పీ–4తో బంగారు కుటుంబాల్లో ఆర్థికాభివృద్ధి
ABN , Publish Date - Mar 31 , 2026 | 01:08 AM
జిల్లాలో అమలు చేస్తున్న పీ–4 కార్యక్రమంలో 14,795 బంగారు కుటుంబాలను మార్గదర్శకులతో అనుసంధానం చేయడం వల్ల విద్యా, ఆర్థిక రంగాల్లో అభివృద్ధి సాధించామని కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు.
తొలి వార్షికోత్సవంలో కలెక్టర్ వెట్రిసెల్వి
ఏలూరు, మార్చి 30(ఆంధ్రజ్యోతి):జిల్లాలో అమలు చేస్తున్న పీ–4 కార్యక్రమంలో 14,795 బంగారు కుటుంబాలను మార్గదర్శకులతో అనుసంధానం చేయడం వల్ల విద్యా, ఆర్థిక రంగాల్లో అభివృద్ధి సాధించామని కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. ఏలూరు కలెక్టరేట్‌లో పీ– 4 కార్యక్రమం తొలి వార్షికోత్సవం సోమవారం ఘనంగా నిర్వహిం చారు. ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్యతో కలిసి ఏలూరు నియోజక వర్గ మార్గదర్శులను ఆమె సత్కరించి మాట్లాడారు. జిల్లాలో 71,910 బంగారు కుటుంబాలను, 4,841 మార్గదర్శులను గుర్తించామన్నారు. పీ– 4లో దత్తత తీసుకున్న వారికి అవసరమైన విద్యా, ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడంతో పాటు ఆయా బంగా రు కుటుంబాలు సమాజంలో ఆర్థికంగా వృద్ధి చెందుతారని ఆశా భావం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా నిరుపేద కుటుంబాల సర్వే నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేశారన్నారు. ఈ సందర్భంగా జిల్లాస్థాయిలో ఉత్తమంగా పనిచేసిన మార్గదర్శులు మండవ ట్రస్ట్ తరపున మండవ ఆశా ప్రియ, భీమడోలు మొండెలెజ్ ఇండియా ఫుడ్స్ తర పున డాక్టర్ చల్లూరి బాబు, దెందులూరు నెక్స్‌జన్ కంపెనికి చెందిన ఏవీ సుబ్రహ్మణ్యంలను, ఏలూరు నియోజకవర్గంలో నగరగంటి శ్రీహర్షిణి, సత్యప్రభాకర్‌రావు, దివ్వెల జయప్రకాశ్, ఎంవీవీఎస్ నాగేశ్వరావులను సత్కరించి మెమెంటోలు, ప్రశంసాపత్రాలను కలెక్టర్, ఎమ్మెల్యే అందజేశారు. తిరుపతిలో ముఖ్యమంత్రి చంద్ర బాబు పాల్గొన్న పీ–4 కార్యక్రమాన్ని అధికారులు, ప్రజా ప్రతినిధులు తిలకించారు. జేసీ డాక్టర్ అభిషేక్ గౌడ, ఇన్‌చార్జి డీఆర్వో భాస్కర్, సీపీవో శ్రీదేవి, కమిషనర్ భానుప్రతాప్, పాల్గొన్నారు.