భర్తే హంతకుడు
ABN , Publish Date - Aug 25 , 2026 | 12:24 AM
మందపాడు రోడ్డులో ఉప్పుటే రు గట్టుపక్కన ఈ నెల 15న లభ్యమైన గుర్తు తెలియని మహిళ మృతదేహం కేసులో మిస్టరీ వీడింది.
భార్యా భర్తల మధ్య గొడవలే కారణం : ఏఎస్పీ విశ్వనాథ్
ఆకివీడులో గుర్తు తెలియని మహిళ మృతి కేసులో వీడిన మిస్టరీ
ఆకివీడు రూరల్/ఆకివీడు, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): మందపాడు రోడ్డులో ఉప్పుటే రు గట్టుపక్కన ఈ నెల 15న లభ్యమైన గుర్తు తెలియని మహిళ మృతదేహం కేసులో మిస్టరీ వీడింది. భర్త ఉప్పాడ నారాయణరావే హంతకుడని నిర్ధారించి పోలీసులు అతనిని అరెస్టు చేశారు. ఆకివీడు సీఐ కార్యాలయంలో సోమవారం ఏఎస్‌పీ విశ్వనాఽథ్ విలేకర్ల సమా వేశంలో వివరాలు తెలిపారు. చేపల వ్యాపా రంలో అప్పుల పాలైన తన భర్త నారాయణ రావును భార్య దేవి తరచూ అవమానించేది. అతని కుటుంబ సభ్యులను అసభ్యకరంగా మాట్లాడేది. తనను దూరం పెట్టడంతో కోపం తో గొంతు నులిమి చంపినట్లు నిందితుడు తెలిపాడు. మృతదేహాన్ని తన నివాసమైన భీమవరం వంశీకృష్ణనగర్ నుంచి కారులో మందపాడు రోడ్డులోని ఉప్పుటేరు గట్టుప క్కన పొదల్లో పడవేశాడు. ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఆదేశాల మేరకు ఆరు పోలీసు బృందాలు విచారణ చేసి నిందితుడిని పట్టు కున్నామన్నారు.
నిందితుడిని పట్టించిన స్ర్కూ
పోస్టుమార్టంలో మహిళ కాలిభాగంలో లభించిన ఇంప్లాంట్స్‌లోని స్ర్కూ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. స్ర్కూపై ఉన్న నంబరు ఆధారంగా దీనిని తయారు చేసిన దాల్వి అండ్ సన్స్ కంపెనీ ద్వారా హైదరాబాద్ సుశీల హాస్పటల్‌తో మాట్లాడి వివరాలు సేకరించారు. 2023లో ఉప్పాడ దేవికి శస్త్ర చికిత్స చేసినట్లు తెలియజేయడంతో మృతురాలిని గుర్తించారు. ఎనిమిది రోజుల్లో కేసును చేధించడంలో కీలకపాత్ర పోషించిన డీఎస్పీ రఘువీర్‌విష్ణు, సీఐ కాళీచరణ్, ఎస్‌ఐలు శుభశేఖర్, గణేష్ కుమార్, మల్లికార్జునరావు, పోలీసు సిబ్బం దిని ఎస్పీ అభినందించారు. నారాయణ రావుకు సోమవారం సీహెచ్‌సీ ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు చేశారు.