రైతు బజార్లకు నాసిక్ ఉల్లి
ABN , Publish Date - Oct 04 , 2026 | 12:35 AM
ఇక రైతు బజారుల్లో నాసిక్ ఉల్లిని తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనిలో భా గంగా ఏపీ మార్కెటింగ్ శాఖ, నాసిక్‌లోని మా ర్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో చర్చలు జరిగినట్లు తెలిసింది. ఫైలెట్ ప్రాజెక్టుగా ఏపీలో విశాఖ, విజయవాడ, గుంటూరులో చేపట్టనున్నారు.
రైతు బజార్లకు నాసిక్ ఉల్లి
పైలట్ ప్రాజెక్టుగా విశాఖ, విజయవాడ, గుంటూరు
నాసిక్ మార్కెటింగ్ శాఖతో ఏపీ అధికారుల చర్చలు
తాడేపల్లిగూడెం, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి):ఇక రైతు బజారుల్లో నాసిక్ ఉల్లిని తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనిలో భా గంగా ఏపీ మార్కెటింగ్ శాఖ, నాసిక్‌లోని మా ర్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో చర్చలు జరిగినట్లు తెలిసింది. ఫైలెట్ ప్రాజెక్టుగా ఏపీలో విశాఖ, విజయవాడ, గుంటూరులో చేపట్టనున్నారు. రెం డవ దశలో అన్ని జిల్లా కేంద్రాలలోను, మూడవ దశలో పట్టణాల్లో ఉన్న రైతు బజారులకు ఈ ఉల్లిని సరఫరా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు అధికారులు ధృవీకరిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం, పాలకొల్లు, నర్సాపురంలో మాత్రమే రైతు బజారులున్నాయి. ఇక తాడేపల్లి గూడెం, తణుకు వంటి మున్సిపాల్టీలో నేటికి రైతు బజార్లు లేవు. కొత్తగా ఏర్పడిన ఆకివీడు వంటి నగరపంచాయతీల్లో కూడా రైతు బజారులు లేవు. ప్రతి నియోజకవర్గానికి రైతు బజారు ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా ప్రధాన పట్టణాల్లో రైతు బజార్లు ఏర్పాటు చేసేం దుకు కూటమి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. వీటిలో నాణ్యమైన మహారాష్ట్రకు చెందిన ఉల్లిని విక్రయించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు.
నాణ్యత లోపిస్తున్న ఉల్లి..
ఏపీలోని కర్నూలు ప్రాంతం నుంచి వస్తున్న ఉల్లి అకాల వర్షాల వల్ల నాణ్యత లోపిస్తోంది.ఈ ఏడాది కర్నూలు ఉల్లికి మంచి డిమాండ్ ఉంది. కాని రైతులకు చేతికందే దశలో అకాల వర్షాల వల్ల కొంత దెబ్బతింది. ఈ వర్షాల వల్ల తాడేపల్లి గూడెం మార్కెట్‌కు కర్నూలు ఉల్లి రోజూ 30 లారీల వరకు వస్తుంది. గత ఏడాది ఉల్లి సాగు విస్తారంగా వేశారు. ఉల్లికి తెగులు ఆశించడం, అకాల వర్షాల వల్ల దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో సాగును తగ్గించారు. ఈ ఏడాది ఉల్లి పండించిన రైతులకు కాసుల వర్షం కురిసింది. కాని ఇటీవల వర్షాల వల్ల ఉల్లి పంట తడిసింది.దీంతో త్వరగా మార్కెట్‌కు తరలించా లనే ఉద్దేశంలో రైతులు తాడేపల్లిగూడెం మార్కె ట్‌కు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో కర్నూలు ఉల్లి క్వింటా హోల్ సేల్‌గా రూ.2500 నుంచి 3000 పలుకుతోంది. ఈ సీజన్‌లో కర్నూలు ఉల్లి క్వింటా రూ.5వేలకు కూడా వెళ్లింది.