నామినేషన్లకు సర్వం సిద్ధం
ABN , Publish Date - Oct 16 , 2026 | 12:33 AM
మునిసిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు ఆధికార యంత్రాంగం ఆన్ని ఏర్పాట్లను రఢీ చేసింది.
నరసాపురంలో పది కౌంటర్లు.. ఆకివీడులో 8
ఉదయం 11 నుంచి సాయంత్రం 5 వరకు స్వీకరణ
పన్ను బకాయిలు చెల్లింపునకు క్యూ కట్టిన అభ్యర్థులు
ఒక్కరోజే నరసాపురంలో రూ.3 లక్షలు,
ఆకివీడులో రూ.1.92 లక్షలు వసూలు
నరసాపురం, అక్టోబరు 15(ఆంద్రజ్యోతి): మునిసిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు ఆధికార యంత్రాంగం ఆన్ని ఏర్పాట్లను రఢీ చేసింది.పురపాలకంలో పది కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఒక్కొక్క కౌంటర్కు నాలుగు వార్డులు కేటాయించారు. మొత్తం పది మంది రిటర్నింగ్ అధికారుల్ని నియమించారు. చైర్పర్సన్ నామి నేషన్కు ప్రత్యేకంగా ఒక గదిని కేటాయించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఆభ్యర్ధుల వెంట ఇద్దర్ని మాత్రమే అనుమతిం చనున్నారు. పోటీ చేసే ఆభ్యర్ధి పట్టణ పరిధిలో ఓటు కలిగి ఉండాలన్నారు. ఇటు బలపర్చే ఆభ్యర్ధి ఆ వార్డులో ఒటర్ ఉండాలి.
ఒక్కరోజే 50 మంది బకాయిలు చెల్లింపు
పోటీలో నిలిచే ఆభ్యర్ధులు పురపాలక సంఘానికి ఎటువంటి బకాయిలు ఉండరాదు. దీంతో నోడ్యూ సర్టిఫికెట్ కోసం ఉదయం నుంచి అభ్యర్థ్ధులు క్యూ కట్టారు. ఇంటి, కుళాయి పన్ను బకా యిలు చెల్లించారు. సుమారు 50 మంది వరకు పన్నుల బకాయిలు చెల్లించి సర్టిఫికెట్లు తీసు కున్నారు.దీంతో గురువారం ఒక్కరోజే పుర పాలక సంఘానికి రూ.3 లక్షల వరకు ఆదాయం వచ్చింది.
ఆకివీడులో 8 కౌంటర్లు
ఆకివీడు, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి) : నగర పంచాయతీలో నామినేషన్లకు సర్వం సిద్ధం చేశారు. పట్టణ పరిధిలో 28 వార్డులకు 8 కౌంటర్లు ఏర్పాటు చేశారు. నో డ్యూ సర్టిఫికెట్ల కోసం అభ్యర్థులు క్యూకట్టారు. ఒక్కరోజులో గురువారం 15 మంది సర్టిఫికెట్లు తీసుకున్నారు. రూ.1.92 లక్షలు బకాయిలు చెల్లించారు.
నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు : కమిషనర్
ఆకివీడు, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): నగర పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేశామని కమిషనర్ జి.కృష్ణమోహన్ తెలిపారు. శుక్రవారం నుంచి నామినేషన్లు స్వీకరించనున్న నేపథ్యంలో గదులను పరిశీలించారు. ఎన్నికల నియమావళి ప్రకారం నామినేషన్ల కేంద్రాల పరిసర ప్రాంతాల్లో వంద మీటర్ల పరిధి వరకూ ఎవరినీ అనుమతించమన్నారు. చైర్పర్సన్, వార్డులు వారీగా ప్రత్యేక నామినేషన్ కౌంటర్లు, హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశామన్నారు. అనంతరం నగర పంచాయతీ కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణకు సంబంధించి ఎన్నికల అధికారులకు శిక్షణ ఇచ్చారు. నామినేషన్ పత్రాలను వార్డుల వారీగా అత్యంత భద్రంగా ఉంచాలన్నారు. నిర్దేశిత సమయం ముగిసిన తరువాత వచ్చే నామినేషన్లు ఎట్టి పరిస్థితుల్లో స్వీకరించకూడదన్నారు. తహసీల్దార్ దశిక వంశీ, ఎక్సైజ్ సీఐ అల్లు వాసువేణి, ఎస్ఐ కె.శుభశేఖర్, ఎంఈవో ఎ.రవీంద్ర, నగర పంచాయతీ మేనేజర్ వెంకటేశ్వరరావు, ఏఈ నిమ్మల విజయ్కుమార్, ఈవోపీఆర్డీ సుజాత, శానిటరీ ఇన్స్ఫెక్టర్ శాకేత్ తదితరులు ఉన్నారు.