Share News

చినుకు రాలడం లేదు

ABN , Publish Date - Jul 14 , 2026 | 12:01 AM

ఎల్‌నినో అంటున్నారు.. ఇది ఎన్నాళ్లు.. అసలు వర్షాలు కురుస్తాయా.. రైతులు వేసిన పంటల పరిస్థితి ఏమిటి? ఈ ఎండలకు పంటలు మనగలుగుతాయా? వేసవిని తాపంతో ఇళ్లల్లో కూర్చోలేక బయటకు వెళ్లలేక గ్రామాల్లోని చెట్ల కింద రచ్చబండలపైకి చేరిన ప్రజల మధ్య జరుగుతున్న చర్చ ఇది.

చినుకు రాలడం లేదు
సత్యనారాయణపురం గ్రామాల్లో నారు మళ్లు బతికించుకునేందుకు ట్యాంకర్లతో నీటిని తర లిస్తున్నారు

చినుకు రాలడం లేదు

– ఏలూరుసిటీ

ఎల్‌నినో అంటున్నారు.. ఇది ఎన్నాళ్లు.. అసలు వర్షాలు కురుస్తాయా.. రైతులు వేసిన పంటల పరిస్థితి ఏమిటి? ఈ ఎండలకు పంటలు మనగలుగుతాయా? వేసవిని తాపంతో ఇళ్లల్లో కూర్చోలేక బయటకు వెళ్లలేక గ్రామాల్లోని చెట్ల కింద రచ్చబండలపైకి చేరిన ప్రజల మధ్య జరుగుతున్న చర్చ ఇది. అంతకంతకూ పెరుగు తున్న ఉష్ణోగ్రతలను చూస్తుంటే వర్షాలు కురుస్తాయనే నమ్మకం సడలిపోతోంది. రైతుల ఆశలు ఆవిరి అవుతు న్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినా మబ్బులు మురిపించడం తప్ప చినుకు రాలడం లేదు. సాయంత్రం అయితే మబ్బులు కమ్మేసి రాత్రికి వర్షం కురుస్తుందేమో అన్న ఆనందం ఉదయం తెల్లారగానే సూర్యుడి తాపానికి ఆవిరవుతోంది.. గతంలో ఎల్‌నినో ప్రభావం ఉన్నప్పటికీ క్యుములోనింబస్‌ మేఘాల ప్రభావంతో వర్షాలు కురిశాయి. అయితే ప్రస్తుత పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. దీంతో చిన్నా పెద్దా వరుణదేవా కరుణించవా అని వేడుకుంటున్నారు..

ఏలూరులో 38 డిగ్రీల ఉష్ణోగ్రత

జిల్లా కేంద్రమైన ఏలూరులో సోమవారం పగటి పూట 38 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత నమోదైంది. గత మూడ్రోజులుగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఎండల తీవ్ర తతో ప్రజలు అల్లాడిపోతున్నారు. వర్షాకాలంలో కూడా ఎండల తీవ్రతను భరించలేక నానా అవస్థలు పడుతు న్నారు. ఉదయం 8గంటల నుంచే వడగాడ్పులు తీవ్రత కొనసాగుతోంది. రాత్రి 7గంటలైనా ఉక్కబోత కనిపి స్తోంది. ఈ నెల 17 తర్వాతే బంగాళాఖాతంలో అల్పపీ డనం ఏర్పడి వర్షాలు కురిసే అవకాశం ఉందని, అవి కూడా కొన్ని రోజులే ఉంటాయని చెబుతున్నారు. పాలకొ ల్లులోని బుధవారపు వీధి మొత్తం ఖాళీగా దర్శమిచ్చింది. ఉష్ణోగ్రతలకు తాళలేక కలిదిండిలో ప్రధాన రహదారులు నిర్మాణుష్యంగా ఉన్నాయి. సాయంత్రం 5గంటల వరకు జనం రోడ్డు పైకి రావడంలేదు. మధ్యాహ్నం వేళల్లో పలు దుకాణాలు మూసివేస్తున్నారు. ఆషాఢమాసంలో అయినా ఉష్ణోగ్రతలు తగ్గి చుక్క చినుకు రాలకపోతుందా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు.

ఎండిపోతున్న నారుమళ్లు..

దెందులూరు/కలిదిండి, జూలై 13(ఆంధ్రజ్యోతి): సీతంపేట కాలువకు నీరు వదలకపోవడంతో వేసిన నారుమళ్లు ఎండిపోతున్నాయి. దీంతో మండలంలో దెందులూరు,సత్యనారాయణపురం గ్రామాల్లో నారు మళ్లు బతికించుకునేందుకు ట్యాంకర్లతో నీటిని తర లిస్తున్నారు.సత్యనారాయణపురం గ్రామాల పరిధిలో సోమవారం ఉదయం వాటర్‌ ట్యాంకర్‌తో నారుమళ్లు తడిపి బతికించే ప్రయత్నం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఇప్పటికే కొంత మేర ఊడ్పులు చేపట్టారు. కనీసం నారుమళ్లకు కూడా నీరు అం దడం లేదు. నారుదశలోనే ఇలా ఉంటే నాట్లు వేసిన తరువాత పరిస్థితి ఏమిటని రైతుల్లో ఆందోళన నెలకొంది. సీతంపేట కాలువకు నీటిని విడుదల చేయా లని దెందులూరు, సత్యనారాయణపురం, ఉండ్రాజవరం, రైతులు ముక్త కంఠంతో కోరుతున్నారు. కలి దిండి మండలంలోని కోరుకొల్లు, సానారుద్రవరం, గోపాలపురం గ్రామాల్లో సుమారు 2వేల ఎకరాల్లో నారుమళ్లు ఎండిపోతున్నాయి. నాలుగు రోజుల్లో నీరు విడుదల చేయ్యకపోతే వరి చేతికందదని ఆం దోళన చెందుతున్నారు.ఇప్పటికైనా సంబంధిత ఉన్న తాధికారులు స్పందించి వరి పొలాలకు సాగునీరు విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు.

బావురుమంటున్న బోరుబావులు

చాట్రాయి: చినుకు జాడ లేకపోవడంతో బోరుబావుల నుంచి నీటి లభ్యత క్రమంగా తగ్గిపోతోంది. చాట్రాయి మండలంలో రైతులంతా బోరుబావులపైనే ఆధారపడ్డారు. చాట్రాయి, బూరుగుగూడెం, జనార్దనవరం, ఆరుగొలనుపేట గ్రామాల్లో బోరుబావుల కింద ఇప్పటికే సుమారు 2 వేల ఎకరాల్లో నాట్లు వేశారు. నీటి లభ్యత తగ్గుముఖం పట్టడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. మండలంలో 112 సాగునీటి చెరువులు ఉండగా, కొన్నింటిలో మాత్రమే నీరుంది. మిగతా చెరువుల్లో చుక్క నీరు లేదు. తమ్మిలేరు ప్రాజెక్టు వట్టిపోయింది. మండలంలో మొత్తం 13,200 ఎకరాలు వరిసాగు చేస్తున్నారు.

పూర్తి స్థాయిలో విడుదల కాని నీరు

ముదినేపల్లి: అరకొరగా వేసిన నారుమళ్లకు కూడా నీరందడంలేదు. కృష్ణా తూర్పు డెల్టాకు శివా రున ఉన్న కైకలూరు నియోజకవర్గంలోని వరిసాగు చేసే సుమారు 32 వేల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందడంలేదు.. నియోజకవర్గంలోని ముదినేపల్లి, మండవల్లి, కలిదిండి, కైకలూరు మండలాలకు చెం దిన ఆయకట్టుకు నిత్యం 1100క్యూసెక్కుల నీరు అవ సరం కాగా సుమారు 400 క్యూసెక్కులే విడుదల చేస్తున్నారు. అరకొరగా సరఫరా చేస్తున్న ఈ నీరుపై కెనాల్స్‌ పరిధిలోని పొలాల సాగునీటి అవసరాలకు చాలడం లేదు.

భయపెడుతున్న ఎల్‌నినో

ఎల్‌నినో ప్రభావం రైతులను భయపెడుతోంది. పరిస్థితిని ముందే గమనించిన రాష్ట్ర ప్రభుత్వం ఎల్నీనోను తట్టుకో వడానికి వీలుగా ఆరుతడి పంటల సాగును ప్రోత్సహిస్తోంది. వర్షాలు సకాలంలో కురవకపోతే ఇబ్బందులు తప్పవని చెబుతున్నా రు.కొంతలో కొంత మేలన్నట్టు ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల వల్ల గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. గోదావరి కాల్వల కింద పశ్చిమడెల్టాలో పంటల సాగు సజావుగా సాగే అవకాశాలున్నాయి. కృష్ణా నదిపై ఆధారపడిన మండలాల్లో ఇబ్బందులు కనిపిస్తున్నాయి.Ðó

Updated Date - Jul 14 , 2026 | 12:01 AM