Share News

పీఎఫ్‌ సమస్య పరిష్కరించండి..

ABN , Publish Date - Jul 07 , 2026 | 12:49 AM

తమ ప్రావిడెంట్‌ఫండ్‌ ఖాతాల సమస్యను పరిష్కరిం చడంలో అధికారులు ఏళ్ల తరబడి జాప్యం చేస్తున్నారని నిరసిస్తూ పంచాయతీరాజ్‌ ఓల్డ్‌ పెన్షన్‌ స్కీము ఉద్యోగులు, ఉపాధ్యాయులు సోమవారం కైకలూరు జడ్పీ పీఎఫ్‌ బా

పీఎఫ్‌ సమస్య పరిష్కరించండి..
వడాలి జడ్పీ హైస్కూలు వద్ద ఓపీఎస్‌ ఉపాధ్యాయుల నిరసన

ఓపీఎస్‌ ఉపాధ్యాయుల మహానిరసనలు ప్రారంభం

ముదినేపల్లి, జూలై 6(ఆంధ్రజ్యోతి):తమ ప్రావిడెంట్‌ఫండ్‌ ఖాతాల సమస్యను పరిష్కరిం చడంలో అధికారులు ఏళ్ల తరబడి జాప్యం చేస్తున్నారని నిరసిస్తూ పంచాయతీరాజ్‌ ఓల్డ్‌ పెన్షన్‌ స్కీము ఉద్యోగులు, ఉపాధ్యాయులు సోమవారం కైకలూరు జడ్పీ పీఎఫ్‌ బాధిత ఉద్యోగుల పోరాట కమిటీ ఆధ్వర్యంలో మహానిరసన చేపట్టారు. ఇందులో భాగంగా కమిటీ నాయకులు గొట్టిపాటి రమేష్‌, బేతాళ రాజేంద్రప్రసాద్‌ ఆధ్వర్యంలో వడాలి జడ్పీ హైస్కూలు వద్ద ఓపీఎస్‌ ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలతో మహానిరసనలో పాల్గొన్నారు. తమ జీతాల నుంచి మినహాయిస్తున్న పీఎఫ్‌ చందాల సొమ్మును వడ్డీతో సహా చెల్లించేందుకు పంచాయతీరాజ్‌శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కొత్త జిల్లాలు ఏర్పాటయిన అనంతరం 2022 అక్టోబరు నుంచి కృష్ణాజిల్లా పరిషత్‌ కార్యా లయంలోని తమ పీఎఫ్‌ అకౌంట్లలో చందాల సొమ్మ జమ కాకపోయిన ప్పటికీ అధికారులు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నాలు గేళ్లుగా తమ జీతాల నుంచి నెలవారీ మినహాయిస్తున్న సొమ్ము కైకలూరు ట్రెజరీ ద్వారా ప్రొసీడింగ్స్‌తో సహా ఏలూరు జిల్లా పరిషత్‌ ఖాతాలో జమ అవుతున్న పీఎఫ్‌ సొమ్ము కృష్ణా జిల్లా పరిషత్‌లో ఉన్న తమ ఖాతాలకు బదిలీ చేయకుండా అధికారులు తాత్సారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని తాము పంచాయతీరాజ్‌ రాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టికి తీసు కెళ్లినా ఫలితం లేకుండా పోయిందని..ఉపాధ్యాయులపై ఎందుకింత చిన్న చూపు అని ప్రశ్నించారు. వడాలి హైస్కూలు హెచ్‌ఎం ప్రభుదాసు, ఉపా ధ్యాయులు జి.అనిల్‌, నరసింహారావు, సంధ్య, హేమలత తదితరులు పాల్గొన్నారు.

కైకలూరు : ప్రభుత్వ ఉద్యోగులకు జడ్పీపీఎఫ్‌ నిధులు తక్షణమే విడుదల చేయాలని ఉద్యోగులు డిమాండ్‌ చేశారు. సోమవారం కైకలూరు ఎంపీడీవో కార్యలయం వద్ద పంచాయతీరాజ్‌ ఉద్యోగులు, ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. మండల జడ్పీపీఎఫ్‌ పోరాటసమితి నాయకులు రవిశంకర్‌, చంద్రశేఖర్‌, బెనెర్జీ, వడ్డీ శ్రీనివాస రావు, చిట్టిబాబు, ఏపీఎన్జీవోస్‌ అధ్యక్షుడు అబ్దుల్‌ రహీం, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 07 , 2026 | 12:49 AM