Share News

ఉల్లి ఘాటు

ABN , Publish Date - Jun 29 , 2026 | 12:24 AM

మార్కెట్లో ఉల్లి ధరలు మండుతున్నాయి. గత వారం కొద్దిగా పెరిగిన ఉల్లి ఈ వారం మరింత పెరిగి వినియోగదారులను కలవరపె డుతున్నది.

 ఉల్లి ఘాటు

మహారాష్ట్రలో తరిగిపోయిన ఉల్లి నిల్వలు

పెరుగుతున్న ధరలు

తాడేపల్లిగూడెం, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): మార్కెట్లో ఉల్లి ధరలు మండుతున్నాయి. గత వారం కొద్దిగా పెరిగిన ఉల్లి ఈ వారం మరింత పెరిగి వినియోగదారులను కలవరపె డుతున్నది. రిటైల్డ్‌గా ఉల్లి కిలో రూ.35కు విక్రయిస్తున్నారు. హోల్‌సేల్‌గానే క్వింటా ఉల్లి రూ.2000 నుంచి 2800 వరకు అమ్మకాలు జరిగాయి. గత కొద్ది నెలలుగా ఉల్లి ధర మందకొడిగానే ఉంది. అయితే మహారాష్ట్రలో ఉన్న ఉల్లి నిల్వలు నిండుకున్నాయి. ఇప్పుడు అక్కడ కోల్డ్‌స్టోరేజ్‌లో ఉన్న ఉల్లిని తీసుకొ స్తున్నారు. దీనికి తోడు డీజిల్‌ ధరలు కూడా పెరిగాయి. మహారాష్ట్రలో ఉల్లిని తీసుకొచ్చిన లారీల్లో తిరుగు కిరాయిల్లో మామిడిని తీసుకె ళ్లేవారు. అయితే ప్రస్తుతం మామిడి సీజన్‌ దాదాపు ముంగింపు దశకు చేరింది. దీంతో కిరాయిలు అధికంగా కావడం ఉల్లిధరలు పెర గడానికి ఒక కారణంగా చెబుతున్నారు. ఉల్లి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. కొత్త ఉల్లి వచ్చే వరకు ధరలు తగ్గే అవకాశాలు లేవంటు న్నారు. జిల్లా వ్యాప్తంగా మార్కెట్‌కు ఉల్లిరావ డం తగ్గింది. మహారాష్ట్రలో కోల్డ్‌స్టోరేజ్‌లో నిల్వ చేసిన ఉల్లిని మాత్రమే తీసుకొస్తుం డటంతో ధరలు పెరిగాయి.

చుక్కల్లో చికెన్‌ ధర

చికెన్‌ ధరలు ఆకాన్నంటే విధంగా పెరుగుతున్నాయి. ఆదివారం మార్కెట్లో చికెన్‌ స్కిన్‌లెస్‌ కిలో రూ.300కు పెరిగింది. విత్‌స్కిన్‌ ధర కిలో రూ.280, బర్డ్‌ కిలో రూ.160కు విక్రయించారు. రైతుల వద్ద కోళ్లు లేవు. దీంతో ఇక కార్పొరేట్‌ సంస్థలు కోళ్లను మార్కెట్‌కు తీసుకొస్తున్నారు. మార్కెట్‌లో ధరలను శాసించేది కార్పొరేట్‌ సంస్థలు కావడంతో చికెన్‌ ధరలకు రెక్కలొచ్చాయి. వాతావరణం సరిగా అనుకూలించకపోవ డంతో రైతులు కోళ్లను పెంచేందుకు సాహసి ంచడంలేదు. దీంతో ఇప్పుడు మార్కెట్లో కోళ్లకు మంచి డిమాండ్‌ వచ్చింది. కార్పొరేట్‌ సంస్థలు తీసుకొచ్చిన కోళ్లకు కాసులు కురు స్తున్నాయి. వీటి ధరలు రానున్న రోజులో మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారు లు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా చికెన్‌ వినియోగం ఒక్క ఆదివారమే 35 టన్నులు గా ఉంటుందని అంచనా వేస్తున్నారు. మట న్‌ 8 నుంచి 10 టన్నులు వినియోగం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇతర రోజుల్లో చికెన్‌ రోజుకు 25 టన్నులు వరకు వినియో గం జరుగుతుందని గణాంకాలు చెబుతున్నా యి. ఇతర రోజుల్లో మటన్‌ సగటున 5 నుంచి 6 టన్నుల వరకు వినియోగిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా చికెన్‌ వినియోగం అధికంగా ఉంది. మటన్‌ కిలో రూ.1000 నుంచి రూ. 1200కు విక్రయిస్తున్నారు. దీంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే చికెన్‌ కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. ఇప్పుడు చికెన్‌ ధరలకు రెక్కలు రావడంతో కిలోలు కొనేవారు అరకిలోకే పరిమితమవుతు న్నారు. ఈ సంవత్సరంలోనే అత్యధికంగా కిలో రూ.380కు చేరింది. అత్యల్పంగా రూ.220 నిలిచింది. గత వారం స్కిన్‌లెస్‌ కిలో రూ.280, విత్‌ స్కిన్‌ కిలో రూ.260, బర్డ్‌ కిలో రూ.150 విక్రియించారు. ఇప్పడు మళ్లీ ఒక వారంలోనే కిలోకు ఏకంగా రూ.20 పెర గడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఆందోళన చెందుతున్నారు

Updated Date - Jun 29 , 2026 | 12:24 AM