Share News

యూరియా కొరత లేదు

ABN , Publish Date - Jan 14 , 2026 | 01:08 AM

యూరియా కొరత వల్ల రైతులు అవస్థలు పడుతున్నారంటూ కూట మి ప్రభుత్వంపై వైసీపీ దుష్ప్రచారం చేయడం దిగజారుడు రాజకీయాలను నిదర్శనమని రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు.

యూరియా కొరత లేదు
రైతులతో మాట్లాడుతున్న మంత్రి పార్థసారథి

‘యూరియా కోసం రైతుల పాట్లు’

సోషల్‌ మీడియాలో వైసీపీ కార్యకర్త పోస్టుపై విచారణకు సీఎం ఆదేశం..

విచారణ జరిపిన మంత్రి పార్థసారధి

సమృద్ధిగా దొరుకుతుందని రైతుల స్పష్టీకరణ.. వైసీపీపై కొలుసు ఆగ్రహం

చాట్రాయి, జనవరి 13(ఆంధ్రజ్యోతి):యూరియా కొరత వల్ల రైతులు అవస్థలు పడుతున్నారంటూ కూట మి ప్రభుత్వంపై వైసీపీ దుష్ప్రచారం చేయడం దిగజారుడు రాజకీయాలను నిదర్శనమని రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘యూరి యా కోసం రైతుల పాట్లు’ క్యాప్షన్‌తో చాట్రాయి మం డలం నరశింహారావుపాలెం పీఏసీఎస్‌లో యూరియా కోసం రైతులు క్యూలో నిలబడి వున్న ఫొటోను వైసీపీ కార్యకర్త ఒకరు సోషల్‌ మీడియాలో ఇటీవల పోస్టు చేశాడు. ఈ విషయం సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లడంతో రైతుల నుంచి వాస్తవాలు తెలుసుకుని తనకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి మంత్రి నరశింహారావుపాలెం వచ్చి రైతులతో మాట్లాడారు. యూరియా పంపిణీకి సంబంధించిన రికార్డులను పరిశీలించారు. తమకు ఇబ్బంది లేకుం డా యూరియా దొరుకుతున్నట్లు రైతులు తెలిపారు. మంత్రి మాట్లాడుతూ ఈ గ్రామానికి వైసీపీ హయాంలో ఏడాదికి 260 టన్నులు ఇవ్వగా, తమ ప్రభుత్వంలో గత సీజన్‌లో 422 టన్నులు, ఈ సీజన్‌లో 407 టన్నులు ఇచ్చామన్నారు. రబీలో జిల్లాకు 10,736 టన్నులు అవసరం కాగా, 12,818 టన్నుల నిల్వలు ఉన్నాయని తెలిపారు. జేడీఏ హబీబ్‌ బాషా, తహసీల్దార్‌ భద్రు, ఎంపీడీవో సత్యనారాయణ, పీఏసీఎస్‌ చైర్మన్‌ కట్టా నాగ దుర్గారావు, ఏడీఏ భవానీ, ఏవో శివశంకర్‌ తదితరు లు పాల్గొన్నారు.

Updated Date - Jan 14 , 2026 | 01:08 AM