

Updated Date - Nov 30 , 2026 | 12:35 AM