నాట్య సమ్మోహనం
ABN , Publish Date - Jun 28 , 2026 | 12:03 AM
అందెల రవళితో ఏలూరు వైఎంహెచ్‌ఏ ప్రాంగణం పులకించింది..గజ్జెల సవ్వడికి లయ జతకలవగా తాళానికి తనువు ఊగింది.
రెండోరోజు నృత్యాంజలి కళానికేతన్ వార్షికోత్సవం
ఏలూరు రూరల్, జూన్ 27 (ఆంధ్రజ్యోతి) : అందెల రవళితో ఏలూరు వైఎంహెచ్‌ఏ ప్రాంగణం పులకించింది..గజ్జెల సవ్వడికి లయ జతకలవగా తాళానికి తనువు ఊగింది. అడుగడుగునా నాట్య సమ్మోహనం ఆవిష్కృ తమవుతూ సభా ప్రాంగణం కరతాళధ్వనులతో మార్మోగింది. తపన ఫౌండేషన్, సంస్కార భారతి, హిందూ యువజన సంఘం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నృత్యాంజలి కళానికేతన్ 33వ వార్షికోత్సవ వేడుకలు ఏలూరులోని వైఎంహెచ్‌ఏ ప్రాంగణంలో రెండోరోజు శనివారం వైభవంగా జరిగాయి. ప్రతి ప్రదర్శన కళాత్మక వైభవాన్ని ఆవిష్కరించింది. నాట్య రూపంలో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు కళ్లకు కట్టినట్లు ఆవిష్కృతమవడంతో ప్రేక్షకులు కరతాళధ్వనులతో కళాకారులను అభినం దించారు. లయబద్ధంగా నాట్యం చేస్తూ మైమరిపించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లా డుతూ భారతీయ నృత్య కళలు మన సంస్కృతి, సంప్రదాయాలకు జీవనాడిగా నిలుస్తాయన్నారు. చిన్నారుల్లో కళల పట్ల ఆసక్తిని పెంపొం దిస్తూ భారతీయ విలువలను భావితరాలకు చేరవేయడంలో ఇటువంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే ప్రతిభ కనబరిచిన కళాకారులను అభినందించి జ్ఞాపికలను అందజేశారు. నిర్వాహుకులను సత్కరించారు. కార్యక్రమంలో తపన ఫౌండేషన్, సంస్కార భారతి, హిందూ యువజన సంఘం, ప్రతినిధులు, కళాకారులు పాల్గొన్నారు. గండికోట రాజేష్ పర్యవేక్షించారు.