సొంతింటి కలే..!
ABN , Publish Date - Feb 26 , 2026 | 12:47 AM
భీమవరం రూరల్ మండలం కొవ్వాడ అన్నవరం వంటి లే అవుట్‌లలో లబ్ధిదారులకు పట్టణానికి చెందిన పంపుల చెరువు లేఅవుట్‌లో మంజూరు చేశారు. ఇళ్లు నిర్మించి ఇస్తున్నారు. గునుపూడి లే అవుట్‌లో లబ్ధిదారులు అధికంగా ఉన్నారు.
చేతిలో పట్టాలున్నా ఇళ్లు రద్దు
భీమవరంలో లబ్ధిదారులకు వింత అనుభవం
ఎకరం ధర రూ.1.07 కోట్లకు 84 ఎకరాలు కొనుగోలు
పూడికకు కోట్ల రూపాయలు
అయినా అక్కరకు రాని భూమి
వెంటాడుతున్న వైసీపీ పాపాలు.. ప్రజలకు శాపాలు
భీమవరం రూరల్ మండలం కొవ్వాడ అన్నవరం వంటి లే అవుట్‌లలో లబ్ధిదారులకు పట్టణానికి చెందిన పంపుల చెరువు లేఅవుట్‌లో మంజూరు చేశారు. ఇళ్లు నిర్మించి ఇస్తున్నారు. గునుపూడి లే అవుట్‌లో లబ్ధిదారులు అధికంగా ఉన్నారు. వారందరికి మరోచోట ఇవ్వడానికి అనువైన స్థలం లేదు. ఉన్న లే అవుట్‌ను వినియోగించుకునే అవకాశం అంతకన్నా లేదు. పూడిక చేయడమే పెద్ద గగనంగా మారింది. పేదల పేరుతో సేకరించిన భూమి యజమానులకు మేలు చేసింది. అప్పటి వైసీపీ నేతలకు లబ్ధి చేకూర్చింది. సదరు లే అవుట్‌పై అధికారులు ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు.
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
భీమవరంలో సొంతింటి కల నెరవేరు తుందంటూ ఆశించిన పేదలకు వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పిదాలు వెంటాడు తున్నాయి. వర్షాకాలంలో చెరువులను తలపించే భూములను కొనుగోలు చేసి పేదలకు పట్టాలు పంపిణీ చేశారు. వానా కాలంలో అక్కడ పంట సరిగా పండే అవకాశమే లేదు ముంపునకు గరవుతుం టాయి. ఇప్పుడు అదే స్థలంలో మురుగు నీరు ఉంది. అడుగు పెట్టాలంటేనే కంప రం పుడుతుంది. పూడిక కూడా చేయ లేదు. దీనికోసం కోట్ల రూపాయలు వెచ్చించాలి. అంత మట్టి కూడా అందు బాటులో ఉండదు. అటువంటి లోతట్టు భూమిని వైసీపీ హయాంలో పేదల ఇంటి కోసమని కొనుగోలు చేశారు. లబ్ధిదారుల చేతికి పట్టాలు ఇచ్చేశారు. తీరా అవి ఇంటి నిర్మాణానికి అనువుగా లేవు. ఆన్‌లైన్‌లో పెండింగ్‌లో చూపిస్తున్నాయి. నిర్మాణాలు పూర్తికానట్టయితే పీఎం ఆవాస యోజన లో తదుపరి ఇళ్లు మంజూరు చేసేది లేదంటూ కేంద్రం స్పష్టం చేసింది. దీంతో జిల్లాలో నిర్మాణానికి నోచుకోని 17 వేల ఇళ్లను రద్దు చేశారు. అందులో భీమవరం లోనే 3,600 ఇళ్లున్నాయి. గునుపూడి ప్రాంతంలో సేకరించిన 84 ఎకరాల భూమిలో సదరు ఇళ్లను కేటాయించారు. పట్టణంలో లబ్ధిదారులకు సెంటు స్థలం వంతున కేటాయించారు. ఇప్పటికీ లబ్ధి దారుల వద్ద పట్టాలు మాత్రమే ఉన్నాయి. ఆన్‌లైన్‌లో పేరును తొలగించారు.
తొమ్మిది అడుగులు పూడ్చాలి
వైసీపీ ప్రభుత్వంలో సేకరించిన 84 ఎకరాల్లో ఇళ్ల నిర్మాణానికి అనువుగా ఉండాలంటే దాదాపు తొమ్మిది అడుగులు పూడ్చాలి. లేదంటే వానాకాలంలో ముంపు తప్పదు. అటువంటి స్థలాన్ని అప్పట్లో కొనుగోలు చేశారు. బహిరంగ మార్కెట్ ధరకంటే రెట్టింపు చెల్లించారు. అందుకోసం పెద్ద మొత్తంలో సొమ్ములు చేతులు మారాయి. కానీ భారమంతా ప్రభుత్వంపై పడింది. భూమి అక్కరకు రాకుండా పోయింది. పేదలకు శాపంగా మారింది. కొత్తగా స్థలాలు కేటాయించడానికి లేదు. వారి పేరుతో సెంటు స్థలం ఉంది. మరోచోట ఇవ్వాలంటే అక్కడ స్థలాలను రద్దు చేయాలి. జిల్లాలో నిర్మాణానికి నోచుకోని లే అవుట్‌లు ఉన్నప్పటికీ ఇళ్లు రద్దు చేయలేదు. ఆన్‌లైన్‌లో లబ్ధిదారుల పేర్లున్నాయి. భీమవరంలో మాత్రం రద్దు చేయాల్సి వచ్చింది. అక్కడ అనువుగా లేకపోవడంతో ఎప్పటికీ నిర్మాణం చేపట్టే అవకాశం లేదు. భూములు అమ్మేసిన యజమానులు మాత్రం ఖుషీగా ఉన్నారు. అక్కడ సొంతింటి కోసం స్థలాలు పొందిన లబ్ధిదారులు ఈసురోమంటున్నారు.