ఓబన్న కీర్తి అజరామరం
ABN , Publish Date - Mar 23 , 2026 | 12:39 AM
బ్రిటీష్ వారికి ఎదురొడ్డి పోరాడిన వడ్డే ఓబన్న గొప్ప పోరాట వీరుడని వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ మంత్రి సవిత, రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాలశాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు.
నూజివీడు, మార్చి 22(ఆంధ్రజ్యోతి): బ్రిటీష్ వారికి ఎదురొడ్డి పోరాడిన వడ్డే ఓబన్న గొప్ప పోరాట వీరుడని వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ మంత్రి సవిత, రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాలశాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. నూజివీడులో ఆదివారం ఓబన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చరిత్రకారులు బీసీల త్యాగాలను చరిత్రలో పొందుపరచకుండా కనుమరుగు చేశారన్నారు. వడ్డే ఓబన్న, గౌతు లచ్చన్న జయంతులను అధికారికంగా నిర్వహించింది కూటమి ప్రభుత్వమే అన్నారు. తెలుగుదేశం పార్టీని ప్రారంభించి ఎన్టీఆర్ బీసీలను రాజకీయంగా ప్రోత్సహించాలన్నారు. అదేబాటలో సీఎం చంద్రబాబు నాయుడు బీసీల రక్షణకు ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చి అమలు చేసే ప్రయ త్నంలో ఉన్నారన్నారు. బీసీల అభివృద్ధి తెలుగుదేశంతోనే సాధ్యమన్నారు. రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లెల ఈశ్వరరావు గౌడ కార్పొరేషన్ వీరంకి గురుమూర్తి, రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ మల్లెల ఈశ్వరరావు, గౌడ కార్పొరేషన్ ఛైర్మన్ వీరంకి గురుమూర్తి, రాష్ట్ర వడ్డెర సంఘ కార్యదర్శి బండారు సత్యనారా యణ, విగ్రహ నిర్మాణ కమిటీ సభ్యులు చల్ల వెంకటేశ్వరరావు, అచ్చి కాసులు, డేరంగుల పోతురాజు, చల్ల మహేష్, తదితరులు పాల్గొన్నారు.