Share News

ఎన్టీఆర్‌ బేబీ కిట్లు పునరుద్ధరణ

ABN , Publish Date - Sep 27 , 2026 | 12:41 AM

ప్రభుత్వాసుప త్రుల్లో ప్రసవించే మహిళలకు గతంలో అందించిన ఎన్టీఆర్‌ బేబీ కిట్ల పథకాన్ని కూటమి ప్రభుత్వం మళ్లీ అమల్లోకి తీసుకొచ్చింది. కొంతకాలంగా నిలిచిపోయిన ఈ పథకానికి ప్రభుత్వం తాజాగా నిధులు కేటాయిం చడంతో, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించే తల్లులకు పుట్టిన శిశువులకు ఉచితంగా కిట్లు అందనున్నాయి.

ఎన్టీఆర్‌ బేబీ కిట్లు పునరుద్ధరణ

ప్రభుత్వ ఆసుపత్రుత్లో ప్రసవ మహిళలకు ఊరట

తణుకు, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి):ప్రభుత్వాసుప త్రుల్లో ప్రసవించే మహిళలకు గతంలో అందించిన ఎన్టీఆర్‌ బేబీ కిట్ల పథకాన్ని కూటమి ప్రభుత్వం మళ్లీ అమల్లోకి తీసుకొచ్చింది. కొంతకాలంగా నిలిచిపోయిన ఈ పథకానికి ప్రభుత్వం తాజాగా నిధులు కేటాయిం చడంతో, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించే తల్లులకు పుట్టిన శిశువులకు ఉచితంగా కిట్లు అందనున్నాయి. మాతా, శిశు సంరక్షణతోపాటు నవజాత శిశువులకు తొలి రోజుల్లో అవసరమైన అన్ని వస్తువులను అందు బాటులో ఉంచడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. ఈ పథకం ద్వారా జిల్లాలో నెలకు సుమారు 800 మంది ప్రసవ మహిళలు ప్రయోజనం పొందే అవకాశం ఉం ది. జిల్లావ్యాప్తంగా జిల్లా ఆసుపత్రి, ఏరియా ఆసుప త్రులు, సీహెచ్‌సీలు, పీహెచ్‌సీలు కలిపి 42 వరకు ఉన్నాయి. వాటిలో తణుకులోని జిల్లా ఆసుపత్రి, తాడే పల్లిగూడెం, పాలకొల్లు, నరసాపురం, భీమవరంలలోని ఏరియా ఆసుపత్రులు, ఆచంట, ఆకివీడు, పెనుగొం డలలోని ప్రైమరీ హెల్త్‌ సెంటర్లు ఉన్నాయి. ఇవి కాకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 34 వరకు ఉన్నాయి. ఒక్కో కిట్‌ విలువ సుమారు రూ.1,400. దీని కోసం ప్రభుత్వం ఏటా రూ.51.15 కోట్లు కేటాయిస్తోంది.

కిట్‌లో 14 రకాల వస్తువులు

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలకు ప్రోత్సహించడం, ప్రసవ కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గించడం ద్వారా నవజాత శిశువులకు తొలి రోజుల్లో అవసరమయ్యే వస్తువులను ఒకేసారి కిట్‌ రూపంలో దీనిని అందిస్తున్నారు. బేబీ కిట్‌లో దోమ తెరతోపాటు బేబీ బెడ్‌, వాటర్‌ప్రూఫ్‌ మాకింటోష్‌, శిశువుల దుస్తులు, తువ్వాలు, మూడు బేబీ నేప్కిన్లు, 200 గ్రాముల బేబీ పౌడర్‌, 100 మి.లీ. బేబీ షాంపూ, 200 మి.లీ. ఆయిల్‌, సబ్బు, సబ్బు పెట్టె, గిలగిల బొమ్మ, కిట్‌ బ్యాగ్‌ తదితర వస్తువులు ఉంటాయి. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఈ కిట్లు ఉపయోగకరంగా ఉండనున్నాయి.

నేడు బ్యాంకులు పనిచేస్తాయి

‘సమస్యల పరిష్కారం కోసం న్యాయమైన పోరాటం చేస్తున్నాం. ఇది కేవలం సెలవుల కోసం చేసే పోరాటం కాదు. ఇచ్చిన హామీని అమలు చేయమని చేస్తున్న సమ్మె. సమ్మె కాలంలో జీతాలు కూడా తీసుకోం. 2024లో మార్చి 8న జరిగిన 12వ ద్వైపాక్షిక ఒప్పంద ంలో ఐదు రోజుల విధానానికి అధికారిక ఆమోదం, సంతకాలు జరిగాయి. నెలలు తరబడి నిర్లక్ష్యం తర్వాత అధికారికంగా సమ్మె ప్రకటన చేశాం. హామీలు నెరవేరే వరకు ఆందోళన కొనసాగిస్తాం’ అని అన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో మూడు రోజుల పాటు బ్యాంకింగ్‌ లావాదేవీలు నిలిచిపోతే రూ.1500 కోట్ల మేర లావాదేవీలపై ప్రభా వం పడే అవకాశం ఉంది. యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ (యూఎఫ్‌బీ యూ) ఆధ్వర్యంలో చేపట్టనున్న ఈ సమ్మెలో ప్రభుత్వ రంగ బ్యాంకులతోపాటు పలు ప్రైవేట్‌ బ్యాంకుల ఉద్యోగులు, అధికారులు పాల్గొననున్నారు.

ఆర్‌బీఐ ఆదేశాల మేరకు..

బ్యాంకు ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో ఖాతాదారులకు ఇబ్బందులు తలెత్తకుండా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని బ్యాంకులు ఆదివారం పనిచేయనున్నాయి. అత్యవసర లావాదేవీలు, నగదు ఉపసంహరణ, జమలు వంటి బ్యాంకింగ్‌ కార్యకలాపాలను ఆదివారమే పూర్తి చేసుకోవాలని జిల్లా లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ ఎం.వి. జాన్‌ మార్టిన్‌ ఖాతాదారులకు సూచించారు. అత్యవసర అవసరాల కోసం ఏటీఎంలు, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌ తదితర డిజిటల్‌ సేవలను వినియోగించుకోవాలని సూచించారు.

Updated Date - Sep 27 , 2026 | 12:41 AM