Share News

స్పందించకుంటే ఓటు గల్లంతే!

ABN , Publish Date - Aug 22 , 2026 | 01:23 AM

జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(సర్‌)లో ఇంటి పేర్లు తప్పు, మార్పులకు సంబంధించిన నోటీసులు ఇచ్చారు.

స్పందించకుంటే ఓటు గల్లంతే!

వివరాలిచ్చిన ఓటర్లు 23,726

ఈనెల 22,23,29,30 తేదీల్లో ప్రత్యేక శిబిరాలు

ఏ ఒక్క ఓటు తొలగించకుండా చూడాలని ఈసీ ఆదేశం

జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(సర్‌)లో ఇంటి పేర్లు తప్పు, మార్పులకు సంబంధించిన నోటీసులు ఇచ్చారు. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు బీఎల్‌వోల ద్వారా వీటిని జారీ చేశారు. నోటీసులు అందుకున్న ఓటర్ల కోసం నేటి నుంచి ప్రత్యేక శిబిరాలు ఏర్పా టు చేస్తున్నారు. అయినా స్పందించ కుంటే ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉంది.

(ఏలూరు–ఆంధ్రజ్యోతి)

జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్‌)లో ఇంటి పేర్లు తప్పు, మార్పులకు సంబంధించిన నోటీసు లకు సరైన రీతిలో ఓటర్ల నుంచి స్పందన లభిస్తోంది. జిల్లాలో 74,086 మందికి ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నోటీసులను బీఎల్‌వోల ద్వారా అసిస్టెంట్‌ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు ఈ నెల మొదటి వారంలో జారీ చేశారు. వీటికి సంబంధించిన అర్హతా పత్రాలను చూపించని ఓటర్లకు అక్టోబరు మూడో తేదీన ప్రచురించే తుది జాబితాల నుంచి తొలగిస్తా మన్న సంకేతాలను ఇచ్చారు. అయితే ఓటర్లను జాబితా లో విచక్షణా రహితంగా తొలగించడానికి వీల్లేదని, పారదర్శకంగా, క్షుణంగా పరిశీలించాకే తుది నిర్ణయం తీసుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశాలను జారీ చేసింది.

2002 ఎన్నికల జాబితాలో వివరాల ప్రకా రం తండ్రి పేరు తప్పు, ఇంటి పేరు తప్పు లు, అభ్యర్థి వాస్తవ పేరుకు బదులుగా అద నంగా నమోదు కావడం తదితర వ్యవహారాల్లో 12 ఆఽధారాల్లో ఏదో ఒక్కటి చూపించి నోటీసుల హియ రింగ్‌లో బీఎల్‌ఎవోలకు సమర్పించాల్సి వుంటుంది. ఆధార్‌కార్డు, డ్రైవింగ్‌ లైసెన్సు, రేషన్‌కార్డు, పట్టాదార్‌ పాస్‌పుస్తకం, వివిధ సందర్భాల్లో ప్రభుత్వం జారీ చేసిన పత్రాలు, ఉద్యోగి గుర్తింపు కార్డులను నోటీసులకు జత చేర్చాల్సి వుంటుంది. జిల్లాలో నో మ్యాపింగ్‌ పరిధిలో ఓటర్లు ఎవరు లేకపోవడంతో ప్రత్యేకంగా తప్పుల సవ రణ, మార్పులు, చేర్పులపైనే బీఎల్‌వోలు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించనున్నారు.

అర్హతా పత్రాల సమర్పణలో కొంత జాప్యం

జిల్లాలో 74,086 మందికి వివిధ కారణాల రీత్యా ఓటర్ల జాబితా సవరణకు ఆధారాలను సమర్పించాలని 1,744 పోలింగ్‌ కేంద్రాల వారీగా బీఎల్‌వోలు 100 శాతం ఓటర్లను నోటీసులను జారీ చేశారు. కొంత సమయం ఇచ్చి తమను కలవాలని సూచించినా తమకు సమయం కుదరడం లేదని రెండురోజుల్లో కలుస్తామని ఓటర్ల నుంచి సమాధానాలు ఎదురు కావడంతో సర్‌ హియరింగ్‌లో కొంత జాప్యం చోటు చేసుకుంటోంది. జిల్లాలో ఇప్పటి వరకు 23,726 మంది నోటీసులు అందుకున్న వారు అర్హతా పత్రాలను సమర్పిం చారు. వీటిని తుది జాబితాలోకి చేర్చడానికి బీఎల్‌వోలు యాప్‌ ద్వారా అప్‌లోడ్‌ చేసి ఏఈఆర్వో లాగిన్‌ ద్వారా ఎన్నికల సంఘం డేటాకు అప్‌డేట్‌ అవుతుంది. ఈ జాబితాలను అక్టోబరు 3వ తేదీన తుది జాబితాలో ప్రచురిస్తారు.

నేటి నుంచి ప్రత్యేక శిబిరాలు

సర్‌ కార్యక్రమంలో నోటీసులు అందుకున్న ఓటర్ల కోసం, ప్రత్యేకంగా నూతన ఓటర్ల చేరిక, మార్పులు, చేర్పులు తదితర అంశాలపై ఈనెల 22 నుంచి ప్రత్యేక శిబిరాలను నిర్వహించనున్నారు. శని, ఆదివారాల్లో అనగా ఈనెల 22,23,29,30 తేదీల్లో సచివాలయాలు, పోలింగ్‌ కేంద్రాల పరిధిలో బీఎల్‌వోలు ప్రజలకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జాబితాలతో అందుబాటులో ఉంటారు. జూలై 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండినవారు కూడా ఓటర్లుగా నమోదుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ఈ ప్రత్యేక శిబిరాల్లో బీఎల్‌వోల ద్వారా సర్‌లో సవరణలు చేయించుకోవాలని జిల్లా యంత్రాంగం కోరుతోంది.

బీఎల్‌వోలు, సూపర్‌వైజర్లకు శుభవార్త

జిల్లాలో సర్‌ కార్యక్రమంలో పాల్గొన్న బీఎల్‌వోలు, సూపర్‌వైజర్లకు పారి తోషికాల కింద రూ.కోటి 32 లక్షలు జమ అయ్యాయి. వీటిని నియోజకవర్గాల వారీగా ఆయా మొత్తాలను బీఎల్‌వోలకు రూ. ఆరువేలు, సూపర్‌వైజర్లకు రూ.ఏడువేల చొప్పున ఏఈఆర్వోలు ట్రెజరీ అక్కౌంట్‌ ద్వారా మండలాల్లోని సిబ్బందికి విడుదల చేస్తారు.

Updated Date - Aug 22 , 2026 | 01:23 AM