ధరహాసం..!
ABN , Publish Date - Sep 03 , 2026 | 01:03 AM
పామా యిల్ ధరలో రెండు నెలలపాటు తగ్గుదల కని పించగా ఈసారి కాస్త పెరుగుదల కనిపించడం తో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పుంజుకున్న పామాయిల్ గెలల ధర
ఆగస్టులో టన్ను ధర రూ.24,010
గతంతో పోల్చితే టన్నుకు రూ.527 పెరుగుదల
పెదవేగి, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): పామా యిల్ ధరలో రెండు నెలలపాటు తగ్గుదల కని పించగా ఈసారి కాస్త పెరుగుదల కనిపించడం తో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జనవరి లో టన్ను రూ20,680లుగా ఉన్న పామాయిల్ గెలల ధర వరుసగా పెరుగుతూ మే నాటికి రూ.23,860 లకు చేరింది. అక్కడ నుంచి జూన్ లో రూ.90, జూలైలో రూ.287 తగ్గింది. మొత్తం గా రెండు నెలల్లో టన్నుకు రూ.377 తగ్గడంతో రైతులు నిరాశ చెందారు. కాగా ఆగస్టు ధరలో భారీగా పెరుగదల కనిపించింది. టన్నుకు రూ.527 పెరగడంతో ధర రూ.24,010 లకు చేరడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వరుసగా రెండు నెలలు తగ్గిన ధరతో కలిగిన నష్టాన్ని ఈ ధర పూడ్చుతుందని పేర్కొంటున్నా రు. పామాయిల్ గెలల ధరను అంతర్జాతీయ ధరల సూచిక, నూనె విక్రయాలను అనుసరించి ప్రతినెల తొలివారంలో ప్రకటిస్తారు. గడచిన నెలకు సంబంధించిన ధరను మరుసటి నెలలో చెల్లిస్తారు. ఈ క్రమంలో ఆగస్టు ధర ఈ నెలలో ప్రకటించారు. దీని ప్రకారం ఆగస్టులో పామా యిల్ గెలల ధర టన్ను రూ.24,010లుగా ప్రకటించారు.
జిల్లాలో సాగు విస్తీర్ణం
జిల్లాలో సుమారు 45 వేల మంది రైతులు 1.60 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చే స్తుండగా ప్రస్తుతం 95 వేల ఎకరాల్లో దిగుబడి వస్తోంది. గత మూడేళ్లలో 65 వేల ఎకరాల్లో సాగు విస్తీర్ణం పెరిగిందని జిల్లా ఉద్యానశాఖా ధికారి కె.షాజానాయక్ తెలిపారు. ఆయిల్‌పామ్ సాగు ప్రోత్సాహానికి ప్రభుత్వం పలు పథకా లను అమలు చేస్తోందని, ఆయిల్‌పామ్ మొక్క లు, ఎరువులు, మూడేళ్ల నిర్వహణకు హెక్టారు కు రూ.70 వేలు అందిస్తుందన్నారు. చాప్ కట్టర్లు, మినీ ట్రాక్టర్లు, ట్రాలీలు రాయితీపై అందిస్తోందని, ఎకరానికి 10 నుంచి 12 టన్ను లు దిగుబడి వస్తోందన్నారు. ఆయిల్‌పామ్ సాగులో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండగా, రాష్ట్రంలో ఏలూరు జిల్లా అగ్రస్థానంలో ఉందన్నారు. ధర తగ్గుదలతో గతంలో కొంతమంది రైతులు తోటలను తొల గించారు. ప్రస్తుతం ధర రూ.24 వేల మార్కు ను దాటడం ఆయిల్‌పామ్ సాగు భవిష్యత్‌లో ఆశాజనంగా ఉంటుందని ఆయిల్‌పామ్ డివిజన ల్ అధికారి గోసుల జగదీశ్వర్‌రెడ్డి తెలిపారు.