పురపోరు.. జోష్
ABN , Publish Date - Oct 19 , 2026 | 12:54 AM
పురపోరులో నామినేషన్ల గడువు ముగియడంతో రాజకీయ పక్షాల్లో జోష్తో ఉన్నాయి. అన్ని పార్టీ తరపున అభ్యర్థులు ఎన్నికల బరిలో దిగినా కూటమి తరపున అత్యధికంగా నామినేషన్లు దాఖలయ్యాయి.
నరసాపురంలో 260.. ఆకివీడులో 119 నామినేషన్లు దాఖలు
నామినేషన్లకు ముగిసిన గడువు
పోటీపడ్డ అభ్యర్థులు
నేడు పరిశీలన
21న ఉపసంహరణ
పురపోరులో నామినేషన్ల గడువు ముగియడంతో రాజకీయ పక్షాల్లో జోష్తో ఉన్నాయి. అన్ని పార్టీ తరపున అభ్యర్థులు ఎన్నికల బరిలో దిగినా కూటమి తరపున అత్యధికంగా నామినేషన్లు దాఖలయ్యాయి. వైసీపీ కూడా ప్రతివార్డులోనూ పోటీ పడేలా అభ్యర్థులతో నామినేషన్లు దాఖలు కు చర్యలు తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ కూడా మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి దిగింది.
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
జిల్లాలో నరసాపురం మున్సిపాలిటీ, ఆకివీడు నగర పంచా యతీలో తొలి విడత ఎన్నికలు నిర్వహిస్తున్నారు. భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు మున్సిపాలిటీల్లో మలి విడతలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికలు నిర్వహి స్తున్న పట్టణాల్లో నామినేషన్ల దాఖలుకు ఆదివారం తుది గడువు కావడంతో అధిక సంఖ్యలో నామినేషన్లు దాఖల య్యాయి. నరసాపురంలో 36 వార్డులకు, ఆకివీడులో 28 వార్డు లకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల కు కూటమి, వైసీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి నామినేషన్లు దాఖలయ్యాయి.
ఏకతాటిపై కూటమి
పట్టణ ఎన్నికలు నిర్వహిస్తున్న రెండు చోట్ల కూటమి నేత లంతా ఏకతాటిపైకి వచ్చి చైర్మన్ అభ్యర్థులకు మద్దతు పలి కారు. కార్యకర్తలతో కలసి నామినేషన్ కేంద్రాల వద్దకు జోష్తో వెళ్లారు. ముఖ్య నేతలంతా నామినేషన్ కార్యక్ర మంలో చైర్మన్ అభ్యర్థులకు సంఘీభావం తెలిపారు. కూటమి తరపున నరసాపు రం నుంచి కొత్తపల్లి శైలజ, ఆకివీడు నుంచి డాక్టర్ నిలోఫర్ నామినేషన్ వేశారు. వైసీపీ నుంచి మాత్రం నరసాపురంలో ఇద్దరు మహిళా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. స్థానిక నాయకత్వం వ్యూహాత్మకంగా ఇద్దరితో నామినేష న్ వేయించి రామసీతను వైసీపీ అధికారికం గా ప్రకటించింది. బర్రి వెంకటరమణ విత్డ్రా అయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ తరపున న్యాయవాది సంతోషి కుమారి నామినేషన్ వేశారు. ఇక ఆకివీడులో వైసీపీ అభ్యర్థిగా మనే ్న లలితాదేవి, కాంగ్రెస్ తరపున గంధం పార్వతి నామినేషన్ దాఖలు చేశారు.
వార్డుల బరిలో నిలిచేదెవరు
నరసాపురంలో కూటమి తరపున ఒకే వార్డులో ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. తక్కువ వ్యవధి ఉండ డంతో ఏ వార్డు ఏ పార్టీకి, ఎవరికి అనేది తేల్చుకోలేక పోయారు. దాంతో కూటమి నేతలు సూచించిన అభ్యర్థులతో పాటు, ఇతరులు కూడా నామినేషన్లు దాఖలు చేశారు. నర సాపురం మున్సిపాలిటీలోని ఆరు వార్డుల్లో ఇలాంటి పరిస్థితి ఉంది. ఆకివీడులో మాత్రం ముందస్తు ప్రణాళిక ప్రకారం నామినేషన్లు పడ్డాయి. ఉపసంహరణ నాటికి రెండు పట్టణా ల్లో కూటమి తరపున ఒకే అభ్యర్థి ఉండేలా నేతలు ప్రయత్నా లు ప్రారంభించారు. సోమవారం నామినేషన్లు పరిశీలిస్తారు. అభ్యంతరాలుంటే తిరస్కరిస్తారు. వీటిపై అభ్యర్థుల నుంచి మంగ ళవారం అభ్యంతరాలను స్వీకరించనున్నారు. ఈ నెల 21న విత్డ్రా చేయనున్నారు. ఆ తర్వాత ఉండే అభ్యర్థులంతా బరిలోనే ఉంటారు. అదే రోజు కూటమి, వైసీపీ, కాంగ్రెస్ నేతలు తమ పార్టీనుంచి పోటీ చేసే అభ్యర్థులకు మ్యాండేట్లు ఇవ్వనున్నారు. వారే ఆయా పార్టీల తరపున పోటీ చేయను న్నట్టు ఎన్నికల అధికారులు ప్రకటించి పార్టీ గుర్తులను కేటాయిస్తారు. వామపక్షాల అభ్యర్థులుంటే వారి గుర్తు లభించనుంది. ఇతరులకు స్వతంత్రులుగా పరిగణించి ఎన్నికల అధికారులు వేరే గుర్తులు కేటాయించనున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకునే రెబల్ అభ్యర్థులు పోటీ నుంచి విరమించుకునే అవకాశం ఉంది. ఉపసంహరణ రోజున ఎవరి కూటమి తరపున పోటీ చేస్తారో ఎవరు తప్పుకొంటారో తేలనుంది.
నరసాపురంలో నామినేషన్ల జోరు
నరసాపురం, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): మునిసిపల్ ఎన్నికల నామినేషన్ల ఘట్టం అదివారం ముగిసింది. మూడు రోజులుగా సాగిన నామినేషన్ల ప్రక్రియలో చైర్పర్సన్ పదవికి ఐదుగురు అభ్యర్థులు 12, 36 వార్డులకు 164 మంది అభ్యర్ధులు 248 నామినేషన్లు దాఖలు చేశారు. నరసాపురం మునిసిపాలిటీలో మొత్తం 260 నామినేషన్లు దాఖలయ్యాయి.
చివరి రోజు పోటెత్తారు
చివరి రోజు ఆదివారం నామినేషన్ల వేసేందుకు అభ్యర్థులు క్యూ కట్టారు. కౌన్సిలర్లుగా పోటీ చేసేందుకు 107 మంది 161 నామినేషన్లు వేశారు. చైర్పర్సన్ పదవికి ముగ్గురు అభ్యర్థులు 7 నామినేషన్లు వేశారు. సోమవారం పరిశీలన, మంగళవారం ఉపసంహరణ ఉంది. చివరి రోజున బీఫాం దాఖలు చేసిన వారు పార్టీ అభ్యర్థులుగా బరిలో ఉంటారు. మిగిలిన వారు ఉపసంహారించుకోపోతే స్వతంత్ర అభ్యర్థులు గా ఉంటారు. ఆర్డీవో దాసి రాజు, డీఎస్పీ సుధాకర్రావు, కమిషనర్ వెంకట్రామిరెడ్డి, ఆర్వో మురళీ, సీఐ రఘు నామినేషన్ ప్రక్రియ, బందోబస్తును పరిశీలించారు.
వార్డుల్లో ఇద్దరు, ముగ్గురు నామినేషన్లు
మున్సిపల్ పోరులో కూటమిలో పోటీ నెలకొంది. సీటు కోసం చివరి వరకు ప్రయత్నించి అధినాయకులు అంగీకారం పొందలేకపోయారు. అయినప్పటికీ కొన్ని వార్డులలో నామి నేషన్లు దాఖరలు చేశారు. చివరికి ఎవరు ఎన్నికల బరిలో ఉంటారన్నది చర్చనీయాంశమైంది. ఆరో వార్డులో మాజీ కౌన్సిలర్ ఆరేటి వేణు టీడీపీ తరుపున నామినేషన్ వేశారు. ఇదే వార్డు నుంచి బీజేపీ అభ్యర్థిగా న్యాయవాది సత్యకృష్ణ నామినేషన్ వేశారు. ఏడో వార్డులో టీడీపీ అభ్యర్థిగా బెజవాడ రమేష్, తుమ్మలపల్లి వెంకటరమణ నామినేషన్లు వేశారు. 22లో జనసేన నుంచి దొండపాటి స్వామి, సోడదాసి శ్రీధర్ నామినేషన్లు వేశారు. 27 నుంచి జనసేన నుంచి మాజీ కౌన్సిలర్ వన్నెంరెడ్డి శ్రీను, కోటి నామినేషన్లు వేశారు.
ఆకివీడులో చివరి రోజు 81 నామినేషన్లు
ఆకివీడు, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): నగర పంచాయతీ కార్యాలయంలో నామినేషన్ల దాఖలుతో కోలాహలం నెలకొంది. ఆదివారం చివరి రోజు కావడంతో టీడీపీ, జనసేన, బీజేపీ, వైసీపీ, సీపీఎం, కాంగ్రెస్ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు. మొత్తం 119 నామి నేషన్లు దాఖలు కాగా చైర్పర్సన్ పదవికి 3, వార్డులకు 116 దాఖలయ్యాయి. ఈ నెల 16న 1, 17న 37, 18న 81 నామి నేషన్లు దాఖలైతే ఆదివారం అత్యధికంగా నామినేషన్లు వేశా రు. టీడీపీ నుంచి చైర్మన్కు ఒకటి, కౌన్సిలర్లకు 35 మంది, జనసేన కౌన్సిలర్లకు 14 మంది, బీజేపీ కౌన్సిలర్లకు–నలుగురు, వైసీపీ చైర్మన్కు 1, కౌన్సిలర్లకు 45 మంది, సీపీఎం కౌన్సిలర్లకు–9 మంది, కాంగ్రెస్ చైర్మన్ ఒకటి, వార్డుల్లో స్వతంత్ర అభ్యర్థులు 9మంది నామినేషన్లు వేశారు.