Share News

ఆయిల్‌పాం గెలల గ్రేడింగ్‌ విధానాన్ని మానకుంటే ఉద్యమిస్తాం

ABN , Publish Date - Jul 11 , 2026 | 12:18 AM

రైతులు శ్రమించి నాణ్యమైన పంటలను పండించి, అమ్మకానికి ఫ్యాక్టరీలకు తీసుకెళ్తే గెలలను గ్రేడింగ్‌లు చేసి రైతులకు తీరని అన్యాయం చేస్తున్నారని ఆయిల్‌పాం రైతులు గోద్రేజ్‌ పామాయిల్‌ ఫ్యాక్టరీ ప్రతినిఽధులను నిలదీశారు.

ఆయిల్‌పాం గెలల గ్రేడింగ్‌ విధానాన్ని మానకుంటే ఉద్యమిస్తాం
తిమ్మాపురం సమావేశంలో మాట్లాడుతున్న ఫాక్టరీ ప్రతినిధి

ద్వారకాతిరుమల, జూలై 10 (ఆంధ్రజ్యోతి): రైతులు శ్రమించి నాణ్యమైన పంటలను పండించి, అమ్మకానికి ఫ్యాక్టరీలకు తీసుకెళ్తే గెలలను గ్రేడింగ్‌లు చేసి రైతులకు తీరని అన్యాయం చేస్తున్నారని ఆయిల్‌పాం రైతులు గోద్రేజ్‌ పామాయిల్‌ ఫ్యాక్టరీ ప్రతినిఽధులను నిలదీశారు. తిమ్మాపురంలో శుక్రవారం పామాయిల్‌ రైతు సంఘం ఆధ్వర్యంలో గోద్రేజ్‌ పామాయిల్‌ ఫాక్టరీ పరిధిలోని రైతులతో ఫ్యాక్టరీ అధికారులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రైతులు తమకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. ఆయిల్‌పాం గెలల గ్రేడింగ్‌ విధానాన్ని పూర్తిగా విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఒకవేళ గ్రేడింగ్‌ చేయాల్సి వస్తే గెలలు చెట్టుమీద ఉండగానే చేయాలని చెట్టునుంచి కిందకు దిగిన ప్రతీ గెలను ఫ్యాక్టరీ కొనుగోలు చేయాల్సిందే అని డిమాండ్‌ చేశారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఫాక్టరీ వారు కోర్టులను ఆశ్రయించడం వల్ల ఫ్యాక్టరీకి రైతుకు మధ్య సయోధ్య ఉండదని దీన్ని విరమించుకుని రైతుకు మేలు చేసే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. ఫాక్టరీ ప్రతినిది నవనీత్‌ మాట్లాడుతూ రైతుకు తమకు చెప్పిన ప్రతీ సమస్యను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ద్వారకాతిరుమల దేవస్థానం ట్రస్టు బోర్డు సభ్యుడు చింతమనేని హనుమం తరావు, సొసైటీ చైర్మన్లు పోలిన శ్రీనివాసరావు, మాసిరెడ్డి హరిబాబు, అక్కిశెట్టి సుదాకర్‌, రైతు ఘంటా శ్రీనివాసరావు, పావులూరి మధు పాల్గొన్నారు.

Updated Date - Jul 11 , 2026 | 12:18 AM