Share News

వృద్ధుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన జాతీయ విధానాన్ని అమలుపర్చాలి

ABN , Publish Date - Jul 01 , 2026 | 12:26 AM

వృద్ధుల సంక్షేమం, రక్షణ, సౌక ర్యాలు, ఆర్థిక ఆదరణకు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన జాతీయ విధానాన్ని అమలు పర్చాలని ఏపీ సీనియర్‌ సిటిజన్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు వెంపరాల నారాయణమూర్తి, నూతన అధ్యక్షుడు కుకు నూరు రామచంద్రరావు డిమాండ్‌ చేశారు.

వృద్ధుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన  జాతీయ విధానాన్ని అమలుపర్చాలి
అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు సత్కారం

ద్వారకాతిరుమల/తణుకు, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): వృద్ధుల సంక్షేమం, రక్షణ, సౌక ర్యాలు, ఆర్థిక ఆదరణకు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన జాతీయ విధానాన్ని అమలు పర్చాలని ఏపీ సీనియర్‌ సిటిజన్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు వెంపరాల నారాయణమూర్తి, నూతన అధ్యక్షుడు కుకు నూరు రామచంద్రరావు డిమాండ్‌ చేశారు. ద్వారకాతిరుమల వేంకటేశ్వర బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రంలో రాష్ట్ర సంఘ సమావేశం మంగళవారం నిర్వహించారు. అనంతరం 2026–29 సంవత్సరపు రాష్ట్ర సంఘానికి ఏకగ్రీవంగా ఎన్నికైన కార్యవర్గాన్ని ఎన్నికల అధికారి వైవీఎస్‌ మూర్తి, సహాయ ఎన్నికల అధికారి వి.రామ్మోహనరావు ప్రకటించారు. రాష్ట్ర అఽధ్యక్షుడిగా కుకునూరు రామ చంద్రరావు, గౌరవాధ్యక్షులుగా వెంపరాల నారాయణమూర్తి, వీకే వీరారావు, సీనియర్‌ సిటిజన్స్‌ వెల్ఫేర్‌ అసోసియేట్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా తణుకు సంఘ అధ్యక్షుడు అల్లూరి కరుణాకర్‌, ఉపాధ్యక్షుడిగా కె.చిట్టివెంకయ్య, ఆర్గనైజింగ్‌ కార్యదర్శిగా బోనం పాండురంగారావులతో జాతీయ కార్యనిర్వాహక కార్యదర్శి రామ చంద్రయ్య ప్రమాణ స్వీకారం చేయించారు. సమావేశంలో వెంపరాల మాట్లా డుతూ తల్లిదండ్రులు, వృద్ధుల పోషణ, సంరక్షణచట్టం, 2007 అనుసరించి ట్రిబ్యునల్స్‌ సకాలంలో తీర్పులనిచ్చి వెంటనే అమలుపర్చాలని కోరారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన 250 మంది వరకు స్టేట్‌ కౌన్సిల్‌ మెంబర్లు హాజర య్యారు. అన్ని జిల్లాల నుంచి మహిళా సభ్యులను ఎన్నుకున్నారు. అర్జి భాస్కరరావు, పాతూరి శివన్నారాయణ ఉన్నారు.

Updated Date - Jul 01 , 2026 | 12:26 AM