Share News

నూజివీడు స్మార్ట్‌సిటీ

ABN , Publish Date - Oct 03 , 2026 | 12:43 AM

నూజివీడు పట్టణాన్ని స్మార్ట్‌ సిటీగా మార్చేందుకు కృషి చేస్తున్నట్టు పలుమార్లు స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కొలుసు పార్థసారథి ప్రకటించారు. ఒక మున్సిపాలిటీని స్మార్ట్‌ సిటీగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం నిర్దిష్ట నిబంధ నలు విధిం చింది.

నూజివీడు స్మార్ట్‌సిటీ

నిబంధనల మేరకు కలిసొచ్చే అన్ని అంశాలు

విద్యా హబ్‌గా గుర్తింపు

మామిడి పరిశ్రమకు కేరాఫ్‌ అడ్రస్‌

మెరుగైన ప్రజా రవాణా సౌకర్యాలు

పర్యాటక ప్రాంతాలకూ కొదువ లేదు

ఇచ్చిన హామీ మేరకు మంత్రి సారథి కృషి

ఇప్పటికే రోడ్డు విస్తరణ.. సెంట్రల్‌ లైటింగ్‌

నూజివీడు పట్టణాన్ని స్మార్ట్‌ సిటీగా మార్చేందుకు కృషి చేస్తున్నట్టు పలుమార్లు స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కొలుసు పార్థసారథి ప్రకటించారు. ఒక మున్సిపాలిటీని స్మార్ట్‌ సిటీగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం నిర్దిష్ట నిబంధ నలు విధిం చింది. భౌతిక, సామాజిక, ఆర్థిక, సంస్థాగత, మౌలిక సదుపాయాలు బలంగా ఉండాలి. ఈ క్రమంలో తాను ఇచ్చిన హామీని నెర వేర్చడానికి మంత్రి ఇప్పటికే పట్టణం లో రహదారి విస్తర ణ, సెంట్రల్‌ లైటింగ్‌ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

– నూజివీడు – ఆంధ్రజ్యోతి

జిల్లాలో చారిత్రక విద్యా కేంద్రంగా ఉన్న నూజివీడు మున్సిపాలిటీ స్మార్ట్‌ సిటీగా తీర్చి దిద్దడానికి కావాల్సిన అవకాశాలు ఉన్నాయి. పట్టణ సుందరీకరణకు, ఆధునికంగా మార్చ డానికి ప్రభుత్వం, స్థానిక పురపాలక యంత్రాం గం, మంత్రి పార్థసారఽథి వివిధ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. స్మార్ట్‌ సిటీగా మార్చడానికి ఉన్న ప్రధాన అవకాశాలివి...

విద్యాహబ్‌గా గుర్తింపు

నూజివీడులో ఆర్జీయూకేటీ ఆధ్వర్యంలో 2008లో ట్రిబుల్‌ ఐటీ క్యాంపస్‌ను ప్రభుత్వం ప్రారంభించింది. ఇక్కడ వేలమంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ప్లాంటేషన్‌ మేనేజ్‌ మెంట్‌ విద్య కోసం కేంద్ర ప్రభుత్వ సంస్థ అయి న ఐఐపీఎం (ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాంటేషన్‌ మేనేజ్‌మెంట్‌) ఏర్పాటుకు ప్రభు త్వం ఇప్పటికే భూమిని కేటాయించింది. నూజి వీడులో పీజీ సెంటర్‌తో పాటు పలు డిగ్రీ, పాలి టెక్నిక్‌, మేనేజ్‌మెంట్‌ కోర్సు కళాశాలలు ఉన్నా యి. ఈనేపథ్యంలో ఈ విద్యా సంస్థలను అను సంధానిస్తూ పట్టణాన్ని డిజిటల్‌ లెర్నింగ్‌, పబ్లిక్‌ వైఫై జోన్లు, విద్యార్థుల వసతులకు అను వైన స్మార్ట్‌ స్టూడెంట్‌ సిటీగా అభివృద్ధి చేయవచ్చు.

భౌగోళిక అనుకూలత.. కనెక్టివిటీ

విజయవాడ, ఏలూరు నగరాలకు నూజివీడు అతి సమీపంలో ఉంది. పట్టణంలో రద్దీని తగ్గించేందుకు బైపాస్‌ రోడ్డు ఉంది. ఇప్పటికే పట్టణం మీదుగా జాతీయ రహదారి 216 వెళుతుండగా, పట్టణానికి 20 కిలోమీటర్ల దూరంలో ఎన్‌హెచ్‌–16 వెళుతోంది. ఇవికాక తాజాగా ఒడిశా నుంచి నూజివీడు మీదుగా విజయవాడ గొల్లపూడి వద్ద ఉన్న జాతీయ రహదారి కలుపుతూ హైస్పీడ్‌ ఎక్స్‌ప్రెస్‌ జాతీయ రహదారిని నిర్మించనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ జాతీయ ఎక్స్‌ప్రెస్‌ రహదారి నూజివీడు నియోజకవర్గంలో నూజివీడు, తుక్కులూరు, బోర్వాంచ, రావిచెర్ల, వడ్లమాను, ఆగిరిపల్లి, నూగుండపల్లి, బొద్దనపల్లి, గ్రామాల మీదుగా ఎన్టీఆర్‌ జిల్లాలోకి ప్రవేశిస్తుంది. ఈ కనెక్టివిటీని వాడుకొని మెరుగైన ప్రజా రవాణా, రహదారి విస్తరణ ద్వారా స్మార్ట్‌ మొబిలిటీని ప్రవేశపెట్టవచ్చు. పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడానికి మున్సిపాలిటీ శానిటరీ డ్రైన్‌లను నిర్వహిస్తోంది.

పర్యాటక రంగంగా అభివృద్ధి

నూజివీడు ప్రాంతాన్ని పర్యాటక రంగంగా అభివృద్ధి చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఆగిరిపల్లి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రానికి కొండపైకి రహదారి నిర్మాణం పూర్తి కావొచ్చింది. ఈ క్షేత్రానికి కూతవేటు దూరంలో ఉన్న బ్రహ్మలింగయ్య పేరుతో ఉన్న భారీ చెరువును బోటింగ్‌ కేంద్రంగా మలచడానికి 2014లోనే నాటి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. దానిని అమలుపరచవచ్చు. నూజివీడుకి సమీపంలోని గొల్లపల్లిలోని మరో భద్రాద్రిగా పేరుగాంచిన సీతారామ క్షేత్రాన్ని పర్యాటక రంగంగా అభివృద్ధి చేయవచ్చు. నూజివీడు పట్టణంలో కోట భాగాలను పరిరక్షిస్తూ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయవచ్చు. నూజివీడు ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ అటవీశాఖ భూములు, విద్యా సంస్ధలు, వ్యవసాయ వనరులు, నూజివీడును స్మార్ట్‌ సిటీగా మార్చడానికి పునాదులుగా ఉపయోగపడతాయి. భవిష్యత్‌లో రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక పట్టణాభివృద్ధి పథకాల ద్వారా నిధులు సమకూరితే నూజివీడు స్మార్ట్‌సిటీగా ఎదగడం సులభమవుతుంది.

Updated Date - Oct 03 , 2026 | 12:43 AM