Share News

హాస్టల్‌ రెడీ

ABN , Publish Date - Jun 14 , 2026 | 11:47 PM

జిల్లాలో నూనత విద్యా సంవత్సరానికి సంక్షేమ వసతి గృహాలు సిద్ధంగా ఉన్నాయి.

హాస్టల్‌ రెడీ

ప్రవేశాలు పెంచే ప్రయత్నంలో సంక్షేమ అధికారులు

వసతులు మెరుగ్గా ఉన్నా.. పలు చోట్ల వార్డెన్ల కొరత

పెరగని డైట్‌ చార్జీలు

విద్యార్థులు, తల్లిదండ్రులు విముఖం

ఏలూరు రూరల్‌, జూన్‌ 14(ఆంధ్రజ్యోతి) : జిల్లాలో నూనత విద్యా సంవత్సరానికి సంక్షేమ వసతి గృహాలు సిద్ధంగా ఉన్నాయి. విద్యార్థుల ప్రవేశాలకు అధికారులు సన్నాహాలు చేస్తున్నా రు. గతంలో పోల్చితే సంక్షేమ వసతి గృహాల్లో తగినంత మంది విద్యార్థులు లేకపోవడంతో సంక్షేమ శాఖ అధికారులు గ్రామాలకు వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తు న్నారు. దీంతో ఈ ఏడాది వసతి గృహాల్లో విద్యార్థుల ప్రవేశాలు పెరిగే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం సంక్షేమ వసతి గృహాలపై దృష్టి పెట్టింది. వాటిని గాడిలో పెట్టే ప్రయత్నం చేసింది. వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లపాటు పెండింగ్‌లో ఉంచిన కాస్మెటిక్‌ చార్జీలను సైతం చెల్లించింది. కానీ వార్డెన్లు తగినంత మంది లేరు. కొందరు, డిప్యూటేషన్లపై ఇన్‌చార్జిలుగా మరి కొందరు పనిచేస్తున్నారు. పర్యవేక్షణ అంతగా లేదన్న విమర్శలు ఉన్నాయి.

జిల్లాలో 53 వసతి గృహాలు

జిల్లాలో 53 వరకూ ప్రభుత్వ వసతి గృహాలు ఉన్నాయి. దాదాపు 3,600 మంది విద్యార్థులు ఉంటున్నారు. కానీ వార్డెన్లు 47 మంది ఉన్నారు. ప్రతి హాస్టల్‌లో వార్డెన్‌, డిప్యూటీ వార్డెన్‌, కుక్‌, సహాయకులు, నైట్‌ వాచ్‌మెన్‌ ఉండాలి. దగ్గరలో ఉన్న పీహెచ్‌సీ ఏఎన్‌ఎంలు, విద్యార్థులకు వైద్య పరీక్షలు చేస్తుండాలి. ఇదే సమయంలో కిందిస్థాయి సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. గత 20 ఏళ్లుగా వార్డెన్‌ నియామకాలు చేపట్టలేదు.

పాత ధరలతో భోజనం

వసతి గృహ విద్యార్థుల డైట్‌ చార్జీలను వైసీ పీ ప్రభుత్వం పట్టించుకోలేదు. టీడీపీ ప్రభుత్వ హయాంలో 2018లో చివరిసారిగా మెస్‌ చార్జీల ను పెంచింది. అప్పట్లో నిత్యావసరాల ధరలకు అనుగుణంగా ఉండడంతో, విద్యార్థులకు మెనూ ప్రకారం సరైన ఆహారం అందేది. కరోనా తరు వాత నిత్యావసరాల ధరలు వంద నుంచి 150 శాతం వరకూ పెరిగాయి. ప్రభుత్వం చెల్లించే ధర, మార్కెట్‌ ధరకు భారీ వ్యత్యాసంతో ఆ ప్రభావం ఆహార నాణ్యతపై పడుతోంది.

కాస్మెటిక్‌ చార్జీల చెల్లింపు

వైసీపీ హయాంలో మూడు నుంచి పదో తరగతి వరకూ ప్రీ మెట్రిక్‌ హాస్టల్‌ విద్యా ర్థుల కు రూ.1.50 కోట్లు పెండింగ్‌ పెట్టింది. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత క్రమేపీ ఆ నిధులను విద్యార్థుల ఖాతాలో జమ చేసింది.

మెరుగైన వసతులు

సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో వసతులు మెరుగు పరిచాం. ప్రస్తుతం విద్యార్థుల ప్రవేశాల కోసం అధికారులు తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. ఈఏడాది అనుకున్న లక్ష్యం మేరకు ప్రవేశాలు ఉంటాయి.

– విశ్వమోహన్‌రెడ్డి, సోషల్‌ వెల్ఫేర్‌ జిల్లా అధికారి, ఏలూరు

Updated Date - Jun 14 , 2026 | 11:47 PM