ఉల్లి లొల్లి
ABN , Publish Date - Sep 07 , 2026 | 12:20 AM
మార్కెట్‌లో ఉల్లి ధర మండుతోంది. సామాన్య మధ్యతరగతి వారు వీటిని కొనుగోలు చేయలేని స్థాయికి చేరింది.
ఆకాశాన్నంటిన ధర
రిటైల్‌గా కిలో రూ.70
హోల్‌సేల్ క్వింటా
అత్యధికం రూ.500
తాడేపల్లిగూడెం, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): మార్కెట్‌లో ఉల్లి ధర మండుతోంది. సామాన్య మధ్యతరగతి వారు వీటిని కొనుగోలు చేయలేని స్థాయికి చేరింది. మహారాష్ట్ర ఉల్లి హోల్‌సేల్‌గా క్వింటా నాణ్యత ఆధారం గా రూ.3500 నుంచి 5500 వరకు విక్రయించారు. కర్నూలు కొత్త ఉల్లి క్వింటా ఉల్లి రూ.4000 నుంచి 4500 మధ్య అమ్మారు. రిటైల్‌గా రూ.వందకు కిలోన్నర ఉల్లిని విక్రయిస్తున్నారు. గత రెండేళ్లలో ఈ స్థాయి ధర లేదు. గత ఏడాది గడ్డు పరిస్థితి ఎదుర్కొన్న ఉల్లి రైతులు సాగు తగ్గించారు. ఉత్పత్తి తగ్గడంతో రికార్డు స్థాయి ధర పలుకు తోంది. క్వింటా ఉల్లి హోల్‌సేల్ ధర అత్యధికంగా రూ.4500 పలికిందంటే పరిస్థితి అర్దమవుతోంది.
కర్నూలు ఉల్లి వస్తేనే..
మార్కెట్‌కు కర్నూలు ఉల్లి వస్తేనే మహారాష్ట్ర రకం ఉల్లికి డిమాండ్ తగ్గుతుంది. సామాన్య, మధ్యతరగతి వారు ఈ ఉల్లినే కొనుగోలు చేయడంతో ధరలు అదుపులోకి వచ్చేవి. ఇప్పుడు పరిస్థితులు మారాయి. అప్పటో కర్నూ లు నుంచి తాడేపల్లిగూడెం మార్కెట్‌కు రోజుకు 80 నుంచి 120 వరకు ఉల్లిలోడుతో లారీలు వచ్చేవి. ఇప్పుడు అక్కడ సాగు విస్తీర్ణం తగ్గడంతో పాటు కర్నూలులో ఉల్లి మార్కెట్ ఏర్పాటు చేశారు. రైతులు నేరుగా అమ్ముకు నేందుకు అవకాశం కల్పించారు. దళారుల ప్రమేయం లేకుండా రైతులు నేరుగా మార్కెట్ యార్డుకు తెచ్చి అమ్ముకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది. దీనికి తోడు ఒడిశా, పశ్చిమబెంగాల్ వ్యాపారులు నేరుగా కర్నూలు మార్కెట్‌కు వెళ్లి కొనుగోలు చేసుకుని వారి ప్రాంతాలకు తీసుకుని వెళుతున్నారు. దీంతో గూడెం మార్కెట్ కర్నూలు ఉల్లి రావడం బాగా తగ్గిపో యింది. రోజుకు 2 నుంచి 5 లారీల లోపే ఉల్లి వస్తుంది. ఆ ఉల్లిని తెచ్చే రైతులు కూడా ఇక్కడ వ్యాపారులతో ఆర్థిక సంబంధాలు ఉన్న వారు మాత్రమే తీసుకొస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది ఉల్లి మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. మార్కెట్‌కు వచ్చేవారు వారానికి 3కిలోలు తీసుకెళ్లేవారు ధరలను చూసి ఒకటి నుంచి 2 కిలోలే తీసుకెళుతున్నారు. గత వారంతో పోల్చుకుంటే వారంలోనే కిలోకు రూ.10 పెరిగింది.