Share News

ఓటుకు రూ.4 వేలు!

ABN , Publish Date - Nov 01 , 2026 | 01:02 AM

పుర ఎన్నికల్లో గెలుపు కోసం అభ్య ర్థులు ఓటర్లకు తాయిలాలు ఎర వేస్తున్నారు. శనివారం పొద్దుపోయిన తర్వాత తాయిలాల పంపిణీ జోరం దుకుని అర్ధరాత్రి వరకు సాగుతూనే ఉంది.

ఓటుకు రూ.4 వేలు!

కనిష్ఠంగా రూ.500 పంపిణీ

చీరలు, కుక్కర్లు, ఎలక్ర్టికల్‌ వస్తువులు అందజేత

ఉమ్మడి పశ్చిమలో ఎడాపెడా నోట్లతో ఓట్ల కొనుగోలు

పురపోరులో పైచేయికి అభ్యర్థుల ఎత్తుకు పైఎత్తులు

నరసాపురం/ఏలూరు/జంగారెడ్డిగూడెం, అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి):

పుర ఎన్నికల్లో గెలుపు కోసం అభ్య ర్థులు ఓటర్లకు తాయిలాలు ఎర వేస్తున్నారు. శనివారం పొద్దుపోయిన తర్వాత తాయిలాల పంపిణీ జోరం దుకుని అర్ధరాత్రి వరకు సాగుతూనే ఉంది. నరసాపురం, నూజివీడు, జంగారెడ్డిగూడెం, ఏలూరు కార్పొ రేషన్‌ పరిధిలో ప్రధాన పార్టీల అభ్య ర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు సైతం తాయిలాల పంపిణీకి తెర తీశారు. ఓటకు కనిష్ఠంగా రూ.500 నుంచి ఒకచోట గరిష్ఠంగా రూ.4వేలు పంపిణీ చేశారు.

నరసాపురంలో కొన్ని వార్డుల్లో ఓటకు రూ.నాలుగు వేలు వరకు ఇచ్చారు. మరికొన్ని చోట్ల కుక్కర్లు, చీరలు, ఎలక్ర్టికల్‌ వస్తువుల్ని అందించారు. బిర్యానీ బ్యాకెట్లతో పాటు మద్యాన్ని ఇచ్చారు. ఇక్కడ కూడా ఓటుకు రూ.1500 నుంచి రూ.రెండు వేల వరకు ఇచ్చారు. ఇందులో చైర్‌పర్సన్‌, కౌన్సిలర్‌ సొమ్ములు కలిపి పంపిణీ చేశారు. ఒకటి, రెండు వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు కొందరు ఓటుకు రూ.2 నుంచి రూ.2,500 వరకు ఇచ్చారు. వీరిలో మాజీలే ఉన్నారు. మహిళ ఓటర్లను అకర్షించేందుకు చీరలు పం పిణీ చేశారు. పోలీసులు ఎంత నిఘా పెట్టినా.. గుట్టుచప్పుడు కాకుండా ఇళ్లకు వచ్చి పంపిణీ చేశారు. ఏలూరుతో పాటు, జంగారెడ్డిగూడెం, నూజి వీడుల్లో రూ.12 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకు తాయిలాల ఎర గత మూడు రోజుల నుంచి సాగింది. జంగారెడ్డిగూడెంలో శనివారం భారీగా అభ్యర్థుల పంపకాల్లో ముని గారు. పోలింగ్‌ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుండటంతో శనివారం ఆచితూచి ప్రధాన పార్టీల అభ్యర్థుల పంపిణీలు చేస్తూ ఓటర్లను తమవైపు తిప్పుకునే పనిలో పడ్డారు. ఏలూరులో ఓ అభ్యర్థి పోటీలో ఉన్న అభ్య ర్థులకు సొమ్ములు అందించి ఓటర్ల వైపు చూడనట్టు తెలిసింది. నగరంలో చాలా చోట్ల ఓటరు స్లిప్పులను సరిచూసుకుని రూ.500 పంపిణీ చేస్తున్నారు. ఒక స్వత్రంత్ర అభ్యర్థి ఓటుకు రూ.1500 ఇచ్చినట్టు సమాచారం గతంలో రెండు పార్టీల్లో గెలిచిన ఓ అభ్యర్థిని ఇదే మొత్తం పంపిణీ చేయడంతో అభ్యర్థుల్లో గుబులు రేగుతోంది. నూజివీడులో రూ.500 నుంచి రూ.1500 వరకు పంపిణీ జరిగింది. ఓ వార్డులో స్వతంత్ర అభ్యర్థి ఓటుకు రూ.మూడు వేలు ఇవ్వడం గమనార్హం. జంగా రెడ్డిగూడెం లో ఓటుకు వెయ్యి పంపిణీపైనే పార్టీలు దృష్టిపెట్టాయి. 48 వేల ఓట్లకు గాను కనీసం 30 వేల ఓట్ల కొనుగోలు చేయాలని యోచిస్తు న్నట్లు తెలిసింది. ఓ వార్డులో ప్రధాన పార్టీలతో పోటీగా ఓ ఇండిపెండెంట్‌ అభ్యర్థి ఓటుకు రూ.వెయ్యి పంపిణీ చేసినట్లు సమాచారం. మరోవైపు ఒక్క ఓటు కూడా పోకుండా దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఛార్జీలు పెట్టుకుని రప్పించి ఓటుకు అదనంగా రూ.వెయ్యి పంపిణీ చేస్తున్నట్టు తెలిసింది.

పందేల జోరు

జంగారెడ్డిగూడెంలో పందేలు జోరుగా సాగుతున్నాయి. టీడీపీకి 8500 ఓట్లకు పైగా మెజారిటీ వస్తుందని పలువురు భారీగా పందే లు వేస్తున్నారు. టీడీపీకి 8500 ఓట్లకు పైగా మెజార్టీ వస్తే పందెం గెలిచినట్లని, అంతకంటే కంటే మెజారిటీ తక్కువ వస్తే పందెం ఓడి నట్టు రూ.కోట్లలో పందేలు కాస్తున్నారు.

Updated Date - Nov 01 , 2026 | 01:02 AM